Home Health ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ ని విడుదల చేసే మొక్కలు ఏంటో తెలుసా ?

ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ ని విడుదల చేసే మొక్కలు ఏంటో తెలుసా ?

0

ధేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంబిస్తున్న వేళ ఆక్సిజన్ కొరతతో యావత్ దేశం అల్లాడుతోంది. ప్రాణ వాయువు లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ సిలిండర్ల కోసం క్యూలైన్లలో నిల్చుంటున్న ధృశ్యాలు కనిపిస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో జనం ఊపిరి ఆడక రోడ్లమీద, ఆస్పత్రుల బయట చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుండడంతో, మనకూ ఇలాంటి పరిస్థితే వస్తుందేమోనని జనంలో ఒక విధమైన భయం వ్యాపించింది. అటు ఆక్సిజన్ సమస్య తీవ్రంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రానికి మొర పెట్టుకుంటున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో కేసులు భారీగా పెరగడంతో ఎక్కువ మందికి అవసరమై ఆక్సిజన్ కి డిమాండ్ ఏర్పడింది.

Increase the percentage of oxygen in the house during the coronaఆక్సిజన్ అందించడానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. రైళ్లు, యుద్ధ విమానాల్లో ఆక్సిజన్ ట్యాంకర్లను సరఫరా చేయడంతో పాటు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను తరలిస్తున్నారు. ప్రస్తుత సమయంలో ప్రాణాలు కాపాడుకోడానికి ప్రజలు ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌ను పరిమిత సమయం పాటు ఉపయోగించే ఒక మంచి ప్రత్యామ్నాయంలా చూస్తున్నారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అంటే ఒక మెషిన్. అది గాలి నుంచి ఆక్సిజన్ సేకరిస్తుంది. ఈ ఆక్సిజన్‌ను ముక్కులోకి వెళ్లే ట్యూబ్ ద్వారా తీసుకుంటారు.

దీన్నుంచి అందే ఆక్సిజన్ 90 నుంచి 95 శాతం స్వచ్ఛంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆస్పత్రిలో పడకలకోసం జనం నానా ఇబ్బందులూ పడుతూ, ఆక్సిజన్ లేక రోడ్లపైనే చనిపోతున్న సమయంలో వారి ప్రాణాలు కాపాడ్డానికి ‘ఆక్సిజన్ కాన్సంట్రేటర్’ ఒక ముఖ్యమైన పాత్ర పోషించవచ్చని అంటున్నారు. జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాలు కూడా భారత్‌కు సాయంగా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు పంపిస్తున్నాయి. చాలా ప్రైవేటు సంస్థలు, ప్రజలు కూడా అవసరమైనవారికి, ఆస్పత్రులకు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది నగరవాసులు తాము నివసిస్తున్న పరిసరాల్లో ఎక్కువ ఆక్సిజన్‌ దొరికేలా చూసుకుంటున్నారు. ఇందుకోసం ఎక్కువగా ప్రాణవాయువు అందించే మొక్కలను పెంచేందుకు ఇష్టపడుతున్నారు. ఇండ్లమీద, బాల్కనీ, గోడలపై ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎయిర్‌ ప్యూరిఫై మొక్కల పెంపకంపై నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. మరి ఆ మొక్కలేంటో. వాటివలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకొని మీరు కూడా వెంటనే తెచ్చి పెట్టుకోండి.

సాధారణంగా ఏ మొక్కలైనా గాలిలోని కార్బన్‌ డైయాక్సైడ్‌ను పీల్చుకొని తిరిగి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంటాయి. మరి అలాంటప్పుడు కొత్తగా ఆక్సిజన్‌ మొక్కలను పెంచుకోవడం ఏమిటి అని సందేహం కలగొచ్చు. నిజానికి అన్ని మొక్కలు ఒకే విధంగా శ్వాసక్రియను జరపవు. ఒకే స్థాయిలో ఆక్సిజన్‌ను విడుదల చేయవు. కొన్ని మొక్కలు పగటి పూట ఆక్సిజన్‌, రాత్రిపూట కార్బన్‌ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తుంటాయి. కొన్ని మొక్కలు చాలా తక్కువ పరిణలో ఆక్సిజన్‌ విడుదల చేస్తుంటాయి. మరికొన్ని మొక్కలు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. కానీ ప్రత్యేకమైన మొక్కలు పగలు, రాత్రి అన్న తేడా లేకుండా 24 గంటల పాటు ఆక్సిజన్‌నే ఉత్పత్తి చేస్తూ.. పరిసరాల్లోని గాలిని శుద్ధి చేస్తాయి. వీటినే ఆక్సిజన్‌ మొక్కలుగా పిలుస్తుంటారు. వాటిని మీ పరిసరాలలో పెట్టుకుంటే పరిసరాలు అందంగా కనిపించడంతో పాటు గాలిని శుద్ధి చేసి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.

తులసి మొక్క:

తులసి మొక్కతో భారతీయులకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. అనేక ఆయుర్వేద ఔషధగుణాలున్న ఈ మొక్కను ప్రాచీనకాలం నుండే ఇంట్లో పెట్టుకొని పూజించుకోవడం మన సంప్రదాయంలో భాగమైంది. ఆయుర్వేదానికి అవసరమయ్యే ఎన్నో ఔషధగుణాలు ఈ మొక్కలో ఉన్నాయి. అందుకే దీనిని క్వీన్‌ ఆఫ్‌ హెర్బ్స్‌గా పిలుస్తుంటారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే పరిసరాలన్నీ స్వచ్ఛంగా ఉంటాయి. రోజులో కనీసం 20 గంటల పాటు ఇది ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంటుంది. అదేవిధంగా కార్బన్‌ డై యాక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, సల్ఫర్‌ డై యాక్సైడ్‌ వంటి ప్రమాదకర వాయువులను సైతం ఇది పీల్చుకుని ప్రాణవాయువును అందిస్తుంది.

మనీప్లాంట్‌ :

నగరాలలో చాలామంది ఇళ్లలో ఈ మొక్కను అలంకరణ కోసం పెంచుకుంటూ ఉంటారు. కానీ మనకు తెలియని విషయం ఏమిటంటే ఈ మొక్క 24 గంటల పాటు ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఫార్మాల్డిహైడ్‌, బెంజిన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి వాయువులను సైతం ఇది పీల్చుకుంటుంది. దీనిని పెంచడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. నీడలో కూడా పెరిగే ఈ మొక్క ఆక్సిజన్ ని పుష్కలంగా అందిస్తుంది.

వీపింగ్‌ ఫిగ్‌:

అనేది ఫైకస్‌ రకానికి చెందిన మొక్క. ఇది నాసా గుర్తించిన ఎయిర్‌ ప్యూరిఫైయింగ్‌ మొక్క. ఇంటి పరిసరాల్లో ఉన్న ఫార్మాల్డిహైడ్‌, జైలిన్‌, టౌలిన్‌ తదితర కాలుష్యకారక వాయువులను సైతం ఇది పీల్చుకుంటుంది.

అరెకా పామ్:

ఇది ఒక చక్కటి ఇండోర్‌ ప్లాంట్‌. కార్బన్‌ డైయాక్సైడ్‌నే గాకుండా గాలిలోని కాలుష్యకారక వాయువులన్నింటినీ ఇది పీల్చుకుంటుంది. గాలిని శుద్ధి చేస్తుంది. ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ ( Oxygen )ను విడుదల చేస్తుంది. నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేసేలా ప్రోత్సహిస్తుంది.

స్పైడర్‌ ప్లాంట్‌:

ఇండోర్‌ ప్లాంట్‌ లలో ఎక్కువగా ప్రసిద్ధి చెందిన వాటిలో స్పైడర్ ప్లాంట్ ఒకటి. ఇది ఇంట్లోని గాలిని అధిక శాతం శుద్ధి చేస్తుంది. ఆక్సిజన్‌ను ఎక్కువ మొత్తంలో విడుదల చేస్తుంది. ఈ మొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే తీవ్ర ఒత్తిడిని సైతం పోగొడుతుంది.

స్నేక్‌ ప్లాంట్‌:

నాసా గుర్తించిన మరో ఎయిర్‌ ప్యూరిఫైయింగ్‌ మొక్క ఇది. ఇండోర్ ప్లాంట్స్ ఇష్టపడే వాళ్లలో ఎక్కువ మంది ప్రేమించే మొక్క కూడా. ఇది ఇంట్లోని గాలిని ఎక్కువగా శుద్ధి చేస్తుంది. కార్బన్‌తో పాటు, ఫార్మాల్డిహైడ్‌, బెంజిన్‌, జైలిన్‌ వాయువులనే కాదు.. ట్రై క్లోరో ఇథలిన్‌, నైట్రోజన్‌ తదితర అధిక కాలుష్యకారక వాయువులను సైతం ఇది పీల్చుకుంటుంది. ఆక్సిజన్‌ను ఎక్కువ శాతం విడుదల చేస్తుంది.

జెర్బారా డైసీ:

ఇవి అలంకరణ మొక్కలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ మొక్కల పుష్పాలను వేడుకల్లో అలంకరణ కోసం వినియోగిస్తుంటారు. అంతే కాదు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ను విడుదల చేయడం వీటి ప్రత్యేకత. కార్బన్‌తో పాటు ఇతర ప్రమాదకర కాలుష్యకార వాయువులను సైతం ఇది పీల్చుకుని పరిసరాలను శుద్ధి చేస్తుంది.

Exit mobile version