ఆదిత్య హృదయం సోత్రం ద్వారా రాముడు పొందిన వరం ఏమిటి

పాపాలను, శాపాలను పోగొట్టి కష్టాలను తీర్చి ఆయుష్షును పెంచే అక్షర సాధనం ఆదిత్య హృదయం. ఈ అమోఘమైన స్తోత్రరాజాన్ని శ్రీరామచంద్రునికి అగస్త్య మహర్షి మంత్రాలవంటి మాటలలో వివరించాడు. కష్టసమయాల్లో ఉన్నప్పుడు, ఆపదలు ఎదురైనప్పుడు, అనారోగ్యాల బారినపడ్డప్పుడు మీరు కూడా ఆదిత్య హృదయం చదవండి. మంచి శక్తి వస్తుంది. రోజూ మూడుసార్లు ఆదిత్య హృదయం పఠిస్తే చాలు.ఆదిత్యుడు అంటే సూర్యుడు. ఆయనకు ఇష్టమైన ఆదివారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి శ్లోకాలు పఠిస్తే చాలా మంచిది. ఆదిత్యుడి స్తోత్రాలు రోజూ పఠిస్తే కచ్చితంగా మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. అంతా మంచే జరుగుతుంది.

Aditya's Hrudayamసీతమ్మ లంకలో రావణుడి చెరలో ఉందని తెలిసాక రాముడు లంకలోకి అడుగుపెడతాడు. శ్రీరాముడిని ఎదుర్కోవడానికి చాలా మందిని పంపుతాడు రావణుడు. భయంకరమైన రావణుడి సేన యుద్ధంలో పాల్గొంటుంది. వారందరినీ సంహరిస్తుంటాడు శ్రీరాముడు. యుద్ధం చేసి చేసి శ్రీరాముడు బాగా అలసిపోతాడు. ఇక ఎంతో మంది తన బాణాల దెబ్బకు విలవిలలాడిపోతుంటే రాముడు చూసి తట్టుకోలేకపోతాడు.

Aditya's Hrudayamనా వల్ల ఇంత మారణహోమం జరుగుతుందా అని బాధపడతాడు. అప్పుడు అగస్త్యుడు శ్రీరాముడిని అర్థం చేసుకుంటాడు. ఆయన దగ్గరికి వచ్చి నేను నీకు ఒక విషయం చెబుతాను దాన్ని పాటించు అంటాడు. చెప్పండి మునివర్యా అని రాముడు అన్నాడు.రామా మీరు ఇప్పుడు ఆదిత్యుడిని ప్రార్థించడం మంచిది. నీ అనుమానాలన్నీ పటాపంచలై, నీకు కొత్త శక్తి వస్తుందని చెబుతాడు. వెంటనే శ్రీరాముడికి అగస్త్యుడు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అందిస్తాడు.

Aditya's Hrudayamఆదిత్య హృదయంసోత్రం ద్వారా రాముడు కోల్పొయిన శక్తిని మళ్లీ పొందుతాడు. యుద్ధాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాడు.ఆదిత్య చరిత్రలో దాదాపు ముప్పై శ్లోకాలుంటాయి. ఇందులో ఇరవై రెండో శ్లోకం నుంచి ఇరవై ఏడో శ్లోకం వరకు ఆదిత్యహృదయం గురించి ఉంటుంది.

Aditya's Hrudayamదీన్ని పఠిస్తే ఏయే లాభాలు కలుగుతాయో అందులో ఉంటుంది. ఇక చివరన ఉండే ఇరవై తొమ్మిది, ముప్పై శ్లోకాలను పఠిస్తే కొత్త శక్తి వస్తుంది. రాములవారు అన్ని శ్లోకాలు పఠిస్తాడు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR