పాము యొక్క ఈ చిహ్నాన్ని వాడటం వెనుక కారణం ఏంటి?

0
4302

హిందూ సంప్రదాయంలో పాముని దైవంగా భావిస్తారు. అందుకే పాముని నాగదేవత గా కొలుస్తూ అనేక ఆలయాలు కూడా వెలిసాయి. ఇది ఇలా ఉంటె పాము కుండలి అంటే ఏంటి? పాము యొక్క ఆ చిహ్నాన్ని వాడటం వెనుక ఆంతర్యం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Pamu Kundali Rahasyamయోగ సంప్రదాయంలో ఈ కుండలిని ఎప్పుడూ చుట్టచుట్టుకుని ఉన్న నాగుపాముకు ప్రతీకగా సూచిస్తారు. కుండలి అంటే శక్తి అని అర్ధం. అంటే మనిషిలో అంతర్లీనంగా ఉంటూ బయటకి కనిపించకుండా ఉండే శక్తి. అయితే చుట్టచుట్టుకుని ఉన్న నాగుపాముకి చాలా ఉన్నత స్థాయిలో నిశ్శబ్దం యొక్క శక్తి తెలుసు. పాము కదలకుండా పడుకున్నప్పుడు అది ఎంత నిశ్చలంగా ఉంటుందంటే, అది మీదారిలో ఉన్నా దాన్ని మీరు గుర్తించలేరు. అది కదిలినప్పుడే మీరు దాన్ని గమనించగలరు. కానీ ఈ చుట్టలు చుట్టుకున్న పాములు, లోపల నిద్రాణంగా ఉన్నా కూడా చలనశీలతని కలిగి ఉంటాయి. కుండలిని చుట్టలుచుట్టుకున్న నాగుపాముగా ఎందుకు సూచిస్తారంటే, ప్రతి వ్యక్తిలోనూ అనంతమైన శక్తి నిద్రాణంగా ఉంది, అది ప్రత్యక్షంగా కనిపించదు, అది కదిలితేనే తప్ప అసలు ఉన్నట్టు కూడా మనం ఊహించలేనట్టు ఉంటుంది.

Pamu Kundali Rahasyamమన దేశంలో పాము చిహ్నం లేని గుడి ఉండదు. దానికి కారణం ఈ సంస్కృతి పాముల్ని పూజిస్తుందని చెప్పడమే కాకుండా మీలో దాగున్న శక్తిని మేల్కొలుపుతుందని చెప్పడానికి సంకేతమే ఆ పవిత్ర స్థలం. పాములు చాలా విశేష దృష్టిగలవి. ఎందుకంటే అవి వినలేవు కేవలం ప్రకంపనలను మాత్రమే గ్రహించచగలవు. అయితే పాములు ధ్యాన నిమగ్నమైన వ్యక్తివైపు ఆకర్షించబడతాయి. మన సంప్రదాయంలో, యోగులెక్కడైనా ఒకచోట కూర్చుని ధ్యానం చేస్తే, అతనికి దగ్గరలోనే ఒక పాము ఉంటుంది. మీ శక్తులన్నీ నిశ్చలంగా ఉంటే, పాములు మీ వైపు ఆకర్షింపబడతాయి.

Pamu Kundali Rahasyamకుండలినిని మీరు ప్రజ్వలించగలిగితే, అది జీవితానికి ఉన్నతమైన ప్రమాణాలను చూడగల అవకాశాలకు ద్వారం తెరుస్తుంది. సంప్రదాయ సిద్ధమైన ఆదియోగి శివుని విగ్రహాలు, ఆయనతొ పాటు పాముని చూపిస్తాయి. అది ఆయన దృష్టి అత్యంత ఉన్నత స్థాయిలో ఉండడాన్ని సూచిస్తుంది. శక్తి తీవ్రత ఒక స్థాయికీ, పరిమాణానికీ చేరుకుంటేనే, సత్యాన్ని ఏ దోషం లేకుండా గ్రహిస్తారు. అలా లేనపుడు, మనకున్న కర్మ సంబంధమైన వాసనలు మనం వాస్తవాన్ని పరిశీలించడంలో, అవగాహన చేసుకోవడంలో అడ్డుగా నిలబడతాయి.

SHARE