ఇంటికి తెచ్చుకునే లక్ష్మీదేవి (కోడలు) విషయంలో ఈ పొరపాట్లు పనికిరావు!

బంధాల అన్నింట్లోకి గొప్ప బంధం వివాహ బంధం. ఎందుకంటే తెలియనటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చిన స్త్రీ మన రక్తసంబంధాన్ని బలపరుస్తూ, స్నేహ బంధానికి విలువనిస్తూ మన వంశానికి పేరుప్రఖ్యాతులను అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. తన ప్రపంచాన్ని పూర్తిగా వదిలేసి భర్త, అత్తారిల్లు ఇవే తన ప్రపంచం అన్నంతగా మారిపోతుంది. పుట్టినింట్లో కాలు కందకుండ పెరిగిన లక్ష్మి దేవి అత్తారింట్లో అన్ని రకాల పాత్రలు పోషిస్తుంది. భార్యగా, కోడలిగా, వదినగా, తల్లిగా ఇలా అన్ని రకాల బాధ్యతలు చేపడుతుంది. అయితే ఇంతటి త్యాగమూర్తిని(కోడలిని) ఎంచుకునే విషయంలో చాలా మంది తల్లి తండ్రులు చేసే పొరపాట్లు ఏమిటో చూద్దాం…

2-Rahasyavaani-1102అబ్బాయిల వివాహాలు అనుకోగానే మరి అబ్బాయి తల్లిదండ్రులకి కూడా అనేక కోర్కెలు ఉంటాయి. అలా కోర్కెలు ఉండటం తప్పు అని కాదు. కాని అవి ఎంతవరకు సబబో మనం ఆలోచించుకోవాలి. మన కోరికలవల్ల పిల్లల వివాహం ఆలస్యం అవ్వకూడదు.
సాధారణంగా అందరం అనుకునే కోరిక కోడలు మెరుపు తీగలాగా, నాజూకుగా అందంగా ఉండాలి అని. అందానికి అసలు ఎవరమైన నిర్వచనం చెప్పగలమా? ఖచ్చితంగా చెప్పలేము అనే చెప్పాలి. ఎందుకంటే అందం అనేది చూసే కంటినిబట్టి మారిపోతూ ఉంటుంది.

3-Rahasyavaani-1102ఒకరి కంటికి అందంగా అనిపించింది వేరొకరి కంటికి అందంగా కనిపించకపోవచ్చు. మీ కంటికి అందంగా అనిపించింది నా కంటికి అనిపించకపోవచ్చు. కాని అమ్మాయి గుణవంతురాలు అనుకోండి….అమ్మాయి యొక్క అంతః సౌదర్యంవల్ల అమ్మాయి మన ఇద్దరి కండ్లకి అందంగానే కనిపిస్తుంది. కాబట్టి అమ్మాయిని ఎంచుకునేటప్పుడు అందానికి కాక గుణాలకి ప్రాధాన్యత ఇవ్వాలి.

ఇంకొంతమంది తల్లిదండ్రుల ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే నేను ఒక స్థాయిలో ఉన్నాను. మా పెద్దబ్బాయి వాళ్ళ మామగారు మంచి స్థితిపరుడు. ఒక స్థాయిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక మా అమ్మాయి మామగారో….చెప్పనే అక్కర్లేదు. నా బంగారుతల్లి అదృష్టం కొద్దీ అలాంటి సంబంధం దొరికింది.
మరి చిన్నవాడికి కూడా అదే స్థాయిలో ఉండకపోతే ఎలా? అని ఎంత మంచి సంబంధం అయినా అమ్మాయి గుణగణాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా పెద్దల స్థాయిని బట్టి కాదు కదా! మన ఇంటికి వచ్చిన అమ్మాయి మన ఇంటి గౌరవాన్ని నిలబెట్టేటటువంటిదై ఉండాలి.

5-Rahasyavaani-1102ఎందుకంటే పురుషుడివల్ల అతను ఏ వంశంలో అయితే పుట్టాడో ఆ వంశం మాత్రమే ఉద్ధరించబడుతుంది. మరి ఆడపిల్లవల్లో తన సక్రమమైన ప్రవర్తన వల్ల ఇటు పుట్టినింటివారికి మరియు మెట్టినింటికి కూడా వన్నె తేగగలిగేది ఆడపిల్ల మాత్రమే. అలాగే కట్నకానుకలు కూడా మనం ఒక ఆడపిల్లకి ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోగలం చెప్పండి.

ఆడపిల్ల తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, తాను పుట్టి పెరిగిన ఊరును, స్నేహితులను, తన ఇంటి పేరును, తన గోత్రాన్ని వదిలేస్తుంది. తనకి మరణ సదృశం అని తెలిసినప్పటికీ ఈ ఇంటి వంశాభివృద్ధికోసం తన ప్రాణాన్నే పణంగా పెడుతుంది. ఇన్ని త్యాగాలు చేసే అమ్మాయి దగ్గరనుండి కట్నకానుకలు ఆశించడం సమంజసమేనా.

4-Rahasyavaani-1102ఈ కోణంలో అబ్బాయి తల్లిదండ్రులు ఆలోచించి మన ఇంటికి తెచ్చుకునే అమ్మాయి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా అబ్బాయికి 24 నుంచి 27 వసంతాలకు వివాహం చేయవచ్చు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR