శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులు గురించి ఆసక్తికర విషయాలు

ఆది శంకరాచార్యులు అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త , వేదాంతవేత్త.హిందూ మత పరిరక్షణ కోసం అవతరించిన సరళ సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు, మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. సదాశివుడే ఆదిశంకరుల రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. శృంగేరి శంకరమఠం ప్రకారం శంకరులు క్రీ.శ. 788 లో జన్మించారు, కంచి మఠం ప్రకారం స్వామి రెండు వేల సంవత్సరాలకు పూర్వం, క్రీ.పూ. 509 సంవత్సరంలో జన్మించారని నమ్ముతారు. ఆయన బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది.

ఆది శంకరాచార్యులుసన్యాసం తీసుకునే సమయం ఆసన్నమవడంతో శంకరాచార్యులు తన తల్లి అనుమతి కోరాడు. కొడుకు సన్యాసం తీసుకుంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరాచార్యులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి వచ్చి పట్టుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా తన మనోభిష్టం నేరవేరకముందే జీవితం ముగుస్తుందని ఆవేదనలో ఆ చివరి క్షణంలోనైనా సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లితో ప్రాదేయపడ్డాడు. అప్పుడు ఆమె అంగీకరించింది.

ఆది శంకరాచార్యులుతక్షణమే సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరాచార్యులను వదిలేసింది. గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే ఆలోచనతో తన తల్లి అనుమతి కోరి తల్లికి ఈ విధంగా మాట ఇచ్చాడు “ప్రాత:కాలం, రాత్రి, సంధ్యా సమయాల్లో ఏ సమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడు నన్ను తలచుకోగానే నీవద్దకు వస్తాను” అని శంకరాచార్యులు తల్లికి చెప్పాడు.

ఆది శంకరాచార్యులుతల్లి అంగీకారం తీసుకుని శంకరాచార్యులు తన ఊరు కాలడిని విడిచి గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది దగ్గరికి వెళ్ళాడు. నర్మదా నది ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం కలిగింది. వ్యాస మహర్షి కుమారుడైన శుకుని శిష్యులు గౌడపాదులు. ఆయన నివసించే గుహను చూసిన వెంటనే శంకరాచార్యులు అడవుల నుండి నడచి వచ్చిన అలసట అంతా ఒక్కసారిగా తీరిపోయింది. గౌడపాదుల శిష్యులైన గోవింద భగవత్పాదులకు నమస్కారం అని స్తోత్రం చేయగా గోవింద భగవత్పాదులు ‘ఎవరు నువ్వు?’ అని అడిగారు. శంకరాచార్యులు దశశ్లోకి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు.

ఆది శంకరాచార్యులున భూమిర్నతోయం న తేజో నవాయుర్మఖంనేంద్రియం వాన తేషాం సమూహఃఅనైకాంతి కత్వా త్సుషుష్త్యైక సిద్ధిస్తదేకోవ శిష్ట శ్శివ: కేవలోహంనేను నింగిని కాదు, భూమిని కాదు, నీటిని కాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని. ఇంద్రియాలు కాని వేరే చిత్తం గాని లేనివాడిని. నేను శివుడిని. విభజనలేని జ్ఞాన సారాన్ని. అటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరాచార్యులను చూసిన గోవింద భగవత్పాపాదులు జ్ఞాన సమాధి నుండి ఈ విధంగా అన్నారు.”స ప్రాహ శంకర స శంకర ఏవ సాక్షాత్” (సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన పరమశివుడే ఈ శంకరాచార్యులు)శంకరాచార్యులు మొట్ట మొదటిగా గోవింద పాదాలకు పాదపూజ చేసాడు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికీ వస్తుంది. గురుసేవ తోనే జ్ఞానార్జన జరుగుతుందని, సర్వ ప్రపంచానికి తెలిసేలా చేసాడు. గోవిందపాదులు శంకరాచార్యులకు బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహావాక్యాలుగా బోధించాడు.

ఆది శంకరాచార్యులుకామి కానీ వాడు మోక్షగామి కాలేడని తెలుసుకొని శంకరులు వందమంది భార్యలు గల అమరకుడు అనే రాజు చనిపోవడం గమనించి శిష్యులతో తన శరీరాన్ని కాపాడమని చెప్పి రాజు శరీరంలో ప్రవేశించి అమరకునిగా నూర్గురు భార్యలతోనూ అనంగతంత్ర పాండిత్యంలో కల శ్రద్ధ, ప్రీతి, రతి, ధృతి, కీర్తి, మనోభవ, విమల, మోదిని, ఘోర, మధనోత్పాదిక, మద, దీసిని, వశకరి, రంజని, మోహిని అనే పదిహేను కళలు నేర్చుకున్నాడు. చివరికి మండనమిశ్రుడు తన ఓటమిని అంగీకరించాడు. అప్పుడు అతనికి శంకరులు సన్యాసాన్ని ఇచ్చి, తన శిష్యునిగా స్వీకరించి, సురేశ్వరాచార్యుడుగా ప్రసిద్ధుడవుకమ్మని ఆశీర్వదించారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,730,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR