ఈ లక్షణాలు కనిపిస్తే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ!

మనిషి శరీరంలోని అన్నీ అవయవాలలో ముఖ్యమైనది మెదడు. అది ఒక్క క్షణం ఆగినా పూర్తి శరీరం చేతన కోల్పోతుంది. మెదడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు శరీరం అదుపుతప్పకుండా పనిచేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే శరీరం మొత్తాన్ని నడిపేది మెదడే. అలాంటి మెదడులో చిన్న సమస్య తలెత్తినా ‘బ్రెయిన్ స్ట్రోక్’ ఏర్పడుతుంది. మెదడులో కొన్ని భాగాలకు రక్తం సరఫరా ఆగిపోవడంతో స్ట్రోక్‌ వచ్చేప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆక్సిజన్‌ కణాల్లోకి సరఫరా నిలిచిపోవడం కారణంగా ఇలా జరిగే ప్రమాదం ఉందని, ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

brain strokeఅయితే కొన్ని సార్లు బ్రెయిన్‌ స్ట్రోక్‌కు సంబంధించిన సమస్యలు ముందే పసిగడితే ప్రమాదం నుంచి రక్షించుకోవచ్చు. ప్రమాదం జరగడానికి కొన్ని రోజులు, గంటల ముందే కొన్ని లక్షణాలు గుర్తించినట్లయితే ఎంతో మేలని అంటున్నారు వైద్య నిపుణులు. వాటిపై అవగాహన ఉంటేనే సమస్యను ముందే పసిగట్టవచ్చని చెబుతున్నారు. ముఖం, చేతులు, కాళ్లు మొద్దుబారడం, సాధారణమైన లక్షణమే అయినా బ్రెయిన్‌ స్ట్రోక్‌ ముందు ఇలా జరుగుతుంది. ముఖం, చేతులు, కాళ్లు ఒక వైపు మాత్రమే మొద్దుబారడం కూడా జరుగుతుంది. కంటి చూపులో తేడా వస్తుంది. కళ్లు మసకబారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రమాదం జరగడానికి గంటలు, రోజులు ముందే మనకు ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి.

eye sightఛాతీ నొప్పితో పాటు శ్వాసలోనూ సమస్యలు వస్తుంటాయి. అది స్ట్రోక్ వచ్చే ముందు లక్షణం కావొచ్చు. ఓహియో స్టేట్ యూనివర్సిటీ వెక్సనర్ మెడికల్ సెంటర్ జరిపిన సర్వే ప్రకారం.. పది శాతం మంది మహిళలకు ఎక్కిళ్లు వచ్చాయట. అలా అని ఎక్కిళ్లు వచ్చిన ప్రతిసారి ఎమర్జెన్సీ రూంకు వెళ్లాలని కాదు. అసాధారణంగా అదేపనిగా ఎక్కిళ్ళు వస్తే మాత్రం అనుమానించాల్సిందే. అలాగే అధిక రక్తపోటు చాలా సమస్యలకు దారితీస్తుంది. దాని వల్ల కూడా రక్తం గడ్డకట్టడం వంటివి జరగొచ్చు. మెదడులో రక్త ప్రసరణ ఆగిపోయి రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. బ్రెయిన్ లో రక్తం ఎక్కడ గడ్డ కడుతుందో అక్కడ ఉన్న నరాల స్పందన ఆధారంగా శరీరం చచ్చుపడి పోతుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన మూడు గంటల లోపు హాస్పిటల్ కు తీసుకు వెళితే పక్షవాతం చేతులు కాళ్లు చచ్చి బడకోకుండా నివారించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

heartఇక మహిళల్లో స్ట్రోక్‌ వచ్చే ముందు వారి ప్రవర్తనలో మార్పులు గమనించవచ్చని నిపుణులు అంటున్నారు. ఉన్నట్టుండి కొన్ని విషయాలు మార్చిపోవడం, వ్యక్తిత్వంలో మార్పులు తెలుస్తుంటాయి. అంతేకాకుండా మెదడులో కొన్ని భాగాల్లో వచ్చిన సమస్యల కారణంగా వాంతులు, వికారంగా ఉండటం వంటివి కనిపిస్తాయి. ఇక చూపులో సమస్యతో పాటు భ్రమ పడుతున్నట్లు కూడా అనిపిస్తుంటుందట. అప్పటికే పోస్టిరియర్ భాగంలో సర్కూలేషన్ సమస్య వచ్చినట్లు అర్థం చేసుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన చాలామంది ఆడవాళ్లలో కనిపించిన లక్షణం తలనొప్పి. ఎక్కువమందికి తలవెనుక భాగంగలోనే అలా అనిపిస్తుందట. ఒక్కోసారి స్పృహ కూడా కోల్పోయి పడిపోతుంటారట.

vomitingకొంతమంది మహిళల్లో దురదృష్టవశాత్తు గర్భస్రావాలు జరుగుతుంటాయి. అది స్ట్రోక్ రిస్క్ ను పెరిగేలా చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అడ్రినల్ గ్రంథుల్లో ఉత్పత్తి అయ్యే డీహెచ్ఈఏ హార్మోన్ వెంటనే తగ్గిపోతుంది. దాని కారణంగా ఈస్ట్రోజన్లు, ఆండ్రోజన్స్ తగ్గిపోతుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.

yoga and meditationఅందుకే ఎక్కువగా టెన్షన్‌కు గురి కాకుండా ఉండటం మంచిది. అధికంగా ఆలోచించడం కంటే యోగా, ధ్యానం లాంటివి చేసుకుంటూ మనసు ప్రశాంతంగా ఉంచుకునే విధంగా చూసుకోవాలని వెల్లడిస్తున్నారు. లేకపోతే ఇలా ఆరోగ్యం బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి ప్రోటీన్స్ పోషకాలు ఉన్న ఆహారాన్ని డైట్ లో భాగం చేసుకోవాలి. దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటే వాటిని నియంత్రణ లో ఉంచుకోవాలి.

proteins

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,580,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR