మధుమేహం ఉందో లేదో ఈ లక్షణాలను బట్టి తెలుసుకోవచ్చు!

నేటి సమాజంలో మధుమేహం అనే పేరు బాగా వినపడుతుంది. వయసు మళ్ళిన వారిలో మాత్రమే కాకుండా యుక్త వయసులో ఉన్నవారు సైతం మధుమేహం బారిన పడుతున్నారు. ఈ సమస్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 42.2 కోట్ల మందికి మధుమేహం ఉందని.. నాలుగు దశాబ్దాల కిందటితో పోలిస్తే ఈ సంఖ్య నాలుగు రెట్లకు పైగా పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. దీనివల్ల ప్రమాదాలు ఉన్నా కూడా మధుమేహ బాధితుల్లో సగం మందికి తమకు ఆ వ్యాధి ఉన్నట్లే తెలియదు.

Diabetesమధుమేహం రక్తంలో అత్యధికంగా చక్కర శాతం ఉండటం వల్ల దాని ప్రభావం చూపుతుంది.శరీరంలో ఇతర భాగాల పైన కూడా దీని ప్రభావం ఉంటుంది.

సాధారణంగా మధుమేహం రెండు రకాలు.

1. మొదటి రకం: క్లోమ గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి లేకపోవడం.

2. రెండవ రకం: రక్తంలో అత్యధికంగా ఇన్సులిన్ ఉండటం, దానికి కారణం రక్తంలో అత్యధికంగా చక్కర
ఉండటం వల్ల అది ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరెపిస్తుంది.

Diabetesరక్తంలో గ్లూకోజ్ అధికంగా ఉంటే, అది గుండె, కళ్లు, మూత్రపిండాలు, మరియు నరాలు వంటి శరీర భాగాలను పాడు చేస్తుంది. ఇది గుండె పోటు, స్ట్రోక్, అంధత్వం, మూత్రపిండాలు చెడిపోవడం, పాదాలు, కాళ్లు తొలగించాల్సి రావటం వంటి పరిణామాలకు దారితీస్తుంది. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలావరకూ ఈ వ్యాధి రాకుండా నివారించవచ్చు. మధుమేహం సాధారణ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం

  • మామూలు కన్నా ఎక్కువగా.. దాహంగా అనిపిస్తూ ఉండటం, ప్రత్యేకించి రాత్రిపూట అధికంగా దాహం వేయడం.
  • ఎక్కువగా మూత్రవిసర్జన చేయటం.
  • చాలా అలసిపోయినట్లు అనిపించటం.
  • ప్రయత్నించకుండానే బరువు తగ్గిపోవటం లేదా బరువు పెరగటం.
  • నోట్లో తరచుగా పుండ్లు అవుతుండటం.
  • కంటి చూపు మందగించటం
  • శరీరం మీద గాయాలు, దెబ్బలు మానకపోవటం.

Diabetesమధుమేహం అనేది.. జన్యు సంబంధిత మరియు పరిసరాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, క్రియాశీలమైన జీవనశైలితో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. చక్కెర ఉన్న ఆహారాలు, పానీయాలను తీసుకోకపోవటం.. పండ్లు, కూరగాయలు, బీన్స్, సంపూర్ణ తృణధాన్యాల వంటి ఆహారాన్ని తీసుకోవటం అందులో తొలి అడుగు.

Diabetesఆరోగ్యకరమైన నూనెలు, పప్పులు, సార్డిన్లు, సాల్మన్ల వంటి ఒమెగా-3 పుష్కలంగా ఉండే చేపలు కూడా ఆరోగ్యవంతమైన ఆహారంలో భాగమే. కడుపు నిండగానే తినటం ఆపేయటం ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించటానికి శారీరక వ్యాయామం కూడా దోహదపడుతుంది. వారం రోజుల్లో కనీసం రెండున్నర గంటల పాటు.. వేగంగా నడవటం, మెట్లు ఎక్కటం వంటి వ్యాయామం ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR