చిన్నా పెద్దా తేడా లేకుండా మనలో అందరికీ కలలోస్తాయి. ఇలా కలలు కనడం మానవసహజం.. కలలు అనేవి మన ఆలోచనలకు ప్రతిరూపాలు. వచ్చిన కలల్ని బట్టి మన లైఫ్ లో కొన్ని ఫలితాలు ఉంటాయని మన పూర్వికులు చెప్తుంటారు.. అయితే ఇలా వచ్చే కలలలో మంచి కలలు మనకు సంతోషానిస్తే, చెడుగా వచ్చే కలలు మాత్రం మనల్ని ఒకింత ఆందోళనకు గురిచేస్తాయి.. మరి ఇలా చేదు కళలు వస్తే నిజ జీవితంలో ఏదైనా చెడు జరుగుతుందా… అసలు ఈ చెడు కలలకు అర్దం ఏంటి తెలుసుకుండాం..
చాల మందికి చనిపోయిన వారు కలలో వస్తూ ఉంటారు.. ఇలా చనిపోయిన వారు కలలో వస్తే దాని అర్దం వారిని మీరు మర్చిపోలేకపోతున్నారని, వారి మరణాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారని అర్ధం.. మీకు మీరే చనిపోయినట్టు కలలో వస్తే మీలో పాజిటిట్ థింకింగ్ కి అది సంకేతం. కొంతమందికి కలలో వారు నగ్నంగా ఉన్నట్లు వస్తుంటాయి.. ఇలా మీరు నగ్నంగా ఉన్నట్టు కలలో వచ్చిందా మీ ఆత్మగౌరవం తగ్గుతుందనడానికి అది సూచన.. అది మీలో అంతర్గత భయాన్ని సూచిస్తుంది. దేని గురించో మీరు బాగా ఆలోచిస్తూ, దాని గురించి భయపడుతున్నట్టు సంకేతం..
అలాగే చాలామందికి పాములు కలలో వస్తుంటాయి.. ఇలా పాములు మీ కలలో వస్తున్నాయా.. అయితే పాములను నిజంగా చూడడానికి కలలో చూడడానికి చాలా తేడా ఉంది. నెగటివ్ ఆలోచనలు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయని అర్దం. మరి కొంతమందికి భాగస్వామి వదిలేసినట్లు, వారికీ వేరే వారితో వివాహం అయినట్లు కళలు వస్తుంటాయి.. ఇలా మీ భాగస్వామి మిమ్మల్ని వదిలేసినట్టుగా లేదా మీకు దూరంగా పోయినట్టుగా కలలొస్తే మీ రిలేషన్ షిప్ లో ఇన్ సెక్యూర్గా ఉన్నారని, లేదా వాళ్లతో హ్యాపీ గా లేరని అర్దం. అవసరమైతే వాళ్లని వేరొకరి కి త్యాగం చేయడానికి సిద్దంగా ఉన్నారని అర్దం.
ఇంకా చాలావరకు విద్యార్థులు, ఉద్యోగులలో ఎగ్జామ్ మిస్ అయినట్టు, ఎగ్జామ్ ఫెయిలైనట్టు కలలోస్తుంటాయి.. అది మన ఒత్తిడిని సూచిస్తుంది. ఇంట్లో వాళ్లు మనపై పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ చేరుకోలేకపోతున్నట్లు ఆందోళన పడ్తున్నామని దానికి అర్ధం.
అలాగే మీకు యాక్సిడెంట్ అయినట్టు, మీరు గాయపడినట్టు కలలోస్తే మీరు ఆత్మగౌరవం పెంచుకోవాలని సూచిస్తాయి. మీ లైఫ్ బలహీనంగా ఉందని లైఫ్ లో సమస్యల్ని సమర్ధవంతంగా ఎదుర్కోవాలని తెలుపుతాయి. అయితే ఇలా చెడు కలలు వచ్చేవారు సృజనాత్మకత కలిగి ఉంటారని అధ్యయనాలు నిరూపించాయి.