ఆలయ సంపదని దోచుకోవాలని చూసినా బ్రిటిష్ వారిని వణికించిన శివాలయం

మన దేశంలో ఎన్నో అతిపురాతన ఆలయాలు ఉండగా అందులో కొన్ని నేటికీ దర్శనమిస్తుండగా, కొన్ని కనుమరుగయ్యాయి. అయితే బ్రిటిష్ వారు భారతదేశంలోకి వచ్చిన తరువాత ఎంతో విలువైన సంపదని వారిదేశానికి తరలించారు. అలానే ఇక్కడి ఆలయ శిల్పకళా నైపుణ్యానికి మంత్రముగులై ఆలయ సంపదని దేశాన్ని దాటించాలని చూసారని కానీ అది ఫలించలేదు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఎందుకు బ్రిటిష్ వారు ఈ ఆలయ సంపదని వారి దేశానికి తరలించలేకపోయారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జలకంఠేశ్వరాలయంతమిళనాడు రాష్ట్రం, వెల్లూరు జిల్లా లో అతి పురాతన జలకంఠేశ్వరాలయం ఉంది. ఈ ఆలయ గర్భగుడిలో 5 అడుగుల అద్భుత శివలింగం అనేది ఉంది. ఈ శివలింగం మహిమాన్విత శివలింగంగా ప్రసిద్ధి చెందింది. అయితే క్రీ.శ. 1566 లో ఈ ప్రాంతాన్ని పరిపాలించే వేలూరి రాజు ఈ ఆలయాన్ని, ఇక్కడి ఒక కోటను కూడా నిర్మించినట్లుగా తెలియుచున్నది. ఈ ఆలయం విజయనగర దేవాలయ నిర్మాణ శైలిలో నిర్మించారు.

జలకంఠేశ్వరాలయంఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఈ ఆలయ ఆవరణలో ఒక కల్యాణ మండపం ఉంది. ఇది చూడటానికి చిన్నదిగా ఉన్న ఈ కల్యాణ మండపంలో ఉన్న శిల్పకళా నైపుణ్యం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. అయితే పూర్వం ఈ కల్యాణమండపంలో ఉన్న శిలాపకళానైపుణ్యానికి మంత్రముగ్దులైన బ్రిటిష్ వారు, ఈ కల్యాణ మండపాన్ని ఏ రాయికి ఆ రాయి విడదీసి సముద్ర మార్గం గుండా లండన్ కి తరలించి అక్కడి తిరిగి ప్రతిష్టించాలని భావించారు. అయితే అందులో భాగంగానే లండన్ నుండి వీటిని తీసుకువెళ్ళడానికి ఒక స్టీమర్ బయలుదేరగా ఆ స్టీమర్ మార్గమధ్యలోనే మునిగిపోయింది. దాంతో బ్రిటిష్ వారు బయపడి తరలించకుండా అంతటితో అక్కడికే వదిలేసారు.

జలకంఠేశ్వరాలయంఇక ఆలయ ప్రధాన గోపురానికి పక్కనే ఉన్న ఆ కల్యాణమండపం మూడుభాగాలుగా ఉండగా, ఇందులో అన్ని కలపి 46 శిల్పకళా శోభితమైన స్థంబాలు ఉన్నాయి. ఇక్కడ అన్ని ఉన్న శిల్పాలలో ఒకటి మాత్రం చాలా ప్రతేకంగా చెప్పవచ్చు. ఇక్కడ ఒక ఎద్దు, ఒక ఏనుగు ఎదురెదురుగా నిలబడి ఉన్నట్లుగా ఉంటుంది. కానీ ఆ రెండిటికి మాత్రం తల ఒక్కటే. అయితే ఎద్దు శరీరాన్ని మూసి చుస్తే ఏనుగు కనిపిస్తుంది, అలాగే ఏనుగు శరీరాన్ని మూసి చుస్తే ఎద్దు ఆకారం కనిపించడం విశేషం.

జలకంఠేశ్వరాలయంఇంతటి శిల్పకళానైపుణ్యం, మంత్రముగ్దుల్ని చేసే కల్యాణ మండపం చూడటానికి ఇక్కడకి అధిక సంఖ్యలో భక్తు తరలి వస్తుంటారు.

జలకంఠేశ్వరాలయం

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR