Home Unknown facts గోవ్రతం ఆచరించడం వల్ల కలిగే ఫలితం ఏంటి ?

గోవ్రతం ఆచరించడం వల్ల కలిగే ఫలితం ఏంటి ?

0

జపతపాలు, వ్రతోపవాసాలు తదితరాలవల్ల కలిగే పుణ్యం గోవ్రతంవల్ల కూడా కలుగుతుందని శ్రీకృష్ణుడు తన మేనత్త అయిన కుంతి దేవికి ఉపదేశిస్తాడు. ఈ వ్రతాన్ని సూర్యుడు మకరంలోకి ప్రవేశించినపుడు కానీ, రథసప్తమినాడు కానీ, తమ జన్మనక్షత్రానికి అనుకూలమైనపుడు కానీ ఆరంభించాలి. అలాగే రజోదోషం వీడిన స్ర్తిలు 18 నెలల తరువాత ఈ వ్రతాన్ని ఆచరించాలి.

గోవ్రతంమకర సంక్రాంతి, రథ సప్తమి, మంగళవారంతో కూడిన కృష్ణచతుర్దశి, కార్తీకం, మార్గశిర మాసాలలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సమస్త దోషాలు మటుమాయవౌతాయి. శ్రీకృష్ణుని సూచనమేరకు కుంతీమాత ఈ వ్రతాన్ని ఆచరించి, సద్గతి పొందింది. ఆనాటినుంచి ‘గోవు’దైవంగా పూజింపబడ్తూ, నీరాజనాలందుకుంటోంది.

గోవ్రతం చేయడానికి నియమాలు:

* ఈ వ్రతం చేసేవారు ప్రాతఃకాలంలోనే నదీ స్నానం చేయాలి.

* నిత్యపూజాదికాలను ముగించుకున్న తర్వాత ఇంటికి తూర్పున మంటపం వేయాలి. అయిదు రంగులతో స్వస్తిక్, పద్మక, నాగబంధాది మండలాలను నిర్మించాలి.

*లక్ష్మీనారాయణుడి ప్రతిమను బంగారం, వెండి లేదా యథాశక్తి చేయించి పంచామృతాలతో అభిషేకించాలి.

* ఆవు, దూడ కల ప్రతిమను బంగారు, వెండి లేదా యథాశక్తి చేయించి పంచామృతాలతో అభిషేకించాలి.

* ఆ ప్రతిమలను బియ్యపురాశిలో ఉంచి పంచ పల్లవమాలతో పంచ వల్కలములతో అలంకరించి కలశాన్ని కొత్త వస్త్రాల చాపుతో చుట్టి పూజించాలి.

* అనంతరం దూడ కల్గినటువంటి ఆవును పూజించాలి.

* ఆవును రాత్రి నాలుగు జాములయందు పూజించి పురాణ శ్రవణాదులతో రాత్రి జాగారం చేయాలి.

* తర్వాత సంప్రదాయానుసారంగా అగ్నిప్రతిష్టచేసి, సమిధలు, పాయసాన్ని హవిస్సు చేసి, హోమం చేయాలి. పూర్ణాహుతి ఇచ్చిన తర్వాత ఆచార్యునికి ప్రతిమను, వస్త్రాలతో దానమీయాలి.

ఇలా ఈ వ్రతాన్ని ఆచరించేవారు అన్ని వేదాలు చదివితే వచ్చే పుణ్యఫలాలను అన్ని తీర్థాలందు స్నానమాచరించిన పుణ్యఫలాలను పొంది సద్గతులను పొందుతారని శ్రీకృష్ణ్భగవానుడు చెప్పాడు.

 

Exit mobile version