9 Inspiring Quotes By Ratan Tata

9 Inspiring Quotes By Ratan Tata

ప్రపంచంలోని అత్యుత్తమ వ్యాపార వేత్తల్లో రతన్‌ టాటా ఒకరు! విలువలతో కూడిన వ్యాపారం చేసేందుకు ఆయనెప్పుడూ ముందుంటారు. కిరాణా సరుకుల నుంచి రయ్యిన దూసుకెళ్లే కార్ల వరకు, గుండు పిన్నీసుల నుంచి ఉక్కు పోత వరకు ఎన్నో వ్యాపారాలను ఆయన విజయవంతంగా నడిపించారు.

వ్యాపార వేత్తగానే కాకుండా మెంటార్‌గా రతన్‌ టాటా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన మాట్లాడే ప్రతి మాటా ఆచితూచి మాట్లాడతారు. ఆయన ప్రతిమాటా అక్షర సత్యంగానే ఉంటుంది.

తొలితరం పారిశ్రామికవేత్తగా ఆయన అనుభవ సారాన్ని ఆయన కొటేషన్లే చెబుతాయి. అలాంటి వాటిలో కొన్ని ఇవిగో…

1. సరైన నిర్ణయాలు అనే దానిని నేను నమ్మను. నేను నిర్ణయాలు తీసుకుంటాను. వాటిని సరైన దారిలో నడిపిస్తాను

2. వేగంగా నడవాలని నీవు అనుకుంటే ఒక్కడివే ఆ పని చేయి. కానీ, చాలా దూరం నడవాలనుకుంటే మాత్రం కలసి నడవాలి

3. మనం ముందుకెళ్లేందుకు ఎత్తు పల్లాలు చాలా ముఖ్యం. ఎందుకంటే సరళరేఖ విజయానికి సూచిక కాదు. ఉదాహరణకు ఈసీజీలో సరళ రేఖ వస్తుందంటే మనం బతికున్నట్టు కాదు కదా

4. ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు. కానీ దానంతట అదే తుప్పు పడుతుంది. అలాగే, ఎవరూ ఒకరిని నాశనం చేయలేరు. సొంత మనస్తత్వమే అలా చేయగలదు

5. ప్రజలు నీ మీద వేసే రాళ్లు స్వీకరించు. వాటిని ఉపయోగించి ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించు

6. సీరియస్ గా ఉండకుండా జీవితాన్ని ఉన్నదున్నట్టుగా ఆస్వాదించాలి

7. ఇతరులను కాపీ కొట్టే వ్యక్తి కొంత వరకు విజయం సాధించొచ్చు.. కానీ, ఆ తర్వాత అతను మరింత విజయం సాధించలేడు

8. నేను ఎగరలేని రోజు విషాద దినమే నాకు

9. నేను ఎవరినైనా బాధపెట్టి ఉండొచ్చు. కానీ, ఎలాంటి పరిస్థితిలోనైనా రాజీపడకుండా నా వంతు మెరుగ్గా పనిచేసిన వ్యక్తిగా నన్ను నేను చూడాలనుకుంటాను

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR