ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్ష‌న్ సోకినట్లు ఎలా గుర్తించాలి?

కరోనా సెకండ్ వేవ్ వైరస్ ముక్కు, గొంతులో ఉన్నప్పుడు దగ్గు కన్నా తీవ్రమైన సమస్యలకు కారణమవుతుంది. ఈ వైరస్ ఊపిరితిత్తులకు చేరినప్పుడు మరింత ప్రమాదానికి కారణమవుతుంది. ప్రతి ఏడుగురు రోగులలో ఒకరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని నివేదిక. అంతే కాకుండా, ఇతర తీవ్రమైన సమస్యలకు కూడా దారితీస్తుంది. 6 శాతం మంది రోగులు, సాధారణ శ్వాస కోశ సమస్యల వంటి ముఖ్యమైన వ్యవస్థలు ఇబ్బందులకి గురవుతుండగా, కొన్ని సందర్భాలలో సమస్య కనిపిస్తూ ఉందని గత నెల ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా మిషన్ తన నివేదికలో పేర్కొంది.

ఊపిరితిత్తులకోవిడ్‌-19 సోకిన వారిలో చాలామంది శ్వాస ఆడ‌క‌నే ఇబ్బంది ప‌డుతున్నారు ! నిజానికి వైర‌స్ చాలావ‌ర‌కు మ‌న గొంతు ద్వారానే శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. శ్వాస‌మార్గం గుండా నేరుగా వైర‌స్ లంగ్స్‌కు చేరుతుంది. కాబ‌ట్టి ముందుగా వాటిపైనే ప్ర‌భావం చూపిస్తుంది. దీనివ‌ల్ల శ్వాస‌మార్గంలో ఇన్‌ఫెక్ష‌న్ ఏర్ప‌డి శ్వాస తీసుకోవ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. గొంతు నొప్పి, పొడి ద‌గ్గు వస్తోంది.

ఊపిరితిత్తులక‌రోనా సోకిన వారిలో దాదాపు 80 శాతం మందిలో ఇలాంటి ల‌క్ష‌ణాలే క‌నిపిస్తాయి. కొంత‌మందిలో న్యుమోనియా ల‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తాయి. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ద్వారా ఊపిరితిత్తుల‌ను కాపాడుకోవ‌చ్చు. క‌రోనావైర‌స్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డేస‌రికే 25 శాతం వ‌ర‌కు లంగ్స్ దెబ్బ‌తింటాయి. కాబ‌ట్టి ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గానే ఆల‌స్యం చేయకుండా జాగ్ర‌త్త ప‌డ‌టం ద్వారా క‌రోనా నుంచి తొంద‌ర‌గా బ‌య‌ట‌ప‌డొచ్చు.

ఊపిరితిత్తులఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు తెలిపే గుర్తులు :

శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందిగా ఉందంటే.. మీ ఊపిరితిత్తుల్లోకి వైర‌స్ ప్ర‌వేశించింద‌ని అనుమానించాల్సిందే. ఊపిరితిత్తుల దిగువ భాగంలో వాపు లేదా నొప్పి ఎక్కువ‌గా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పొడి దగ్గు, ద‌గ్గుతున్న‌ప్పుడు నొప్పి రావడం కూడా కొవిడ్‌-19 పాజిటివ్‌గా ఉండటానికి సంకేతాలు అని గుర్తించాలి.

ఊపిరితిత్తులకోవిడ్‌-10 కార‌ణంగా న్యుమోనియా రావ‌డంతో పాటు శ్వాస తీసుకోవ‌డంలో తీవ్ర ఇబ్బంది ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో లంగ్స్ మొత్తం పాడైపోయి ప్రాణానికే ప్ర‌మాదం ఏర్ప‌డ‌వ‌చ్చు. ఈ వైర‌స్ కార‌ణంగా న్యుమోనియా వ‌స్తే ఊపిరితిత్తుల్లోని గాలి సంచులు మొత్తం ద్ర‌వంతో నిండిపోయి ఊపిరితిత్తుల వాపు వ‌స్తుంది. దీనివ‌ల్ల తీవ్ర‌ ద‌గ్గు రావ‌డంతో పాటు శ్వాస తీసుకోవ‌డం క‌ష్ట‌మైపోతుంది.

ఊపిరితిత్తులఊపిరితిత్తుల ఆరోగ్యం ప్ర‌ధానంగా వాటి సామ‌ర్థ్యం, ప‌నితీరుపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఊపిరితిత్తుల ప‌నితీరు బాగుంటేనే శ‌రీరానికి కావాల్సిన ఆక్సిజ‌న్ స‌క్ర‌మంగా అందుతుంది. కాబ‌ట్టి ఊపిరితిత్తుల ప‌నితీరు మెరుగుప‌డాలంటే వ్యాయామం చేయ‌డం చాలా అవ‌స‌రం. శారీర‌క శ్ర‌మ వ‌ల్ల శ్వాస తీసుకునే సామ‌ర్థ్యం పెరుగుతుంది. త‌ద్వారా ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలు పెరుగుతాయి. ఫ‌లితంగా ఊపిరితిత్తులు ఆక్సిజ‌న్‌ను గ్ర‌హించే సామ‌ర్థ్యం పెరుగుతుంది. కాబ‌ట్టి ప్ర‌తిరోజు రన్నింగ్‌, వాకింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేయ‌డం మంచిది. పెద్ద‌లు అయితే క‌నీసం 30 నిమిషాలు, పిల్ల‌లు అయితే గంట పాటు వ్యాయామం చేయ‌డం ద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు. లంగ్స్‌లో దీర్ఘ‌కాలిక మంట త‌గ్గాలంటే స‌రైన పోష‌కాహారం తీసుకో అర‌టి పండ్లు, యాపిల్‌, వాలి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూర‌గాయలు తినాలి. అర‌టి పండ్లు, యాపిల్‌, ద్రాక్ష‌, టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ల‌భిస్తాయి.

ఊపిరితిత్తులఅతిగా మద్యం సేవిస్తే ఊపరితిత్తులకు చాలా ప్రమాదం. కరోనా సమయంలో ఇది కాలేయం, లంగ్స్‌ను దెబ్బతీస్తుంది. ఇందులో సల్ఫైడ్ శాతం అధికంగా ఉంటుంది. దీని కారణంగా ఉబ్బసం సమస్య అధికమవుతుంది.

ఊపిరితిత్తులఉప్పు ఎక్కువగా తినకూడదు. ఇది లంగ్స్‌ పనితీరును బలహీనపర్చి అనారోగ్యం బారిన పడేలా చేస్తోంది. దీనిలో ఉండే.. అధిక సోడియం కారణంగా ఉబ్బసం సమస్య ఉత్పన్నమవుతుంది.

ఊపిరితిత్తులవేపుళ్లను అధికంగా తినడం ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరం. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఈ కొవ్వు గుండె సమస్యలకు దారితీస్తుంది. ఊబకాయం పెరగడం వల్ల కూడా ఊపిరితిత్తులపై చెడు ప్రభావం కలుగుతుంది.

ఊపిరితిత్తులశీతల పానీయాలను అతిగా తాగకూడదు. ఇందులో చక్కెర అధికంగా ఉంటుంది. ఇవి లంగ్స్‌పై చెడు ప్రభావాన్ని కలిగిస్తాయి. ఇవి బ్రోన్కైటిస్ సమస్యను మరింత పెంచి అనారోగ్యం బారిన పడేలా చేస్తాయి.

ఊపిరితిత్తులగ్యాస్ సమస్య.. ఊపిరితిత్తులను కూడా ప్రభావితం చేస్తుంది. క్యాబేజీ, బ్రోకోలిలో అధిక మొత్తంలో పోషకాలు ఉంటాయి. అవి ఆమ్లత్వం, ఉబ్బరాన్ని కలిగిస్తాయి. అందువల్ల ఇలాంటి పదార్థాలను ఎక్కువగా తినకూడదు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR