దుర్గాదేవి అష్టభుజాలతో దర్శమిచే అరుదైన ఆలయం గురించి తెలుసా?

దుర్గాదేవి అష్టభుజాలతో దర్శనమిచ్చే అరుదైన ఆలయంగా ఈ ఆలయాన్ని చెప్పవచ్చును. ఇలా వెలసిన ఈ అమ్మవారిని దర్శించి కోర్కెలు కోరుకుంటే తప్పక నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మరి అష్టభుజాలతో దుర్గాదేవి వెలసిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

astabhujaతెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, మల్కాజ్ గిరిలో అష్టభుజ దుర్గాదేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలో దుర్గాదేవి అష్టభుజాలతో వివిధ ఆయుధాలను ధరించి కొలువై ఉంది. ఈ దేవిని ఎంతో మహిమగల దేవిగా భక్తులు కొలుస్తారు. ఇంకా ఈ ఆలయంలోనే కొలువై ఉన్న భోళాశంకరుడు ఎంతో మహిమగల మూర్తి. ఈ స్వామిని దర్శించి పూజించిన భక్తుల కోర్కెలు నెరవేరుతాయాని వారి నమ్మకం.

astabhujaప్రతిరోజు ఈ స్వామివారికి శాంతి కళ్యాణం, అష్టోత్తర నామార్చన, సహస్ర నామార్చన, రుద్రాభిషేకం జరుగుతాయి. ఇక ఈ అష్టభుజ దుర్గాదేవి ఆలయంలో ప్రతినిత్యం పూజలతో పాటు, సామూహిక దీపపుజా, లలిత సహస్ర నామపారాయణం జరుగుతాయి.

astabhujaఅయితే భక్తులు 36 రోజులు దుర్గా నామాన్ని, అష్టోత్తర శతసహస్ర సంఖ్య జరిపించడం వల్ల ధనాన్ని, జ్ఙానాన్ని, ఆరోగ్యాన్ని పొందుతారని చెబుతారు. ఎంతో శాంతి మూర్తిగా దర్శనమిచ్చే ఈ అమ్మను దర్శించడానికి అనేక ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడకు అత్యంత భక్తి ప్రపత్తులతో వస్తారు.

astabhujaఈ ఆలయంలో నిత్యం జరిగే ధూపదీప నైవేద్యాలతో పాటు ఈ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాలు, కార్తీక, శ్రావణ మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా భక్తి శ్రద్దలతో జరుపుతారు.

astabhuja

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR