రావిచెట్టు మహిమ గురించి గీతలో శ్రీకృష్ణుడు ఎం చెప్పాడో తెలుసా ?

యావత్ ప్రకృతిలో అణువణువునా భగవంతుని యొక్క దివ్య శక్తి వ్యాపించి వుంది. “ఇందుగలడందు లేడను సందేహంబు వలదుచక్రి సర్వోపగతుండు ఎందెందు వెదికిన అందందే కలడు” భక్తుడైన ప్రహ్లాదుని కోరికపై నృసింహ మూర్తిగా ఆ పరమాత్ముడు స్తంభము నుండి దర్శనమిచ్చాడు. ‘చెట్టు, పుట్ట, రాతి, నదులు మొదలగు సమస్త చరాచరములయందు వ్యాపించి ఉన్నానని గీత 10వ అధ్యాయనంలో శ్రీ కృష్ణ భగవానుడు వివరించి చెప్పాడు. అశ్వత్థః సర్వవృక్షాణం ‘వృక్షములన్నింటిలో కంటే రావి చెట్టుయందు తాను ఎక్కువ శక్తితో వున్నానని భగవానుడు చెప్పాడు. అలాంటి రావిచెట్టు మహిమ దాని గొప్పదనం గురించి తెలుసుకుందాం.

Vishnu Murthyమూలమునందు, శాఖలయందు, స్కంధమునందు,ఫలములందు సర్వత్రా అచ్యుతుడు సమస్త దేవతలతో కలిసి వున్నాడని స్కందపురాణం చెబుతోంది. రావి చెట్టును విష్ణు రూపం గా చెబుతారు కనుకనే రావి చెట్టు విష్ణువుగా, వేప చెట్టు మహాలక్ష్మిగా భావించి ఒకే పాదులో వేప చెట్టును, రావి చెట్టును పెంచి పెండ్లి చేస్తారు.ఇలా చేసి సాక్షాత్ లక్ష్మీనారాయణులకు కళ్యాణం చేసినట్టుగా భావిస్తారు.

RavichettuRavichettuరావి చెట్టు ఇంతటి మహిమతో కూడుకొని వుంది కనుకనే దీని పుల్లలను పవిత్రమైన యజ్ఞ యాగాదులకు మాత్రమే ఉపయోగిస్తారు. ఇతర విధాలుగా ఉపయోగించరు. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఈ మంత్రమును పఠిస్తే శరీర ఆరోగ్యన్ని కూడా పొందగలరు.

మూలలో బ్రహ్మ రూపాయా
మధ్యలో విష్ణు రూపిణే
అగ్రత శ్శివరూపిణే
వృక్షరాజాయతే నమః

Ravichettuమూలా మునందు బ్రహ్మ దేవుడుని, మధ్యభాగమున విష్ణువుని,చివర భాగమున శివుడిని కలిగియున్నఓ అశ్వత్థః వృక్షరాజమా ! నీకు నమస్కరమని ఈ మంత్రము యొక్క అర్ధం. అందుకనే దేవాలయాలలో రవి చెట్టుకి పూజలు చేస్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR