అందంగా కనిపించాలని మార్కెట్లో కనిపించిన ప్రతీ వస్తువు తీసుకువచ్చి వాడినా ప్రయోజనం లేదని బాధపడుతున్నారా? ఎన్ని ఫేస్ క్రీములు అప్లై చేసినా అందం పెరగట్లేదని ఆలోచిస్తున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే. అందంగా కనిపించడానికి ఎన్నో రకాల ప్రోడక్టులు వాడటం మాత్రమే కాదు మీకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయనేది కూడా లెక్కలోకి వస్తుంది.
అందం అంటే కేవలం ముఖం మాత్రమే కాదు. శరీరం కూడా అందంగా కనిపించడానికి కొన్ని పద్ధతులు అలవాటు చేసుకోవాలి. అవి ఏంటంటే… నీళ్ళు ఎక్కువగా తాగడం. రోజులో కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీళ్ళైనా తాగడం మంచిది.
తాజా కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ తినండి. కనీసం 6నుండి 8గంటల నిద్ర చాలా అవసరం. నిద్ర సరిగ్గా లేకపోతే అందంగా కనిపించలేరు.
చిన్న చిన్న సమస్యలకి మెడిసిన్ వరకు వెళ్ళకండి. జలుబు, తలనొప్పి వంటి వాటికి రెగ్యులర్ గా మెడిసిన్ వాడటం కరెక్ట్ కాదు. సహజంగా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. మీ శరీరానికి తగిన ప్రోడక్టులని మాత్రమే వాడాలి. రెగ్యులర్ గా బ్రాండ్లని మారుస్తూ ఉండకూడదు.
కడుపుని ఎప్పుడు క్లీన్ గా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మనకు పడని ఫుడ్ తీసుకోకూడదు. వాష్ రూమ్ కి వెళ్ళినపుడు పూర్తిగా క్లియర్ చేసుకోవాలి. ప్రొద్దున లేవగానే కనీసం అరగంట వ్యాయామం, యోగా, ధ్యానం చేయండి. అలాగే సాయంత్రం పూట వాకింగ్ చేస్తే బెటర్. దీనివల్ల శరీరం చాలా ఫిట్ గా ఉంటుంది. సైక్లింగ్ చేస్తే ఇంకా మంచిది. చిన్నపాటి దూరాలకి వెళ్ళడానికి బైక్ లు తీయకుండా సైకిల్ గానీ, నడక గానీ వాడడం మంచిది.
మీకు ఏ బట్టలు సరిగ్గా నప్పుతాయో తెలుసుకోండి. మరీ బిగుతుగా ఉండే వాటికి దూరంగా ఉండండి. బ్రష్ చేసుకునేటపుడు టూత్ పేస్ట్ ఎక్కువగా వాడకండి. టూత్ పేస్ట్ ఎక్కువగా వాడడం వల్ల దంతాలకి ఇబ్బంది కలుగుతుంది.
ఇవన్నీ పాటిస్తుంటే శరీరం అందంగా తయారై, మనసు కూడా బాగుంటుంది. మీరు బాగున్నారు అన్న ఫీలింగ్ మిమ్మల్ని మరింత అందంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.