యజ్ఞాలు చేయటం వల్ల కలిగే ఫలితాలేంటొ తెలుసా

యజ్ఞం లేదా యాగం.. ఇది హిందువులు ఆచరించే ఒక విశిష్టమైన సంప్రదాయం. దేవాలయాల్లోనూ, కొత్త ఇళ్ళలోనూ , ఇంకా కొన్ని ప్రత్యేక పూజల్లోనో.. కొన్ని ప్రత్యేకసందర్భలోను యజ్ఞాలు చేస్తుంటారు అని మనందరికీ తెల్సు.. అయితే ఈ యజ్ఞాలు ఎందుకు చేస్తారు, ఇలా యజ్ఞాలు చేయటం వల్ల కలిగే ఫలితాలేంటొ ఇపుడు మనం తెలుసుకుందాం.

Yagnamవేదకాలం నాటి నుండి ఉన్న మన ఆచార వ్యవహారాలెన్నో.. అలాంటి వాటిలో యజ్ఞయాగాదులను ముఖ్యమని చెప్ప వచ్చు. వీటిలో కొన్ని రూపురేఖలు, స్వరూప స్వభావాలు మార్చుకున్నాయి. ప్రస్తుత రోజుల్లో అధికారం కోసమో, ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసమో యజ్ఞాలను చేయడం మనం చూస్తున్నాం..

యజ్ఞం అను శబ్దం ‘యజ దేవపూజయాం’ అనే ధాతువు నుండి ఏర్పడింది. దైవపూజే యజ్ఞం. ’’యజయే ఇతి యజ్ఞ: యజ:’’ ఎన్నో యజ్ఞ యాగదులచేత యోగ దాయకుడైన పరమేశ్శరుని యోగీశ్యరత్వానికి ’య’ కారం ప్రతీకగా చెప్పబడింది. యజ్ఞం వలన స్వార్దం నశింస్తుందని గాఢ విశ్వాసం. భారతదేశంలో పురాణకాలం నుండి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించటమే ఈ యజ్ఞం ముఖ్య లక్ష్యం. సాధారణంగా యజ్ఞం అనేది అగ్నిహోమం వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉంటాయి… అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో వేసినవన్ని దేవతలకు చేరుతాయని విశ్వాసం ఉంది. యజ్ఞంలో ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని హోమాగ్నులు ఉంటాయి. ఆ అగ్నిలో నెయ్యి, పాలు, ధాన్యం వంటి వాటిని వేస్తుంటారు. యజ్ఞాలు కొద్ది నిముషాలనుండి అనేక సంవత్సరాలవరకూ జరుగవచ్చు. ‘

Yagnamఈ యజ్ఞాలలో మూడు రకాలున్నాయి. అవి

1. పాక యజ్ఞాలు

2. హవిర్యాగాలు

3. సోమ సంస్థలు

Yagnamవేదంలో యజ్ఞో వై విష్ణుః అని చెప్పబడింది. అంటే యజ్ఞము విష్ణు స్వరూపం అని అర్ధం. చాలామంది హోమం, అగ్నిహోత్రాల్లో ఆజ్యం పోయడం దండగని, మిగతా వస్తువులన్నీ వేయడం వృధా అని, చాదస్తం అని కొట్టి పడేస్తారు.., దీనివల్ల ఒరిగేదేమీ లేదని , దీంతో ఎంతో డబ్బు నష్టమని కూడా కొందరు వాదిస్తూ ఉంటారు. అయితే ప్రకృతిలో ఉన్నవన్నీ మన స్వార్థం కోసమే కాదు.. కొన్నిటిని తిరిగి ప్రకృతికే ఇవ్వాలి. యజ్ఞంలో జరిగేది కూడా అదే.. అలా చేయడం వల్ల ఆయా వస్తువులు, పదార్ధాలను వృధా చేసారు అనటం పొరపాటు. యజ్ఞం లో వాడే పదార్ధాలకు ఖచ్చితంగా సార్ధకం లభిస్తుంది.. ఎందుకంటే ఇలా అగ్నిదేవునికి ఆహుతి చేయడంవల్ల రెట్టింపు ఫలితం ఉంటుంది అనేది మనకు అనాదిగా వస్తున్నా నమ్మకం.

Yagnamయజ్ఞాలు చెయ్యడం వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి యజ్ఞం చేసేటపుడు అగ్నిహోమాలు చేసి అందులో నెయ్యి, పాలు, ధాన్యం, ఆవు పేడ పిడకలు, జిల్లేడు, మోదుగ, దర్భ, గరిక మొదలగు ఆయుర్వేద వృక్షాల కట్టెలు వంటి వాటిని వేస్తుంటారు. ఆజ్యాన్ని పోయడంవల్ల పొగ వస్తుంది. అది మనలో అనారోగ్యం తలెత్తకుండా చేస్తుంది. అనేక కారణాలవల్ల ఏర్పడే కాలుష్యాన్ని నివారిస్తుంది. అతివృష్టి, అనావృష్టి లాంటి అపసవ్యతలు లేకుండా చేసి వాతావరణ సమతుల్యతకు దారితీస్తుంది. నేతిని అగ్నిలో వెయ్యడం వచ్చే ధూమం వలన వాతావరణంలో ఉన్న కాలుష్యం నివారించబడుతుంది. అణుశక్తి కారణంగా జనించే అనేక బాధలు తగ్గుతాయి.. స్వచ్చమైన గాలి అందుతుంది. మనకు హాని చేసేటువంటి చాలా రకాల సూక్ష్మక్రిములు నశిస్తాయి. అంతే కాక ఈ అగ్ని హోమాల్లోని భస్మంతో ఔషధాలు తయారుచేయొచ్చు. యాగాలు చేసిన తర్వాత వచ్చే భస్మాన్ని పంట భూముల్లో చల్లితే ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ పొగని మనం పీల్చడం వల్ల శరీరం లోపలి అనారోగ్యాలు కూడా నయమౌతాయి. వర్షాభావం, మితిమీరిన ఎండలు లాంటి వాతావరణ అసమతుల్యత లేకుండా పొలాలు సస్యశ్యామలంగా ఉండి, దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే యజ్ఞం జరిగే ప్రదేశం ఉండాలని, యజ్ఞం జరుగుతుంటే వెళ్లి చూడాలని.. అలాగే యజ్ఞం జరిగాక మిగిలిన భస్మాన్ని తీసుకోవాలని చెప్తారు పండితులు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR