గ్రామదేవతగా వెలసి భక్తులని చల్లగా చూసే అద్దంకి నాంచారమ్మ

0
2706

మన దేశంలో అమ్మవారి ప్రసిద్ధ ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా అమ్మవారు ప్రతి గ్రామంలో గ్రామదేవత గా ఉంటూ భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. అయితే అద్దంకి నాంచారమ్మ ఆలయం ఎలా వెలిసింది? ఆ ఆలయ మహత్యం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Addanki Nancharamma

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా, అవనిగడ్డకు కొన్ని కిలోమీటర్ల దూరంలో కృష్ణానది తీరంలో అద్దంకి నాంచారమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయానికి దాదాపుగా 300 సంవత్సరాల కి పైగా చరిత్ర ఉంది. అద్దంకి నుండి వచ్చిన దేవత కావున ఆ అమ్మవారిని అద్దంకి నాంచారమ్మ తల్లిగా భక్తులు పిలుచుకుంటారు.

Addanki Nancharamma

ఇక పూర్వం కొండవీటి రామన్న అనే రైతు ఉండేవాడు. ఒకసారి అయన నివసిస్తున్న ప్రాంతంలో తీవ్ర కరువు ఏర్పడటంతో ఆ గ్రామం నుండి అద్దంకికి తరలిపోయాడు. అయితే అద్దంకిలో ఒక యోగి శాపం కారణంగా నాంచారమ్మ తల్లి మానవ రూపంలో అద్దంకిలో సంచరిస్తూ ఉంది. అప్పుడు కొండవీటి రామన్న కి కనిపించిన నాంచారమ్మ తన నిజరూప దర్శనం ఇచ్చి నన్ను భక్తితో రోజు పూజించి నీకు కరువు బాధలు తొలగిపోయి నీవు మళ్ళీ ని గ్రామానికి వెళ్ళిపోతావని చెప్పడంతో, అతడు భక్తి శ్రద్దలతో ఆ తల్లిని ప్రార్ధించడం మొదలుపెట్టాడు. ఇలా కొంతకాలానికి తను కరువు నుండి బయటపడటంతో ఆ తల్లికి ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాంతంలో ఒక చిన్న గుడిని నిర్మించాడు.

Addanki Nancharamma

ఈవిధంగా వెలసిన ఆ తల్లిని అప్పటినుండి భక్తితో కొలిచినవారికి కోరిన కోరికలు నెరవేరడంతో ఆ తల్లి మహిమ అందరికి తెలిసింది. ఇక ఫాల్గుణ మాసం శుద్ధ విదియ నుంచి పౌర్ణమి వరకు 14 రోజుల పాటు అద్దంకి నాచరమ్మ అమ్మవారికి జాతర నిర్వహిస్తారు. అంతేకాకుండా కృష్ణా పుష్కరాల సమయంలో భక్తులు కృష్ణానదిలో స్నానం ఆచరించి నాంచారమ్మ వారిని దర్శించుకుంటారు. ఇలా జాతర సమయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షల మంది భక్తులు తరలి వస్తుంటారు.