ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? ఎలా పాటించాలి?

“లంకణం పరమౌషధం” అన్నారు మన పెద్దలు. అంటే ఉపవాసం కన్నా మంచి ఔషధం లేదు అని దాని అర్థం. వయసుతోపాటు వచ్చే దుష్ప్రభావాలకు దూరంగా ఉండాలంటే తప్పకుండా ఉపవాసం చేయాల్సిందే అని మన పూర్వీకులు చెప్పారు. మరి ఉపవాసం అంటే దాదాపు మనందరికీ పరిచయమే. మనలో చాలామంది చేస్తూనే ఉంటాము.

intermittent fastingప్రతీ మతంలో వేరు వేరు పేర్లతో వేరు వేరు సమయాలు కేటాయించి ఉపవాసం చేస్తారు. చాలా వరకు ఉపవాసం మత పరంగా ఉండటం చూస్తుంటాం. హిందువులు ఉపవాసం అని ముస్లిమ్స్ రోజా అని ఇలా ప్రతి ఒక్క మతంలో ఉపవాసాన్ని శ్రద్ధ తో పాటించటం జరుగుతుంది. కానీ ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ అనేది ఎప్పుడైనా విన్నారా? ఇది కొత్తదేమీ కాదు. మన పూర్వపు రోజుల నుండి అవలంబిస్తున్నదే.

protein vegetablesఎప్పుడో మరుగున పడిన ఈ పద్ధతి డైట్ ప్రాచుర్యం లోకి వచ్చినప్పుటి నుండి బాగా ప్రాచుర్యం పొందింది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే అదేదో డైట్ అనుకునేరు. ఇది డైట్ కానే కాదు. అది ఒక మంచి ఆహారపు అలవాటు. ఎటువంటి డైట్ అయినా ప్రత్యేకించి ఒక మనిషికి చెప్పబడుతుంది. అంటే బరువు పెరగడానికో లేదా తగ్గడానికో, కంటి చూపు మెరుగవడానికి లేదా కిడ్నీ సమస్యల నుండి త్వరగా బయట పడడానికో ఇలా దేనికి సంబంధించి దానికి కొన్ని ప్రత్యేక ఆహార నియమాలను పాటిస్తే ఆ సమస్య నుండి త్వరగా బయట పడతారు.

intermittent fasting carbohydrates and protiensకాబట్టి డైట్ అనేది ఆహారపు అలవాటు కాదు అది ఒక ఆహార నియమం. అది కొద్ది రోజులు పాటిస్తే సరిపోతుంది. కానీ ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది మీరు జీవితాంతం పాటించినా ఏమి కాదు. ఎందుకంటే ఇది ఒక మంచి ఆహారపు అలవాటు లేదా ఆహార శైలి.

intermittent fastingఒక రోజులో కొన్ని గంటలు ఏమి తినకుండా ఉండటాన్ని ఉపవాసం లేదా ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ అంటారు. ఈ ఉపవాసం వల్ల మనకు శారీరకంగా మరియు మానసికంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ ని చాలా రకాల పద్ధతులతో అమలు చేస్తారు కానీ ఫేమస్ గా ఉపయోగించే పద్దతి 16:8. అంటే, మనకు ఒక్క రోజులో 24 గంటలు ఉంటాయి కదా… ఈ 24 గంటలలో పదహారు (16) గంటలు ఏమి తినకుండా ఉండాలి ఇక మిగతా 8 గంటలలో తినడానికి సమయం కేటాయించాలి. ఈ 16:8 పద్ధతి ని 5:2 రోజులలో పాటించాలి. మనకు ఒక వారం లో మొత్తం ఏడు రోజులు ఐతే 2 రోజులు ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ చెయ్యాలి ఇక మిగతా 5 రోజులు మాములుగా ఎలా తింటామో అలాగే తినాలి.

intermittent fasting 5:2 ruleఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే ప్రోటీన్స్ తో కూడిన ఆహార పదార్థలను ఎక్కువగా తినాలి. నూనె పధార్థలు, పిండి పదార్థలు, చక్కర పదార్థలు చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఫాస్టింగ్ సమయం తర్వాత తీసుకునే భోజనం భారీ గా ఉండ కూడదు.

intermittent fastingఇంటర్మీ టెంట్ ఫాస్టింగ్ చేయడం ద్వారా మన జీవిత కాలాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ చేసినప్పుడు శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి మరియు కణాలపై చాలా ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా దాంతోపాటు హార్మోన్ల లో మార్పు జరుగుతుంది. ఇలా జరగడం వల్ల మనకు చాలా ప్రయోజనం కలుగుతుంది . ఎప్పుడైతే ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ చేస్తామో సెల్యులర్ రిపేర్ ప్రాసెస్ జరుగుతుంది. దాంతో కణాలు పనితీరు మెరుగుపడతాయి. కానీ తక్కువ సమయానికే తిరిగి ఆహారాన్ని తీసుకునేవారు, ఈ ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ ను పాటించడం కష్టమే అని చెప్పాలి. ఇలాంటి వారికి శరీరంలో మెటబాలిక్ చేంజెస్ జరగడం వల్ల ఇది వారికి పని చేయదు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR