ఆంజనేయుడి కారణంగా మడుగు పక్కన వెలసిన అద్భుత ఆలయం

0
2150

మనలో ఎక్కువమంది భక్తులకి ఇష్ట ఆరాధ్య దైవం హనుమంతుడు. హనుమంతుడి గుడి లేని గ్రామం అంటూ ఉండదు. అయితే ఈ ఆలయంలో విశేషం ఏంటంటే హనుమంతుడి కారణంగా మడుగులో వేసిన పర్వతం కారణంగా ఇక్కడ ఆలయం వెలిసిందని స్తల పురాణం. మరి ఈ ఆలయ స్థల పురాణం ఏంటి? ఈ ఆలయంలోని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Anjaneyudi Karnaga Madugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వై.ఎస్.ఆర్. కడపజిల్లా, పుష్పగిరి గ్రామం, పుష్పగిరి పీఠమందు పినాకిని తీరంలో వెలసిన ప్రాచీనాలయం శ్రీ చెన్నకేశవాలయం. ఆదిశంకరాచార్యలే ఇచట శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారని ప్రతీతి. ఈ ప్రాంతం పంచ నదుల సంగమ స్థానం అని చెబుతారు. ఈ ఆలయంలోని శిల్పకళా నైపుణ్యం చాలా అధ్భూతంగా ఉంటుంది. ఇక్కడ పశ్చిమ ముఖంగా ఉన్న ఆలయంలో చెన్నకేశవుడు, శివుడు, ఆంజనేయుడు మనకు దర్శమిస్తారు.

Anjaneyudi Karnaga Madugu

ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, ఒకప్పుడు ఇక్కడ ఒక మడుగు ఉండేదట. అయితే ఆంజనేయుడు ఒక పర్వతాన్ని తెచ్చి అందులో వేయగా, ఆ పర్వత తాకిడికి నీరు కదిలిందట. అప్పుడు నీటితో పాటు ఆ పర్వతం కూడా నీటిలో కదులుతూనే ఉందట. ఇలా ఎంతకాలం గడిచిన నీరు, పర్వతం అలా కదులుతూనే ఉండటంతో, ఆంజనేయుడు పర్వతం కదలకుండా చేయమని త్రిమూర్తులను ప్రార్ధించాడు. అప్పుడు త్రిమూర్తులు తమ పాదాలను పర్వతం మీద ఉంచి కదలకుండా చేసారు.

Anjaneyudi Karnaga Madugu

ఆ తరువాత శ్రీ మహావిష్ణువు ఆంజనేయుడిని ఏదైనా వరం కోరుకో అని అనగా, నాకు తారకమంత్రం ఉపదేశించుము అని కోరుకున్నాడు. ఈ కోరికను లక్ష్మీదేవిని ఉపదేశించమని కోరుకో అని చెప్పడంతో కోపం వచ్చిన హనుమంతుడు తన వాలమును విరిచి శిలారూపమున అచటనే నిలిచిపోయాడు. అది చూచి పార్వతీదేవి, సరస్వతీదేవి ఇద్దరు లక్ష్మీదేవి వద్దకు వచ్చి ఆంజనేయుడిని శాంతపరచమని కోరగా వారి మాటలను విని లక్ష్మీదేవి శిలారూపమున ఉన్న ఆంజనేయునికి ఎదురుగా యోగాసనం మీద కూర్చుండి ఆంజనేయ శాంతించుము ఇచట నీవే ముఖ్యుడవు ని పూజయే ముందుగా జరుగుతుంది. ఆ తరువాతనే నా పూజ జరుగుతుంది అని అనగా ఆంజనేయుడు శాంతించాడని పురాణం.

Anjaneyudi Karnaga Madugu

ఆనాటి నుండి అందరికంటే ముందుగా ఆంజనేయునికి పూజ జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్న మడుగును అందరు ఒక సామాన్య మడుగుగా చేస్తుండేవారు. అయితే ఒకసారి ఒక రైతు ఒక ముసలి దున్నను తీసుకువచ్చి మడుగులో కడుగగా విచిత్రంగా ఆ ముసలి దున్న పడుచు దున్నగా మారిందట. అప్పటినుండి ఈ మడుగు మహత్యం అందరికి తెలిసింది.

ఇక అనారోగ్యం కలవారు అందులో స్నానం చేస్తే ఆరోగ్యవంతులు అవుతారని భక్తుల విశ్వాసం.