ఒకచోట నలుగురు కలిస్తే ముందుగా వారి నోటి నుంచి వచ్చే మాట ఓ కప్పు కాఫీ తాగుదామా.. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే ఓ కప్పు కాఫీ తాగితే చాలు అలసటంతా మటుమాయం.. అతిథులు ఇంటికి వస్తే ముందుగా వారికి ఇచ్చేది కూడా కప్పు వేడికాఫీనే. ఉదయాన్నే లేవగానే ఓ గ్లాసుడు ఫిల్టర్ కాఫీ గొంతులో పడితే గానీ పని ముందుకు సాగని పరిస్థితి. కాఫీ అనేది ఉత్సాహాన్నిచ్చే ఓ పానీయంగా మారింది. అలాంటి కాఫీ పొడితో అందాన్ని మరింత పెంచుకోవచ్చు అదెలాగో చూద్దాం.
కాఫీ పొడితో తల రుద్దుకోవటం :
మొహాన్ని,శరీరాన్ని స్క్రబ్ చేసుకోవటం ముఖ్యమని మనందరికీ తెలుసు. కానీ మీ వెంట్రుకల కుదుళ్ళను ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోటానికి తలను కూడా స్క్రబ్ చేసుకోవటం ముఖ్యమని మీకు తెలుసా? తలను రుద్దుకోవటం వలన అక్కడ పేరుకున్న చనిపోయిన చర్మకణాలు తొలగిపోతాయి. మీరు చేయాల్సిందల్లా కొంచెం కాఫీ పొడిని రెగ్యులర్ గా వాడే ఏదో ఒక కండీషనర్ తో కలపండి. ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా కుదుళ్ళకి పట్టించి కొన్ని నిమిషాలు వదిలేయండి. 20 నిమిషాలు అలా వదిలేసాక మైల్డ్ షాంపూతో కడిగేయండి. వారంకోసారి ఇలా చేసి ఆరోగ్యవంతమైన కుదుళ్ళను పొందండి.
జుట్టు రంగు కోసం :
కాఫీ మీ జుట్టు రంగును పెంచటంలో చక్కగా పనిచేస్తుంది. ఇది మీ జుట్టును నల్లగా,కాంతివంతంగా మారుస్తుంది. ఇది సహజమైనది కాబట్టి ఏ సైడ్ ఎఫెక్టులు ఉండవు. మొదటగా, కొంచెం కాఫీని తయారుచేసి, పక్కన చల్లబడనివ్వండి. ఇప్పుడు 1 చెంచా కాఫీ పౌడర్ ను 2 చెంచాల రెగ్యులర్ కండీషనర్ తో బాగా కలపండి. ఇందులో పెట్టిన కాఫీని పోసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మాస్క్ లాగా కుదుళ్ళ నుంచి చివర్ల వరకూ పట్టించండి. గంటసేపు అలా వదిలేసి షవర్ క్యాప్ తో కవర్ చేయండి. 1 గంట తర్వాత మామూలు నీరుతో జుట్టును కడిగేయవచ్చు. మీకు మరింత ముదురు రంగు కావాలంటే,ఒక చెంచా కోకో పౌడర్ జతచేస్తే తేడా మీకే కన్పిస్తుంది.
జుట్టు పెరగటానికి :
కాఫీ జుట్టు పెరిగేలా చేయటమేకాక, మృదువుగా,మెరిసేలా చేస్తుంది. ఈ సింపుల్ కాఫీ హెయిర్ మాస్క్ ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం. 1చెంచా కాఫీ పౌడర్ ను 2 చెంచాల ఆలివ్ నూనెతో కలిపి పేస్టులా తయారుచేయండి. దీన్ని మీ జుట్టుకి పట్టించి గుండ్రంగా నెమ్మదిగా మసాజ్ చేయండి. 15-30 నిమిషాలు ఆగండి. అరగంట తర్వాత మామూలు నీళ్ళతో మైల్డ్, సల్ఫేట్ లేని షాంపూతో కడిగేయండి. దీన్ని వారంకోసారి చేసి మెరుగైన ఫలితాలు చూడండి.
కాఫీ పొడితో చర్మం మెరుపు :
చర్మం కాంతివంతంగా మారటానికి కాఫీ పొడి చాల ఉపయోగపడుతుంది. కాఫీ చర్మంపై చనిపోయిన కణాలను తొలగించి ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది. మీరు ఇంటివద్దనే ప్రయత్నించదగ్గ కొన్ని కాఫీ ఫేస్ మాస్కులు తెలుసుకుందాం.
కాఫీ,పెరుగు,తేనె ఫేస్ మాస్క్ :
2 చెంచాల కాఫీ పౌడర్,2 చెంచాల తేనె, 2 చెంచాల పెరుగు. వీటిని కలిపేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోండి. 30-45 నిమిషాలు అలా వదిలేయండి. 45 నిమిషాల తర్వాత మామూలు నీళ్ళతో కడిగేయండి.
కాఫీ, ఓట్ మీల్ స్క్రబ్ తో :
ఓట్ మీల్ ను మిక్సీ పట్టి పౌడర్ లా చేయండి. కొంచెం కాఫీ పౌడర్, పెరుగు వేసి పేస్టులా తయారుచేయండి. బాగా కలపండి. దీన్ని మీ మొహంపై గుండ్రంగా తిప్పుతూ రాయండి. 15-20 నిమిషాలు అలానే వదిలేయండి. 20 నిమిషాల తర్వాత మామూలు నీళ్ళతో కడిగేయండి.
కాఫీ,తేనెతో :
ఒక బౌల్ లో కొంచెం కాఫీ పొడి,1 చెంచా తేనెను కలపండి. ఈ పేస్టును మీ మొహంపై సమానంగా పట్టించి నెమ్మదిగా మసాజ్ చేయండి. 20 నిమిషాల తర్వాత మామూలు నీళ్ళతో కడిగేయండి. వారానికోసారి ఇలా చేసి మెరుగైన,వేగవంతమైన ఫలితాలు చూడండి.
కంటి కింద నల్లటి వలయాల దూరం :
కాఫీలోని కెఫీన్ కంటి కింద నల్ల వలయాలను తొలగించటంలో సాయపడుతుంది. అది చర్మాన్ని టైట్ చేయటంలో సాయపడి, కంటి చుట్టూ నల్ల దనాన్ని తగ్గిస్తుంది. 1 చెంచా కాఫీ పౌడర్ ను తీసుకుని తాజా ఆలోవెరా జెల్ తో కలపండి. మీరు కేవలం తాజా ఆలొవెరా ఆకునే వాడాలి, ఎందుకంటే దానిలో ఏ రసాయనాలు ఉండవు. ఈ మిశ్రమాన్ని నల్లవలయాలపై రాయండి. 15నిమిషాలు అలా వదిలేసి చల్లనీరుతో కడిగేయండి. వారంలో ఒకసారి ఇలా చేస్తే మంచి ఫలితాలు చూడొచ్చు.