శ్రీ మహావిష్ణువే అనంతపద్మనాభుడిగా ఎలా వెలిశారో తెలుసా ?

0
6438

శ్రీ అనంత పద్మనాభస్వామి వారు ఆదిశేషుడు అనే నాగును పాన్పుగా చేసుకొని శయనించి ఉండటం వలన ఈ పుణ్యస్థలానికి అనంతశయనము అనే పేరు వచ్చినది అని అంటారు. ఇక్కడ తన నాభి యందు బ్రహ్మదేవుడు కొలువు దీరిన పద్మాన్ని కల్గి ఉన్న శ్రీ మహావిష్ణువే అనంతపద్మనాభుడు. మరి ఈ స్వామివారు ఇక్కడ ఎలా వెలిశారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Anantha Padmanabha Swamy Temple

తిరువనంతపురం లో అనంత పద్మనాభస్వామి కొలువై ఉండటానికి ముఖ్య కారకుడు బిల్వ మంగలుడు. అయితే ఇతడు కేరళలోని ధనిక మరియు సంప్రాదయబద్దమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మొదట్లో బిల్వ మంగలుడు పూజలు చేస్తూ భక్తి మార్గంలో ఉండేవాడు. అయితే తన దగ్గర ఉన్న ధనం కారణంగా అతడు స్త్రీ వ్యామోహానికి, మద్యానికి బానిసయ్యాడు. ఆ తరువాత తన తప్పుని తెలుసుకొని అన్ని వదిలేసి కృష్ణుడిని ప్రార్థిస్తూ, కేవలం కృష్ణ నామం తప్ప మరో ద్యాస లేకుండా శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ గొప్ప కృష్ణ భక్తుడిగా మారిపోయాడు. అలా చాలా దూరం ప్రయాణించి ఒక అరణ్యంలోకి ప్రవేశించి కృష్ణుడిని ఆరాధిస్తూ ఉన్నాడు.

Anantha Padmanabha Swamy Temple

ఇలా ఉండగా ఒక రోజు అయన దగ్గరికి ఒక పిల్లవాడు రాగ, అతడికి ఆ బాలుడు బాగా నచ్చడంతో ఇక్కడే నాతో ఉండిపో అని అనగా, అప్పుడు ఆ పిల్లవాడు ఏ రోజు అయితే నీవు నన్నుమర్యాదగా చూసుకోవో ఆ రోజు నేను నిన్ను వదిలేసి అనంతకాడా అనే ప్రదేశానికి వెళ్లిపోతానని చెప్పడంతో దానికి ఆ భక్తుడు సరేనని చెబుతాడు.

Anantha Padmanabha Swamy Temple

ఒక రోజు ఆ భక్తుడు పూజలో ఉండగా ఆ పిల్లవాడు తన చేష్టలతో విసుగు తెప్పించడంతో బాలుడిని మందలించడంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఆ భక్తుడు బాలుడిని వెతుకుంటూ అనంతకాడా అనే ప్రదేశానికి వెళ్లగా ఆ పిల్లవాడు అతని ముందే ఒక పెద్ద చెట్టులోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ చెట్టు మహా వృక్షంలాగా మారి కిందపడి ఐదు పడగలు ఉన్న శేషు పాముల పవనిస్తున్న మహావిష్ణువు లా మారిపోవడంతో ఆ చిన్నపిల్లవాడే మహావిష్ణవు అని అర్ధం చేసుకొని నమస్కరించి ఆ విగ్రహాన్ని చిన్నగా మారాలని కోరగా వెంటనే ఆ విగ్రహం 18 అడుగుల విగ్రహంగా మారింది. అప్పుడు ఆ కాలంలో ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న కులశేఖరుడు అనే రాజు, బిల్వమంగళుడు ఇద్దరు కలసి స్వామివారికి ఆలయాన్ని నిర్మించారు. అదే అనంతపదనాభస్వామి ఆలయం.