శివుడు విగ్రహ రూపంలో ఉన్న ఆలయం ఎక్కడ ఉందొ తెలుసా ?

0
411

సాధారణంగా మహాశివుని మనం లింగరూపంలోనే చూస్తుంటాం.. అయితే శివుడు విగ్రహ రూపంలో ఉన్న ఏకైక క్షేత్రం ఉంది.. మరి ఈ ఆలయం ఎక్కడ వుంది.. క్షేత్ర విశేషాలేంటో ఇపుడు తెలుసుకుందాం..

Shivuduపరమ శివుడు సాధారణంగా లింగరూపంలో మనకు దర్శనమిస్తాడు. అయితే అతి అరుదుగా మాత్రమే విగ్రహ రూపంలో కనిపిస్తాడు. అందులోనూ సిద్ధాసనంలో కుర్చొని ఉన్న శివుడు కొలవై ఉన్న క్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో అమరాపురం మండలం హేమావతిలోని సిద్ధేశ్వరాలయం. ఇక స్వామివారి శిరస్సు పై చంద్రుడితో పాటు సూర్యుడు కూడా ఉండటం ఇక్కడ విశేషం. అంతేకాకుండా ఇక్కడ ప్రతి శివరాత్రి రోజూ సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు స్వామివారి నుదుటను తాకుతాయి.

Shivalingamకుడిచేతిలో బ్రహ్మకపాలాన్ని, మెడలో కపాలాలను కూడా స్వామి వారు ధరించి సంగం మూసిన కనులతో స్వామివారు కనిపిస్తారు. ఇటువంటి రూపం భారత దేశంలో ఇదొక్కటే అని స్థానికులు చెబుతున్నారు. ఇదే ఆలయంలో పంచ లింగాలు కూడా మనం దర్శించావంచు..ప్రతి శివరాత్రికి సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు ఈ దేవాలయంలోని మూల విగ్రహం నుదిటిమీద ఖచ్చితంగా పడుతాయి.

Lord Shivaసృష్టి స్థితి లయకారుడైన శివుడి తలమీద చంద్రుడితో పాటు సూర్యుడు ఉండటం వలెనే ఈ అద్భుతం జరుగుతుంది అని నమ్ముతారు భక్తులు.. ఇక ఆలయంలో శివుడికి ఎదురుగా ఉన్న నంది స్వామివారిని చూస్తున్నట్టుగా కాక కొంత పక్కకు తిరిగి ఉంటుంది. అన్ని ఆలయాల్లా కాకుండా పడమర ముఖంగా ప్రవేశ ద్వారం ఉన్న దేవాలయాల్లో హేమావతి సిద్దేశ్వరస్వామి దేవాలయం కూడా ఒకటి. హేమావతిని పూర్వ కాలంలో హెంజేరుగా పిలిచేవారు. కాలక్రమంలో అది హేమావతిగా మారింది. పూర్వం ఈ ప్రాంతాన్ని నోలంబరాజులు పరిపాలించేవారు. అందువల్ల హేమావతిలోని సిద్దేశ్వరుడిని నోలంబేశ్వరుడు, ఎంజేరప్ప అని కూడా అంటారు.. శివుడు ఇలా విగ్రహ రూపం ఉన్న ఆలయం ఇదొక్కటే కావటం విశేషం..!

SHARE