కూరల్లో కారం ఎక్కువ అయిందా ? అయితే ఈ సింపుల్ వంటింటి చిట్కాలను పాటించండి

బయటి ఫుడ్ కన్నా మనం ఇంట్లో తయారు చేసుకునే ఆహారం తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే ఎంత మంచి వంటకాన్ని తయారు చేసినా కూడా అందులో తగినంత ఉప్పు ,కారం ఉంటేనే ఆ వంట మరింత రుచిగా అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం వంట చేసేటప్పుడు అందులో ఉప్పు, కారం కాస్త ఎక్కువగా పడితే ఆ వంట రుచే మారిపోతుంది. చాలామంది ఈ పొరపాట్లను తరచు చేస్తూ ఉంటారు.

కూరల్లో కారం ఎక్కువ అయిందా ?కూరలు వండేటప్పుడు అనుకోకుండా ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువైపోతాయి. సాధారణంగా కూరలో కాస్త కారం ఎక్కువ అయితే ఇక అన్నం తినడం మానేస్తాం, అంతేకాదు అసలు దానిని ముట్టుకోవడానికి ఇష్టపడం, చిన్న పిల్లలు అయితే ఈ కారం తినలేం అంటారు, ఇక నూనె వేసుకుని నెయ్యి వేసుకుని కారం వేడి మంట తగ్గించుకుంటాం.

కూరల్లో కారం ఎక్కువ అయిందాఇలా కూరల్లో కారం ఎక్కువ అయితే కొన్ని వంటింటి చిట్కాలు వాడి కూరలను మనం అనుకున్న రుచికి తగ్గట్టుగా తయారు చేసుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందా

1.కూరలో కారం ఎక్కువ అయితే ముందుగా టమెటా కాస్త ఫ్రై చేసుకుని ఆ కర్రీలో వేసుకున్నా బాగుంటుంది. లేదా కూరల్లో కొంచెం టమాటా కలిపి లో ఫ్లేమ్ మీద కాసేపు ఉంచాలి.

2. కూరలో కారం ఎక్కువైనప్పుడు కొద్దిగా పంచదార కలిపినా కూడా బానే ఉంటుంది. అయితే ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా రుచి చూసుకుంటూ పంచదార కలపాలి, లేదంటే వంటకం తియ్యగా తయారవ్వచు.

3.అలాగే కాస్త ఉల్లిపాయని కూడా అందులో వేస్తే కారం తగ్గుతుంది.

4. సూప్స్, స్ట్యూస్ వంటి వాటిలో కారం ఎక్కువ పడితే, కొద్దిగా నీరు యాడ్ చేయండి. అయితే, నీరు చూసుకుంటూ యాడ్ చేయండి. లేకపోతే సూప్ వాటర్ లా తయారవుతుంది.

5.కొంచెం మొత్తని ఉప్పుని వేసుకోవచ్చు.

4.చికెన్, సీ ఫుడ్ అయితే కొద్దిగా నిమ్మకాయ రసం వేసుకోవాలి.

ఇలా సింపుల్ చిట్కాలను పాటించి వంటకాల రుచి తగ్గకుండా కారం తగ్గించుకోవచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,610,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR