మహాభారతంలో ద్రౌపతి పంచ పాండవులను వివాహం చేసుకున్నది అనే విషయం అందరికి తెలిసిందే. ఆలా ఆమె ఐదుగురిని వివాహం చేసుకోవడానికి కారణం ఆమె గత జన్మలో శివుని నుండి పొందిన వరమే అని ఒక పురాణ కథ ఉంది. అయితే ఒకవేళ కనుక పాండవులు లేకుంటే ద్రౌపతి 14 మందికి సతీమణిగా ఉండేదని చెబుతున్నారు. మరి ఆలా చెప్పడానికి కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ద్రుపదుడి రాజ్యాన్ని పాంచాలమని అంటారు. పాంచాల రాజ్యపు రాణి ద్రౌపతి కనుక ఆమెని పాంచాలి అని అంటారు. అంతేకాకుండా ద్రౌపతికి యగ్నసేని, మహాభారతి, సైరాంధ్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఐదుగురికి భార్య అవడం వల్ల మహాభారతి అనే పేర్లు ఆమెకి వచ్చాయి. ద్రౌపది తల్లి గర్భాశయం నుంచి జన్మించలేదు. ఈమె అగ్ని నుంచి పుట్టింది. అది కూడా శిశువుగా పుట్టలేదు యుక్తవయస్సుతో పుట్టింది. ఈమె పాంచాల రాజు అయిన ద్రుపదుడుకి అగ్ని ద్వారా జన్మించింది. అందువల్లే ఈమెను యగ్నసేని అంటారు.
శ్రీకృష్ణుడుకి ప్రాణ స్నేహితురాలు ద్రౌపది. భక్తి, దృఢత్వం, నీతితో ద్రౌపది శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందింది. తన ప్రతి విషయాన్ని తన స్నేహితుడు శ్రీకృష్ణుడికి చెప్పుకునేది ద్రౌపది. అయితే ద్రౌపది పూర్వ జన్మలో 14 ప్రత్యేక లక్షణాలున్న వ్యక్తిని భర్తగా కావాలని శివుడిని కోరింది. అయితే అలాంటి 14 ప్రత్యేక లక్షణాలు ఒకే మనిషిలో అస్సలు లేవంట. ఒక వేళ 14 మందిని పెళ్లి చేసుకుంటే తప్పా ఆమె కోరిక తీరదు. అలాంటి తరుణంలో ఈ 14 లక్షణాలు ఐదుగురిలో ఉన్నట్లు శివుడు గుర్తించాడు. వారే పాండవులు. 14 లక్షణాలున్న ఐదుగురు వ్యక్తులు నీకు భర్తలుగా వస్తారని శివుడు వరం ఇచ్చాడంట. ధర్మం, శక్తి, బాణం వేయడంలో నైపుణ్యం, అందం, ఓర్పు తదితర గుణాలున్నా ఆ ఐదుగురిని ద్రౌపది అప్పుడు ఒక్కో గుణం ఒక్కొక్కరిలో ఉండటంతో పాండవులను పెళ్లాడింది ద్రౌపది.
ద్రౌపది తన ప్రతి భర్తతో ఒక కొడుకుకి జన్మనిచ్చిందని పురాణం. అయితే వాళ్లను ఉప పాండవులు అంటారు. ధర్మరాజు కు పాంచాలికి ప్రతివింధ్యుడు, భీమునికి శ్రుతసోముడు, అర్జునునకు శ్రుత కీర్తి, నకులునకు శతానీకుడు, సహదేవునకు శ్రుత సేనుడు జన్మించారు.
ఇక ద్రౌపతి గత జన్మ విషయానికి వస్తే, నారద పురాణం, వాయు పురాణం ప్రకారం ద్రౌపది శ్వామలాదేవిగా ధర్మానికి భార్య, భారతిదేవిగా అంటే వాయుదేవుడి భార్యగా, శాచి ఇంద్రుడి భార్యగా, అశ్విన్ భార్యగా ఉషా, శివుడి భార్యగా పార్వతి అవతారాలు ధరించింది. అంతకుముందు రావణుడి సంహారం కోసం వేదవతిగా, రావణాసురుడి సంహారం కోసం సీతగా జన్మించిందని ఆ తర్వాత ద్రౌపదిగా పుట్టిందని చెబుతారు.
ఇలా శివుని నుండి వరం పొందిన ద్రౌపతి తాను కోరుకున్న కోరికలు ఉన్న పంచ పాండవులు లేకుంటే తన కోరిక ప్రకారం 14 మందికి భార్య అయివుండేదని కొందరి వాదన గా చెబుతారు.