ఇంటి ఇల్లాలుచేయాల్సినవి, అలాగే చేయకూడని కొన్ని పనులు

ఇంటికి దీపం ఇల్లాలే అని ఇపుడు కాదు పూర్వకాలం నుండి మన పెద్దవాళ్ళు చెప్తున్న హితోక్తి.. ఒక ఇల్లు బావుండాలన్న, ఆ ఇంట్లో వారు ఎదుగుదలకైనా.. ఆ ఇంటి ఇల్లాలు తీరు మూల కారణం అని చెప్తుంటారు.. ఈ నేపథ్యంలో ఇంటి ఇల్లాలుచేయాల్సినవి, అలాగే చేయకూడని కొన్ని పనులు గురించి ప్రస్తావించారు పండితులు.. మరి అవేంటో మనం ఇపుడు తెల్సుకుందాం..

ఇంటి ఇల్లాలుఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్ల పక్షము లోనే చేయాలి.. అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలెను. బహుళ పక్షంలో చేయకూడదని చెప్తున్నారు పండితులు.. ఆడవారు ఎప్పుడు దిండ్లుపై కూర్చోకూడదు.. ఆడవారనే కాదు ఇంట్లో ఎవరు కూడా అలా దిండు మీద కూర్చోకూడదట.. ఇంట్లోని మగవారు మంగళ వారము నాడు క్షవరము చేసుకోవడం, గడ్డము గీసుకోవడము చేయనీయ వద్దు. ఇలా చేస్తే దారిద్రమని చెప్తారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే.. చాలామంది రాత్రి సమయమున గాజులు కమ్మలు తీస్తుంటారు.. కానీ అలా తీయరాదు.

ఇంటి ఇల్లాలుఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినపుడు పలకిరించ వచ్చే వారిని ఎదురెళ్లి ఆహ్వానించ కూడదు. అలా చేస్తే ఎదురెళ్లి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది.. అలాగే పలకరించి వెళ్లే వారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు. కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి, ఎందుకంటే పసుపు క్రిమినాశిని.స్త్రీలు ఎప్పుడు కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించకూడదు… సువాసిని స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్తువులు ధరించడం మంచిది కాదు. ఉప్పు, మిరప కాయలు, చింతపండు, ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చిన, చేతికి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి..

ఇంటి ఇల్లాలుఅలాగే ప్రతి రోజు భోజనానికి ముందు కాకికి అన్నము పెట్టాలి.. ఇలా చేయటం పితృ దేవతలకు సంతృప్తిని ఇస్తుంది.. అలాగే కాకికి భోజనానికి ముందు, కుక్కకు భోజనం తర్వాత పెట్టాలి.టెంకాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్లు వుండే భాగము ఉంచుకొని మిగత భాగము ఇతరులకు ఇవ్వవలెను.స్త్రీలు ఎప్పుడు జుట్టు విరపోసుకొని ఉండకూడదు.. ఇది జ్యేష్టాదేవి స్వరూపము. ఇది ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది.

ఇంటి ఇల్లాలుఅలాగే శుక్రవారమునాడు గాని, జీతము వచ్చిన వెంటనే గాని ముందుగా ఉప్పు కొనండి.. ఇలా చేయటం వలన సంపదోన్నతి కలుగుతుందని చెప్తారు.. ఆడవాళ్లు కాలిపై కాలు వేసుకొని కుర్చోవడము, కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం, ఒంటి కాలితో నిలవడం గాని, ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు చేయకూడదు. ఇవి దారిద్ర హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశము కలదు.

ఇంటి ఇల్లాలు
ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచేపుడు కుడి చేతితో చేయాలి, ఎడమ చేతిని ఉపయోగించ కూడదు. సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ,ఆహారము తినకుండా నిద్రించ కూడదు.స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు. ఎప్పుడైనా పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్ప కూడదు, రేపు తీసుకుంటాను అని చెప్పాలి…ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటె శ్రాద్ధము ముగిసేవరకు ముగ్గు వేయకూడదు, శ్రాద్ధానంతరము ముగ్గు వేయాలి. ఇంటి ఇల్లాలి నోటినుండి ఎప్పుడు కూడా పీడ ,దరిద్రం, శని, పీనుగా, కష్టము, అనే పదములను వినిపించకూడదు.. ఇంటిలో దుమ్ము ధూళి, సాలెగూళ్లు దారిద్ర హేతువులు. కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి..

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR