నాయ‌క‌త్వ‌ లక్షణాలు ఎక్కువుగా ఉండే నాలుగు రాశుల ఏంటో తెలుసా ?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాసుల్లో.. జన్మ నక్షత్రం, సమయాన్ని బట్టి ప్రతి మనిషికి ఒక రాశి చెప్పబడుతుంది.. ఇలా వారి వారి రాశిని బట్టి వారివ్యక్తిత్వం ఏంటో కూడా తెలుసుకోవచ్చు. కొందరేమో సహజ కళాకారులు, కొందరు ప్రేమికులు, కొందరు ధైర్యవంతులు, మరికొందరు విద్యావంతులు.. ఇలా కొన్ని రాశుల వారు కొన్ని రంగాలలో, విషయాలలో అగ్రస్థానంలో ఉంటారు.. అయితే కొందరేమో పుట్టినప్పటినుండి నాయకత్వ లక్షణాలతో ఉంటారు. మరి ఇలా నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న వారు ఏ రాశివారో ఇపుడు తెల్సుకుందాం..

Rasi Phalaluమేష రాశి వారిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయట..రాశులవారీగా తీసుకుంటే ప్రథమ రాశి మేషం. ఈ రాశిని అగ్నితత్త్వంతో పోలుస్తారు. భగభగమండే తత్త్వంతో ఉండి, కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. తోచిన విధంగా ప్రవర్తించడం వంటి లక్షణాలతో ఉంటారు. ఈ రాశికి కుజుడు అధిపతి. చర రాశి అయినందున స్థిరమైన ఆలోచన ఉండదు. చకచకా ఆలోచనలు, నిర్ణయాలు మారిపోతుంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అగ్నితత్త్వం అయినందున ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశివారిలో అత్యంత సహజం. నాయకత్వం వహించాలనే తపన, తొందరపాటుతనం కనిపిస్తాయి.

Mesha Rasiఇక వృషభ రాశికి చెందిన వారు కూడా దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేవరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి, అందాన్నిఆరాధించే హృదయం కలిగి, సంగీతాన్ని ఆస్వాదిస్తారు. తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదేస్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు. ఈ రాశి వారికి సహనమనే గుణం అలంకారం అని చెప్పవచ్చు. ఈ గుణం వల్ల వీరు ఫలితాలకోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు.

Vrushabha rasiఅలాగే సింహరాశి వారికీ కూడా నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయట.. ఈ రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన వీరిని సుఖజీవితానికి దూరము చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్ఠకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్ధులుగా పేరు గడీస్తారు. వంశప్రతిష్ఠ, కులగౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇతర కుల, మత, వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారము రాదు. కఠిన మైన స్వభావము కలవారన్న ముద్ర పడుతుండి. సన్ని హితులు, సేవకా వర్గము వీరి చేత కొంత ఆలస్యముగా అయినా పని చేయించుకోగలుగుతారు. వీరిని భయ పెట్తి లొంగదీసు కోవడము దాదాపు అసాధ్యము.

Simha Rasiఇక రాశి చక్రంలో పదవ స్థానంలో ఉన్న మకర రాశి వారికీ కూడా నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయట.. మకర రాశి కక్ష్యలో 270 డిగ్రీల నుండి 300 డిగ్రీల వరకు వ్యాపించి ఉంటుంది. ఈ రాశిని సరి రాశిగాను, శుభ రాశి గాను, స్త్రీ రాశిగాను, చర రాశిగానూ వ్యవహరిస్తారు. ఈ రాశి పాలకులను, పాలనాధికారులను, హస్వ స్వరూపులను సూచిస్తుంది.

Makara Rasi

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,470,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR