Home Health చంటి పిల్ల‌ల‌కు ఎంత నిద్ర అవ‌స‌రం ? దానికి గల కారణాలు ఏంటి ?

చంటి పిల్ల‌ల‌కు ఎంత నిద్ర అవ‌స‌రం ? దానికి గల కారణాలు ఏంటి ?

0

మారుతున్న జీవనశైలి అన్ని రకాల వయసుల వారికి నిద్రను దూరం చేసినట్లే పసిపిల్లలకూ నిద్ర సమయాన్ని తగ్గించేసింది. ఏ మ‌నిషికైనా రోజుకి 6 నుంచి 8 గంట‌ల నిద్ర క‌చ్చితంగా కావ‌ల్సిందే. ఇక పిల్ల‌లు, వృద్ధుల‌కు నిత్యం 10 గంట‌ల వ‌ర‌కు నిద్ర అవ‌స‌రం. మరి చంటి పిల్ల‌ల‌కు ఎంత నిద్ర అవ‌స‌రం అవుతుందో, అస‌లు వారు ఎందుకు ఎక్కువగా నిద్రపోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చంటి పిల్ల‌ల‌కు ఎంత నిద్ర అవ‌స‌రంచంటి పిల్ల‌ల‌కు రోజుకి 17 గంట‌ల నిద్ర అవ‌స‌రం. అంతసమయం నిద్ర పోతేనే వారి శ‌రీర ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. 0 నుంచి 3 నెల‌ల వ‌య‌స్సు ఉన్న పిల్ల‌లు నిత్యం 14 నుంచి 17 గంట‌ల వ‌ర‌కు నిద్ర‌పోవాలి. అదే 4 నుంచి 11 నెల‌ల వ‌య‌స్సు ఉన్న పిల్ల‌లైతే 12 నుంచి 16 గంట‌ల వ‌ర‌కు నిద్ర‌పోవాలి. అలాగే 12 నుంచి 35 నెల‌ల వ‌య‌స్సు ఉన్న చిన్నారులు నిత్యం 11 నుంచి 14 గంట‌ల వ‌ర‌కు నిద్ర‌పోవాలి.

చంటి పిల్ల‌లు ఎక్కువ‌గా నిద్రిస్తే అది వారి శారీరిక, మానసిక అభివృద్ధికి ఎక్కువ సహాయపడుతుంది. నిద్ర ఎక్కువ‌గా పోయే చంటి పిల్ల‌లే త్వ‌ర‌గా ఎదుగుతార‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. నిద్ర‌లో శ‌రీరం అనేక జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌ర్తిస్తుంటుంది. ఆ స‌మ‌యంలో పిల్ల‌ల్లో ఎదుగుద‌ల హార్మోన్లు విడుద‌ల‌వుతాయి. అదే నిద్ర స‌రిగ్గా లేక‌పోతే ఆ హార్మోన్లు విడుద‌ల కాక ఎదుగుద‌ల స‌రిగ్గా ఉండ‌దు. శ‌రీర నిర్మాణం కూడా స‌రిగ్గా జ‌ర‌గ‌దు.

పిల్ల‌ల‌కు భ‌విష్య‌త్తులో నాడీ సంబంధ స‌మ‌స్య‌లు రాకుండా ఉండాలంటే వారిని చిన్న వ‌య‌స్సులో బాగా నిద్ర‌పోయేలా చేయాలి. దీంతో వారు ఎదుగుతున్న కొద్దీ మెద‌డు ప‌రంగా స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. చిన్న‌త‌నంలో బాగా నిద్రించే వారి మెద‌డు ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. వారు అమోఘ‌మైన తెలివితేట‌లు క‌ల‌వారిగా మారుతారు. చ‌దువుల్లో బాగా రాణిస్తారు.

అదే పిల్లలు సరిగ్గా నిద్రపోకపోతే వారి ప్రవర్తనలో మార్పు ఉంటుంది. చిరాకు పడటం, హైపర్ యాక్టీవ్ గా ఉంటడం, చేసే పని మీద సరిగ్గా దృష్టి పెట్టలేకపోవటం, అలిసిపోవటం, వంటి సమస్యలను ఎదుర్కుంటారు. వారి చదువు మరియు ఇతర విషయాలను నేర్చుకునే సామర్ధ్యం కూడా సరిగ్గా నిద్రపోకపోవటం వల్ల దెబ్బతింటుంది. బాల్యంలో నిద్రలేమిని ఎదుర్కొనే చిన్నారులు భవిష్యత్తులో నిరాశ, నిస్పృహలకు గురయ్యే ప్రమాదముందని తాజా అధ్యయనంలో తేలింది.

చంటి పిల్ల‌లు బాగా నిద్రించ‌డం వల్ల వారికి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఒక వేళ ఏదైనా అనారోగ్య స‌మ‌స్య బారిన ప‌డినా త్వ‌ర‌గా కోలుకుంటార‌ని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా చాలామంది చిన్నపిల్లలు 4 లేదా 5 సంవత్సరాలు వచ్చేసరికి మధ్యాహ్న నిద్రని తగ్గిస్తారు లేదా పూర్తిగా మానేస్తారు. అలా వారంతట వారు మానేవరకు వాళ్ళని మధ్యాహ్నం నిద్రపుచ్చటమే మంచిది.

పిల్లలకి ఆటపాటలు చాలా ముఖ్యం. వారిని ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంచాలి. ఎంత ఎక్కువ ఆటపాటల్లో యాక్టీవ్ గా ఉంటే అంత ఎక్కువ వాళ్ళ శరీరం అలిసిపోయి ఎక్కువ సమయం నిద్రపోతారు. రాత్రి పడుకునేటప్పుడు కథలు చదవటం, చెప్పటం వంటివి చేస్తూ ఉండాలి. రాత్రి పూట మొబైల్ ఫోన్లు, వీడియో గేమ్స్ మరెలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు పిల్లలకి ఇవ్వకూడదు. ఎందుకంటే ఇవి పిల్లల్ని నిద్రపోనీకుండా చేస్తాయి. ఈ గాడ్జెట్ల నించి వచ్చే కాంతి మెలటోనిన్ అనే ఒక హార్మోన్ పై ప్రభావం చూపుతుంది. దాని వల్ల పిల్లలు త్వరగా నిద్రపోలేరు.

 

Exit mobile version