అరటి పండుతో జుట్టు రాలడాన్ని ఇలా తగ్గించుకోవచ్చు!

కారణం ఏదైనా ఈమధ్య కాలంలో ఎక్కువమంది ఎదుర్కుంటున్న సమస్య జుట్టు ఊడిపోవడం, చుండ్రు రాలడం. మనిషికి అందాన్నిచ్చేదే జుట్టు. ఆ జుట్టు ఓడిపోతే కాస్త మనస్థాపానికి గురికావడం సహజమే. వేసవి కాలం నుంచి వర్షాకాలం రాగానే వాతావరణంలో తేమ వల్ల చుండ్రు వస్తుంది.. అలాగే వెంట్రుకలు పెలుసుబడి జుట్టు పలుచబడుతుంది. దీంతో వెంట్రుకలు ఊడిపోతాయి.. జుట్టు ఊడిపోతుంటే కొంతమంది నిరాశకు లోనవుతారు.. కొంతమంది బ్యూటీపార్లర్లో చుట్టూ తిరుగుతూ హెయిర్ స్పా, హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ డబ్బులు వృధా చేస్తారు.

hairfallఇవన్నీ ప్రయత్నించి డబ్బు వృధా చేసుకోవడం కన్నా కూడా అన్నిరకాల జుట్టు సమస్యలకు ఇంట్లో దొరికే వస్తువులతోనే తగ్గించుకోవచ్చు. వంటింట్లో ఉండే అరటి పండు తో జుట్టు సమస్యలకు ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఏడాది అంతటా అందుబాటులో ఉండే ఏకైక పండు అరటి. రోజూ ఈ పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆహారంగా తీసుకోవడమే గాకుండా తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడాన్ని కూడా అరికట్టవచ్చని తాజా పరిశోధకులు కనుగొన్నారు. ఇందులోని పోషకాలు వెంట్రుకల సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తాయి.

bananaఅరటి పండ్లలో విటమిన్స్ అధికం. విటమిన్ బి3, బి6 మరియు సి అధికంగా ఉంటాయి. ఇవన్నీ జుట్టుకు అందినప్పుడు జుట్టు రాలడాన్ని ఎఫెక్టివ్ గా అరికడతాయి. జుట్టు మరింత తేజో వంతంగా మరియు ఒత్తుగా చిగురిస్తూ కనిపిస్తుంది. అరటిలో పోటాషియం అధిక మోతాదులో ఉంటుంది. ఫలితంగా అరటి పండు తిన్న వెంటనే శరీరానికి శక్తి అందుతుంది. అరటి సహజ హెయిర్ కండీషనర్‌లా పని చేస్తుంది.

vitamin Cఎప్పుడైతే జుట్టుకు మంచి కండీషన్ అందుతుందో అప్పుడు జుట్టు ప్రకాశవంతంగా…అందంగా కనబడుతుంది. హెయిర్ ను మ్యానేజ్ చేయడం కూడా సులభం అవుతుంది మరియు ముఖం అందంగా కనబడుతుంది . కాబట్టి బనానా జ్యూస్ ను జుట్టుకు కండిషనర్ గా అప్లై చేయడం మంచిది. బనానా జ్యూస్ ను తలకు మరియు కేశాలకు పట్టించడం వల్ల జుట్టుకు కావల్సినంత మాయిశ్చరైజింగ్ ను అందిస్తుంది మరియు జుట్టును సాఫ్ట్ గా మరియు ప్రకాశవంతంగా మరియు హెల్తీగా మార్చుతుంది.

banana juice on hairఅరటి పండును, కొబ్బరి పాలను ఓ గిన్నెలోకి తీసుకొని బాగా కలపాలి. తర్వాత దాన్ని తలకు పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఉసిరి రసాన్ని కూడా ఈ గుజ్జుకు కలపొచ్చు. సన్‌ఫ్లవర్ ఆయిల్, నిమ్మరసం, అరటి గుజ్జును కలిపి తలకు పట్టించడం వల్ల కేశాలు బలంగా మారతాయి. ఇందుకోసం అరటి పండును నలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్, అర టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కుదుళ్లకు పట్టేలా.. తలకు రాసుకోవాలి. 20 నిమిషాలు ఆగాక గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

జుట్టు బాగా పెరగాలంటే , తగినంత పోషకాలు అందివ్వడం అవసరం మరియు మరియు విటమిన్లు కూడా అవసరం అవుతాయి . శెనగపిండిలో అరటి జ్యూస్ మిక్స్ చేసి తలకు పట్టించి, 20 నిముషాల తర్వాత కడిగేసుకోవాలి . అరటి జ్యూస్ విటమిన్స్ ను అందిస్తే, శెనగపిండి ప్రోటీనుల అందిస్తుంది . ఈ రెండింటి కాంబినేషన్ హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ మార్చుతాయి.

besan flourజుట్టుకు ఎగ్ అప్లైచేయడం చాలా ఆరోగ్యకరం . ఎగ్ కు కొద్దిగా అరటి జ్యూస్ ను మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల న్యూట్రీషియన్ లెవల్స్ పూర్తిగా అందుతాయి మరియు జుట్టుకు మరియు తలకు సూపర్ ఫుడ్స్. జుట్టును బలోపేతం చేసే పదార్థాల్లో తేనె ఒకటి. తేనెను జుట్టుకు పట్టించినప్పుడు జుట్టు సాఫ్ట్ అండ్ షైనీగా మారతుంది . తేనె మరియు అరటి జ్యూస్ ను సమంగా తీసుకొని హెయిర్ కు ప్యాక్ లా వేసుకోవాలి. ఇది జుట్టుకు తగినంత పోషణను మరియు రక్షణ కల్పిస్తుంది.

eggs and bananaచాలా మందిలో చుండ్రు కారణంగా జుట్టు ఎక్కువగా రాలుతుంది. ఇలాంటి వారు అరటి పండు పేస్టును అర కప్పు పెరుగుతో కలిపి తలకు రాసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. అరటిపండు తొక్క లో ఉంది అంటే మైక్రో బయాలజీ ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చుండ్రు నివారణకు ఉపయోగపడతాయి. పెరుగు లో ఉండే బ్యాక్టీరియా తలపై చుండ్రు సమస్యను నివారిస్తుంది. ఆలివ్ ఆయిల్ జుట్టు కుదుళ్లకు పోషకాలను అందించడంలో సహాయపడుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR