కనుబొమ్మలు ఒత్తుగా, అందంగా పెరగాలంటే ఇలా చేయండి!

ఒక వ్యక్తి ముఖం చూసినపుడు ముందుగా చూసేది కళ్ళు, కనుబొమ్మలే. కళ్ళు ఎంత అందంగా ఉన్నా..అందమైన కనుబొమ్మలు లేకపోతే ఆ ముఖం ఎంత అలంకరించుకొన్నా, అందవిహీనంగానే కనబడుతుంది. మందంగా.. చూడ్డానికి ఒత్తుగా ఉండే కనుబొమ్మలు ముఖానికి మరింత వన్నె తీసుకొస్తాయి. ఒత్తైన కనుబొమ్మలు కావాలని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే కనుబొమ్మలు ఒత్తుగా ఉంటే వయసు చిన్నదిగా కనిపిస్తుంది. వారి ముఖకవళికలు ఎదుటి వారిని సులభంగా ఆకర్షిస్తాయి. అయితే, అనేక కారణాల వల్ల చాలామందికి కనుబొమ్మలు అంత ఒత్తుగా, దృఢంగా పెరగవు. కానీ దానికి విచారించాల్సిన అవసరం లేదు. కొన్ని ఇంటి చిట్కాల ద్వారా తీరైన కనుబొమ్మలను తీర్చిదిద్దుకోవచ్చు.

vaseline petroleum gellyకనుబొమ్మలు తేమగా ఉన్నప్పుడే గ్రోత్ బాగుంటుంది. కాబట్టి.. కనుబొమ్మలను తేమగా ఉంచుకునేందుకు రోజుకి రెండు లేదా మూడుసార్లు పెట్రోలియం జెల్లీ(వాజిలైన్)‌ని అప్లై చేయాలి. కేవలం రాసి అలా ఉంచకుండా కాస్తా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కనుబొమ్మలకు రక్తప్రసరణ జరిగి బలంగా పెరుగుతాయి. ఇదే కాకుండా కనుబొమ్మలు పెరగడానికి ఆముదం రాయడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది.

castor oilఆముదంలో ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఉండటం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా, బలంగా పెరుగుతాయి. విటమిన్ ఇ ఆయిల్ కూడా కనుబొమ్మలు ఆరోగ్యంగా పెరగడానికి సాయపడుతుంది. ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఏ, సి ఉంటాయి. కనుబొమ్మల పైన ఆలివ్ ఆయిల్ ని ప్రతిరోజు ఉపయోగించడం వల్ల, కొన్ని వారాల తర్వాత ఆశించిన ఫలితం కనబడుతుంది.

బాదం నూనెలో విటమిన్స్ ఉంటాయి. విటిమిన్ ఏ, బి, ఇ ఇవన్నీ కూడా జుట్టు పెరుగుదలకు ఉపయోగపడేవే. ఈ ఆయిల్‌ని కూడా కనుబొమ్మలపై మసాజ్ చేయడం వల్ల ఐబ్రోస్ బాగా పెరుగుతాయి. రాత్రి పడుకునే ముందు కనుబొమ్మ‌లకు కొబ్బరి నూనె రాసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే ఒత్తుగా పెరుగుతాయి.

almond oilజుట్టు పెరుగుదలకు ప్రోత్సహించే ఎన్నో అద్భుత గుణాలు అలొవెరా జెల్‌లోనూ ఉంటాయి. ఇది వెంట్రుకల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి రెగ్యులర్‌గా ఈ జెల్‌ని రెగ్యులర్‌గా అప్లై చేయొచ్చు. ఇలా చేయడం వల్ల కనుబొమ్మలు అందంగా, ఒత్తుగా పెరుగుతాయి.

aloe vera gelఉల్లిపాయ రసం కనుబొమ్మలు ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇందులో సల్ఫర్ ఉంటుంది. దీని వల్ల హెయిర్ ఫోలిక్స్ బలపడి కొల్లాజెన్ కణజాల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ కారణంగా ఐబ్రోస్ కూడా బాగా పెరుగుతాయి. మందారం నూనె లేదా మందార పువ్వుల యొక్క పేస్ట్ ను కనుబొమ్మలకు అప్లై చేసి, మసాజ్ చేయాలి. 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత నీళ్ళతో కడిగేస్తే కనుబొమ్మలు వత్తుగా తయారవుతాయని బ్యూటీషన్లు అంటున్నారు.

onion juiceనిమ్మతొక్కను రెండుగా కట్ చేసి ఒక బౌల్ పాలలో మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని కనుబొమ్మలకు పట్టించి, మసాజ్ చేయాలి. నిమ్మరసాన్ని నేరుగా కనుబొమ్మలకు అప్లై చేయకూడదు. గుడ్డు పచ్చసొనలోని ప్రత్యేక గుణాలు కనుబొమ్మలు అందంగా, ఒత్తుగా పెరిగేందుకు సాయపడతాయి. ఇది ఓ మంచి హోం రెమిడీ అని కూడా చెప్పొచ్చు. అయితే పచ్చసొని తీసుకుని కాస్తా అప్లై చేసి ఆరాక గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

egg and lemon milk juiceపాలు మంచి మాయిశ్చరైజర్ కంటెంట్. ఇది జుట్టుపై సహజ కండీషనర్‌లా పనిచేస్తుంది. పడుకునేముందు పాలల్లో దూదిని ముంచి కనుబొమ్మలపై అప్లై చేయాలి. దీనిని రాత్రంతా అలా ఉంచినా సరే.. కడిగేసినా సరే.. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కాటుకని ఆలివ్ ఆయిల్‌ని కలిపి ఆ మిశ్రమాన్ని ఐబ్రోస్‌పై రాయాలి. ఇలా రెగ్యులర్‌గా రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,620,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR