భోగి పండ్లను పిల్లల నెత్తిన ఎందుకు పోస్తారు?

తెలుగువారికి సంక్రాంతి, తమిళులకు పొంగల్ పేరు ఏదైనా పండుగ ఒకటే. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణించిన సనాతన హైందవ సంస్కృతిలో ప్రకృతి పరిశీలన, దాని ప్రభావాల అధ్యయనం కనిపిస్తాయి.

Bhogi Palluదక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దూరం అవటం వల్ల భూమిపై చలి పెరుగుతుంది. ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు రోజు ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు. కాలక్రమేణా ఈ మంటలు వేయడానికి భోగీ అనే పేరు వచ్చింది.

Bhogi Palluభోగి అనగానే గుర్తుకు వచ్చేది భోగి పళ్ళు. ఈ పళ్ళను పోయడంలో అంతరార్ధం ఏమిటి అనే ప్రశ్న తలెత్తవచ్చు. భోగి నాడు భోగి పళ్ళు అనే పేరుతో రేగి పండ్లను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టు, రేగి పండ్లు శ్రీ మన్నారాయణ స్వామి ప్రతిరూపం. వాటిని తల మీద పోయడం వలన శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి.

Bhogi Palluభోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి, దిష్టి తొలుగుతుందంటారు. మనకు కనిపించదు కానీ తల పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందటా. ఈ భోగి పండ్లను పోస్తే పిల్లలు జ్ఞానవంతులవుతారటా.

 

Related Articles

Stay Connected

1,378,040FansLike
591,000FollowersFollow
1,320,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR