వినాయక విగ్రహాన్ని పెట్టే సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి?

వినాయకచవితి వచ్చిందంటే చాలు చిన్నా పెద్దా అందరూ సంతోషంగా వినాయకుడిని పూజించటానికి ఉత్సాహంతో రెడీ అవుతూ ఉంటారు. వినాయక చవితికి…… పూలు, ఆకులు, విగ్రహాల సందడి మొదలవుతుంది. ఇంక పట్టణాల్లో అయితే వీధి వీధికో పందిరి వేసి గణనాధుడిని సేవిస్తారు.

అయితే ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో విఘ్నాలను హరించే వినాయకుని విగ్రహాన్ని తప్పకుండా పెట్టుకోవాలి. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, అభివృద్ధి పెంపొందుతాయి. విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం, బహుమతిగా ఇవ్వడానికి కొన్ని నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..? వాస్తుశాస్త్ర ప్రకారం ఈ నియమాలను విస్మరించకూడదు. లేకుంటే అశుభకరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంట్లో విఘ్నేశ్వరుడిని ఎక్కడ పెట్టుకోవాలో తెలుసుకుందాం…

1-Rahasyavaani-1100వాస్తుశాస్త్రం ప్రకారం విఘ్నేశ్వరుని విగ్రహం ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడం కుదరదు. ఇంటి ప్రదాన గుమ్మంపై ఇంట్లోకి ప్రవేశించే ద్వారం పైన ఉండకూడదు. ముఖ్యంగా వినాయకుని ప్రతిమ లేదా విగ్రహాన్ని బాత్రూం గోడ వద్ద అస్సలు ఉంచకూడదు. పడకగదిలో కూడా గణేశుని విగ్రహాన్ని పెట్టకూడదు. ఈ విధంగా చేయడం ద్వారా వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆలు, మగల మధ్య అనవసర ఆందోళనలు, ఒత్తిళ్లు ఉంటాయి, కాబట్టి వీటిని నివారించండి.

నృత్యం చేస్తున్నట్లు ఉన్న వినాయకుని విగ్రహాన్ని మర్చిపోయి కూడా ఇంట్లో పెట్టుకోవద్దు. ఇలాంటి విగ్రహాన్ని ఎవ్వరికీ బహుమతిగా కూడా ఇవ్వకూడదు. నృత్యం చేస్తున్నట్లున్న వినాయకుని ప్రతిమ ఉండటం వల్ల ఇంట్లో కలహాలు, సంఘర్షణలు చోటు చేసుకుంటాయని పెద్దలు విశ్వసిస్తారు. దీన్ని ఎవరికైనా బహుమతిగా ఇస్తే వారి జీవితంలో కూడా అసమ్మతి ఉంటుందని నమ్ముతారు.

4-Rahasyavaani-1100కూతురు లేదా ఎవరైనా అమ్మాయి వివాహంలో గణపతి విగ్రహాన్ని ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది అశుభాన్ని సూచిస్తుంది. ఇందుకు కారణం లక్ష్మీ, వినాయకుడు ఎప్పుడూ కలిసే ఉంటారు. లక్ష్మీతో పాటు వినాయకుడిని కూడా పంపితే ఇంటి నుంచి శ్రేయస్సు, సంతోషం కూడా వారితో పాటు వెళుతుందని నమ్ముతారు. ఇదే సమయంలో ఇంట్లో గణేశుని విగ్రహం ఉన్నట్లయితే తొండం ఎడమవైపు ఉన్న విగ్రహం పూజించాలి. ఎందుకంటే కుడి వైపు తొండం ఉన్న విగ్రహాన్ని పూజించడంలో ప్రత్యేక నియమాలు పాటించాలి.

5-Rahasyavaani-1100వాస్తుశాస్త్రం ప్రకారం పిల్లలు కావాలని కోరుకునే భక్తులు, కొత్తగా వివాహం చేసుకున్న జంటలు కుడివైపు తొండం తిరిగిఉన్న వినాయకుని విగ్రహాన్ని ఇంటికి తీసుకురావాలి. దానివల్ల తల్లిదండ్రులను గౌరవించే బిడ్డకు జన్మనిస్తుందని నమ్ముతారు. మరోవైపు ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలు ఉంటే వాటిని అధిగమించడానికి, వినాయకుని విగ్రహంతోపాటు ఫొటోను ఏర్పాటు చేయాలి.

6-Rahasyavaani-1100వినాయకునికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి, బెల్లం నైవేద్యం నివేదన చేయాలి. గరిక, అరటిపండు, ఉండ్రాళ్ళు, కొబ్బరికాయ, వెలగకాయ మొదలగు వాటితో పూజించగలిగితే విశేషమైన శుభ ఫలితాలను గణనాయకుడు ఇస్తాడు. ప్రతిరోజూ నిష్టతో పూజించాలి. బుధవారం స్వామివారికి ఇష్టమైన రోజు, పేదలకు శక్త్యానుసారం దానధర్మాలు విధిగా చేయాలి. అలాగే గోమాతను సేవించుకుంటే సమస్యలను తొలగిస్తుంది. విజయానికి దారితీస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,690,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR