గరుడ భగవానుని ఏ రోజున పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది

సోమవారం శివుడి పూజ, మంగళవారం రోజు హనుమాన్ పూజ ఇలా ఒక్కో వారానికి ఒక్కో దైవాన్ని ఆరాధిస్తారు అనే విషయం తెలిసిందే. అయితే విష్ణుమూర్తి వాహనం అయిన గరుడ భగవానుని ఏ రోజున పూజించాలి? ఏ రోజున పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో చూద్దాం.

garuda bhagavanఅవతారపురుషుడు, మోక్షాన్ని ప్రసాదించే విష్ణుమూర్తికి వాహనుడైన గరుడభగవానుడిని దర్శించుకోవడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. శనివారం పూట గరుడ భగవానుని దర్శించుకుంటే పుణ్య ఫలితాలు చేకూరుతాయి. పక్షుల్లో రాజుగా విరాజిల్లుతున్న గరుడ భగవానుని శనివారం నాడు ఏ పూటైనా వీక్షించడం ద్వారా శుభ ఫలితాలుంటాయని పురోహితులు చెబుతున్నారు.

garuda bhagavanశనివారం మాత్రమే కాకుండా.. ఆదివారం రోజున గరుడ పక్షిని దర్శించుకుంటే వ్యాధులు తొలగిపోతాయి. ఇంకా సోమ, మంగళ వారాల్లో గరుడభగవానుడి దర్శనం లభిస్తే ముఖ సౌందర్యం పెంపొందడంతో పాటు మానసిక ఆందోళనలు తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు.

garuda bhagavanబుధ, గురువారాల్లో గరుడ భగవానుడిని దర్శించుకుంటే దుష్టశక్తుల ప్రభావం నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే శుక్ర మరియు శనివారాల్లో గరుడ భగవానుని దర్శించుకుంటే దీర్ఘాయుష్షు చేకూరడంతో పాటు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు సూచిస్తున్నారు.

garuda bhagavanగరుడ దర్శనం లభించకపోతే విష్ణుమూర్తి ఆలయాల్లో స్వామివారితో పాటు గరుడ భగవానున్ని శనివారం దర్శించుకునే వారికి సకల సంపదలు, ఆర్థికాభివృద్ధి, దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుంది. ఇంకా శనివారం పూట సాయంత్రం ఆరుగంటలకు నారాయణ స్వామి ఆలయంలోని గరుడ భగవానునికి నేతితో దీపం పెట్టే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR