అష్టదశ శక్తిపీఠాలలో అమ్మవారి కాలి గజ్జెలు పడిన ప్రదేశం ఎక్కడ ?

0
13087

దక్ష ప్రజాపతి తలపెట్టిన యాగం లో అవమాన భారానికి గురై సతీదేవి ఆత్మహుతి చేసుకుంటుంది. అప్పుడు శివుడు కోపానికి గురై వీరభద్రుడు సృష్టించి దక్ష ప్రజాపతి తలని నరికి సంహరిస్తాడు. ఆ తరువాత, శివుడు సతీదేవి నిర్జీవ దేహాన్ని తన భుజాన వేసుకుని ప్రళయ తాండవం చేస్తుండగా, శివుడిని శాంతిప చేయడానికి విష్ణువు తన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు. దాంతో ఆమె దేహం 18 ఖండాలై భూలోకంలోని వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. కాలక్రమంలో అవే అష్టాదశ శక్తి పీఠాలు గా అవతరించాయి. అలాంటి శక్తి పీఠాల్లో మొదటిది అయిన శ్రీ శాంకరీ దేవి ఆలయం శ్రీలంక నుండి హిమాలయాలకు ఎందుకు వచ్చింది అనే రహస్యాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

shaktipeetamఅష్టదశ శక్తిపీఠాలలో అమ్మవారి కాలి గజ్జెలు పడిన ఈ ప్రదేశాన్ని మొదటి పీఠం అని పేర్కొంటారు. ఇది శ్రీలంకలోని పశ్చిమ సముద్ర తీరాన ట్రిoకోమలి నగరంలో వెలసింది. ఈ ఆలయంలోని అమ్మవారిని శ్రీ శాంకరీ దేవి అని పిలుస్తారు. ఇక్కడి అమ్మవారు దుష్ట శిక్షణ చేసి ధర్మాన్ని కాపాడుతూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే రావణాసురుడు ప్రతి నిత్యం ఈ అమ్మవారిని పూజించేవాడని తెలుస్తోంది.

shaktipeetamపురాణ విషయానికి వస్తే, రావణుడు సీతను అపహరించి తెచ్చినప్పుడు శ్రీ శాంకరీ దేవి ఎంతగా హెచ్చరించినా వినిపించుకోలేదట. అప్పుడు ఆగ్రహానికి గురైన అమ్మవారు రావణా… సీతాదేవిని బంధించి నీవు తప్పు చేశావు. నీవు ఆమెను వదిలిపెట్టు. లేదంటే నేను నీ రాజ్యం వదిలి వెళ్ళిపోతాను అని పలికింది. అప్పుడు శాంకరీ దేవి మాటలను రావణాసురుడు ఖాతరు చేయక పోవడంతో లంకను వదిలి వెళ్ళిపోసాగింది. ఈ సమయంలో మహర్షులు లంక వదిలివెళ్ళినా భూలోకం వదలి వెళ్ళవద్దని ప్రార్థించడంతో ఆ దేవి దక్షిణం నుంచి ఉత్తరమునకు సాగిపోయి హిమాలయం, కాశ్మీరం మొదలైన క్షేత్రాలలో నిలబడిపోయిందని చెప్తారు. మహర్షులు ఆ దీవిని బనశంకరీ అని పిలిచారు. ఆ విధంగా దేవి వెళ్ళిపోవడంతో శక్తిపీఠం కాలగర్భంలో కలిసిపోయిందని భావిస్తారు.

shaktipeetamఇక మరో కథనం ప్రకారం ఈ ప్రదేశంలో ఏ ఆలయం లేకపోయినా, శ్రీ శాంకరీ దేవి ఆలయ ఖచ్చితంగా వున్నదని చెప్పినచోట అది వున్నట్లు చూపే గుర్తుగా ఒక స్తూప స్థంబాన్ని కొండ శిఖరం మీద నిర్మిచారు. అయితే ఈ ఆలయాన్ని 16 -17 శతాబ్దం మధ్య పోర్చుగీస్ వారు నాశనం చేశారు. చరిత్ర ఆధారంగా 17 వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు ఈ ద్వీపాన్ని ముట్టడించారు. కొండ శిఖరం పైన వున్న ఈ ఆలయాన్ని వారి ఓడ నుండే ఫిరంగులతో దాడి చేసి పూర్తిగా నాశనం చేసారని చెబుతారు.

5 mottamodhata velasina shakthipitam ekkada undhiఈవిధంగా మొదటి శక్తి పీఠంగా శ్రీ శాంకరీ దేవి అమ్మవారు శ్రీలంకలో వెలిసిందని పురాణాలూ చెబుతున్నాయి.