Home Health పెరుగు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

పెరుగు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

0
పూర్వపు రోజుల్లో భోజనం అంటే కచ్చితంగా చివర్లో పెరుగో, మజ్జిగో ఉండాల్సిందే. అవి లేకుండా భోజనం ముగించేవారు కాదు. కానీ ఇప్పుడు ఏదో ఒక కర్రీ వేసుకోవడం, హడావిడిగా ఏదో తిన్నామా అంటే తిన్నాం అన్నట్టు భోజనం ముగించేస్తున్నారు. చాలామందికి పెరుగంటేనే పడదు. పెరుగు పేరు ఎత్తితేనే యాక్ అంటారు.పెరుగును చూడగానే అదేదో తినకూడని పదార్థంలా ఫీలయ్యేవారూ ఉన్నారు.
How Many Health Benefits Due To Yogurt
కనీసం తమ జీవితంలో ఒక్కసారి కూడా పెరుగును టేస్ట్ చేయని వాళ్లు ఉన్నారు. ఇంకొందరైతే.. పెరుగు తింటే జలుబు చేస్తుందని.. బరువు పెరుగుతామని భ్రమ పడతారు. అందుకే.. పెరుగును ముట్టుకోరు. అసలు విషయమేంటంటే ఆ పెరుగే ఆరోగ్యానికి దివ్య ఔషధం లాంటిది. పలు రకాల కారణాలతో పెరుగును పక్కన పెట్టేవాళ్లు మాత్రం చాలా ఆరోగ్య ప్రయోజనాలను మిస్ అవుతున్నారు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. భోజనం చేసిన ప్రతిసారీ ఎవరైతే పెరుగు లేదా మజ్జిగతో ముగిస్తారో వారి ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. ప్రతి రోజు కనీసం ఒక్కసారి అయినా పెరుగును తినాల్సిందే. అలా తింటేనే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. లేదంటే చాలా నష్టం. అసలు.. పెరుగు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.
పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఎముకలు గట్టిపడతాయి. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు రోజూ కప్పు పెరుగు తింటే మంచి ఫలితం ఉంటుంది. తీవ్ర జలుబుతో బాధపడేవారు పెరుగులో కాస్తా మిరియాల పొడి, బెల్లం పొడి కలిపి తింటే ఉపశమనం కలుగుతుంది. నేరుగా పెరుగు తినడం ఇష్టంలేనివారు, మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు. మజ్జిగలో కాస్తా నిమ్మరసం, ఉప్పు, జీలకర్ర పొడి కలుపుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
జిగట విరేచనాలతో బాధపడేవారు పెరుగులో కొంచెం మెంతులు కలుపుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. వాతం, కఫాలను తగ్గించే గుణాలు పెరుగులో పుష్కలంగా ఉన్నాయి. పెరుగులో కాస్తా ఉప్పు కలుపుకుని తినడం వల్ల అజీర్తి సమస్యులు తగ్గుతాయి. శరీరంలో నీరు చేరినవారు పెరుగును ఎక్కవగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
పెరుగులో ఎటువంటి మినరల్స్, విటమిన్లు ఉండవని చాలామంది అనుకుంటారు. కానీ.. పెరుగులో చాలా మినరల్స్ ఉంటాయి. కాల్షియం, భాస్వరం, ప్రొటీన్లు, లాక్టోస్ పెరుగులో ఉంటాయి. పెరుగులో ఉండే కాల్షియం వల్ల.. శరీరంలోని ఎముకలు దృఢంగా తయారు అవుతాయి. అలాగే.. దంతాలు కూడా గట్టి పడుతాయి. మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. ఖచ్చితంగా పెరుగు తినాల్సిందే. పెరుగుతో పాటు.. మజ్జిగను కూడా రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి.
పెరుగును అలాగే తినకుండా.. పెరుగులో ఎండుద్రాక్షను కలుపుకొని తింటే.. విటమిన్ ఏ, బీ, సీ, బీ12 అందుతాయి. అలాగే.. పెరుగులో మిరియాల పొడిని కలుపుకొని తిన్నా.. జలుబు తగ్గుతుంది. నీరసం ఉన్నా.. అలసటగా ఉన్నా.. పెరుగులో కాసింత చక్కెర కలుపుకొని తింటే శరీరానికి వెంటనే తగిన శక్తి లభిస్తుంది. హైబీపీ ఉన్నా కూడా రోజూ పెరుగు తినండి. ఇన్ఫెక్షన్లు ఉన్నా పెరుగు, తేనె కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
అయితే.. పెరుగు కంటే కూడా మజ్జిగలో ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మజ్జిగలో కాసింత నిమ్మరసం వేసుకొని తాగాలి. ఉప్పు, జీలకర్ర పొడి వేసుకొని తాగినా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే.. డీహైడ్రేషన్ సమస్య ఉన్నవాళ్లు.. మజ్జిగ తాగితే చాలామంచిది.

Exit mobile version