పూజ గదిలో ఉండకూడని దేవతా మూర్తులు.. ఇవి ఉంటే వెంటనే తీసేయండి

దైవం సర్వాంతర్యామి.. అయినప్పటికీ ప్రతి ఒక్కరు వారి వారి గృహంలో దేవునికి ఒక స్థానం కల్పించి రోజూ పూజ చేసుకోవటం ఆత్మ సంతృప్తిని కలిగిస్తుంది.. ఈ ప్రకారంలో చాలామంది దేవత మూర్తుల విగ్రహాలను ఎలా పడితే అలా పెట్టేసి పూజచేస్తుంటారు.. అయితే మనం ఇంట్లో దేవతా మూర్తులను ఎలా పెడితే అలా పెట్టకూడదని, వాటికి కొన్ని పద్ధతులుంటాయని చెప్తున్నారు పండితులు.. మరి ఆ నియమాలేంటి.. మనం ఇపుడు తెల్సుకుందాం..

పూజ గదిలో ఎంత ఖరీదు అయిన విగ్రహాలు ఉంచినా సరే, గదిలోని గోడకు పసుపు రాసి కుల దైవం పేర బొట్టులు పెట్టాలి. వైష్ణవులు అయితే తిరు నామాలు, శైవులు అయితే అడ్డనామాలు, శక్తేయులు అయితే పసుపు మధ్యలో గౌరీ తిలకం బొట్టుగా పెట్టాలి, కొంతమంది తులసి ఆకుతో గాని తమల పాకును గాని గోడకు రుద్ది ఈ నామాలు పెడతారు, ఎంత ఖరీదైన పూజ వస్తువులు ఉంచినా పూజ గది గోడకు ఇలా చేయటం మాత్రం మన సాంప్రదాయం. ఇంట్లో నటరాజ స్వామి విగ్రహం పెట్టుకోకూడదు, నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండవచ్చు కానీ ఇంట్లో ఉండకూడదు.. సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు, ప్రతి దినం ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి.

Pooja Mandirఅలాగే పూజ గది విడిగా లేని వారు.. పంచముఖ హనుమంతుడి ని పెట్టకూడదు, హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం గాని ఏది పూజ గది విడిగా లేని వారు ఇంట్లో ఉంచకూడదు. అలాగే ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామి ఫోటో గాని విగ్రహం కానీ ఇంట్లో ఉంచకూడదు, లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ప్రతిమల్ని పెట్టికొని పూజ చేయవచ్చు..చేతిలో పిల్లనగ్రోవి ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదు, ఆవుతో ఉన్న కృష్ణుడి విగ్రహం గాని ఫొటో గాని చిన్న పరిమాణంలో ఉండవచ్చు… ఇవి మల్లి పెద్దదిగా ఉండకూడదు..

కొంతమంది పెద్ద పెద్ద దేవతా విగ్రహాలను ఇంట్లో పెడుతూండటం మనం చూస్తుంటాం.. విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది. పండో, పాలో పెట్టి కూడా హారతి ఇస్తే సరిపోతుంది, అదే విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహా నివేదన, వారంలో ఒక్కసారి అయినా అభిషేకం ఖచ్చితంగాఉండాలి .. పూజ లేకుండా పెద్ద విగ్రహాలు ఇంట్లో ఉండకూడదు…

Pooja Mandirఇంటి గుమ్మానికి దిష్టి కోసం అని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు, వినాయకుడి ఫొటో, కానీ,దిష్టి యంత్రం గాని, కాళీ పాదం ఫోటో కానీ పెట్టడం మంచిది..నిత్యపూజ లో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసి వేయాల్సి వస్తే వాటిని గుడిలో పెట్టాలి… ఇంటిలో పూజించే వినాయకుడి విగ్రములో తొండం ఎడమ వైపు ఉండాలి, విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో ఉండే విగ్రహంకి తొండం కుడి వైపు ఉండాలి.. వ్యాపారం చేసే ప్రాంతంలో నిల్చున్న వినాయకుడు ఉండాలి.

ఇంట్లో ఎక్కడా లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు, లక్ష్మీ దేవి పచ్చరంగు చీరతొ అటూఇటూ ఏనుగులు ఉన్న ఫొటో కి గృహస్థులు పూజించడం చాలా మంచిది.. లక్ష్మీ దేవి విగ్రహం కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి. అలాగే ఇంట్లో కాళికా, ప్రత్యంగిరా దేవి ఫోటోలు పెట్టకూడదు. పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ ఐన వెంటనే ప్రసాదంగా స్వీకరించాలి. మనం చేసిన పూజకు దేవుని అనుగ్రహం ఆ ప్రసాదం అని భావించి స్వీకరించాలి. ఇంట్లో నవగ్రహాల ప్రతిమలు పెట్టకూడదు.. గుడికి వెళ్ళినపుడు కూడా నవగ్రహాలను తాకకూడదు.. నీరు, పాలు, పెరుగు, నెయ్యికి అంటు ఉండదు. అవి ఎక్కడ నుండి అయినా ఎవరి నుండి అయినా తీసుకొని డువునికి నివేదించవచ్చు..

అయితే దేవునికి ఎపుడు పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు, కాచి చల్లారిన పాలు అభిషేకంకి వాడకూడదు..లక్ష్మీ దేవి నివాసం పాలు.. లక్ష్మి దేవికి రోజు క్షీరాన్న నైవేద్యం సమర్పిస్తే మంచి జరుగుతుంది.. అలాగే జేష్ఠ దేవి అనుగ్రహం పొందాలంటే పులిహోర నివేదన చేయాలి.. ఇలా చేస్తే జ్యేష్ఠ దేవి పెట్టె కష్టాలనుండి ఉపశమనం లభిస్తుంది.. అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో పులిహోర వండే వాళ్ళు… ఈ పులిహోర అందరికి పంచి పెడితే ఇంకా మంచిది.

Pooja Mandirధ్యానం చేసుకునే ఆసనం అడ్డంగా వేసుకుని కూర్చో కూడదు, నిలువుగా ఉండాలి. జపమాల చూపుడు వెలుపైన తిప్ప కూడదు మధ్య వేలు తోనే చేయాలి.. మంత్ర జపానికి వాడే జపమాల మెడలో వేసుకోకూడదు, అలాగే మెడలో వేసుకునే మాల జపానికి వాడకూడదు..ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించ కూడదు…. ఇంట్లో వారు తరచూ తిరిగే చోట కుల దైవం ఫోటో కనిపించేలా పెట్టాలి, ఇలా చేయటం వలన అటు ఇటు తిరుగుతూ, వస్తూ పోతూ ఆ ఫోటో చూసినప్పుడు ఒకసారి ఆ నామం వారి మనసులో తలచుకోవడం అలవాటు అవుతుంది.

అద్దె ఇంటి వాస్తు కొంతమంది జాతకానికి సరిపడక పోవచ్చు అలాంటి వారు వాస్తు దోషాలకు పరిహారం గా ఇంద్రధనస్సు రంగులు కలిసిన కలిసిన ఏదైనా వస్తువును గోడకు పెట్టాలి…. అలాగే ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి. ఇలా చేయటం వలన నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది.. ఇంట్లో గాలి కూడా పరి శుభ్రం అవుతుంది..!

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR