సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు మహిళా భక్తులతో సందడిగా కనిపించడానికి కారణం?

సుబ్రహ్మణ్య స్వామి పేరు వినే ఉంటారు. శివ పార్వతుల రెండవ కుమారుడు, వినాయకుడి తమ్ముడు అయిన సుబ్రహ్మణ్యస్వామి. ఆయననే భక్తులు కుమారస్వామి, కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహూడు అనే పేర్లతో పిలుచుకుంటారు. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టిన వాడు కాదు, కధా క్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు.

Subramanya Swamiఒకచేతిలో మహాశక్తి అయుదాన్ని, ఒకచేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొకచేతిని కటిపై ఉంచి, మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీసుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుడు అంశతో మార్గశిర శుద్దషష్టి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు.

Subramanya Swamiకుమారస్వామి జన్మించిన విధానాన్నిబట్టి ఆయనకి అనేక నామాలు ఏర్పడ్డాయి. ఈ కారణంగానే కుమారస్వామి జన్మించిన మార్గశిర శుద్ధ షష్ఠి కుమార షష్ఠిగా సుబ్రహ్మణ్య షష్ఠిగా స్కంద షష్ఠిగా కార్తికేయ షష్ఠిగా పిలవబడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రధాన దైవంగా అనుగ్రహించే స్వామి, మరికొన్ని ప్రాంతాల్లో పరివార దేవతగా కొలువుదీరి కనిపిస్తూ ఉంటాడు.

Subramanya Swamiకొన్నిచోట్ల శక్తి ఆయుధాన్ని ధరించి బాలుడి రూపంలో దర్శనమిస్తాడు. మరికొన్ని చోట్ల సర్పరూపంలో పూజలందుకుంటూ ఉంటాడు. సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన సర్పదోషం తొలగిపోయి సంతానం కలుగుతుందని చెప్పబడుతోంది. అందువల్ల ఈ స్వామి ఆలయాలు మహిళా భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి. అందుకు ఒక కథ కూడా ఉంది.

Subramanya Swamiఒక రోజు పార్వతి, పరమేశ్వరులను దర్శించడానికి అనేక మంది తాపసులు కైలసానికి వస్తారు. అందులో దిగంబర ఋషులు ఉండటంతో సుబ్రమణ్యస్వామి హేళనగా నవ్వాడు. దానికి పార్వతిదేవి పుత్రుని మందలించి, మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్టించినవి, జాతికి జన్మస్థానాలు అని తెలియచెప్పింది. తల్లి జ్ఞాన భోధతో సుబ్రమణ్యస్వామి సర్పరూపం దాల్చాడు కొంతకాలం. జీవకణాలు పాముల్లా ఉంటాయని మనకు తెలిసిందే. ఆ తర్వాత వాటికి అధిపతి అయాడు. అందువల్లే జీవకణాల అధిపతి అయిన సుబ్రమణ్యస్వామిని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుంది చాలా మంది నమ్మకం.

Subramanya Swamiసుబ్రహ్మణ్యస్వామి జన్మించిన రోజున ఉపవాస దీక్షను చేపట్టి అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తారు. ఆలయానికి వెళ్లి స్వామివారికి పూజాభిషేకాలు జరిపిస్తారు. పుట్టలో పాలుపోసి బెల్లం అరటిపండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. సంతానం కోసం సుబ్రహ్మణ్యషష్టి రోజున సుబ్రహ్మణ్యస్వామిని తప్పకుండా స్తుతించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR