Home Health శరీరంలో ఐరన్ తగ్గడం వలనే బట్టతల వస్తుందా?

శరీరంలో ఐరన్ తగ్గడం వలనే బట్టతల వస్తుందా?

0

జుట్టు రాలడం అనేది వినడానికి చిన్న సమస్యలా కనిపించినా ఎంతో మానసిక వేదనకు గురిచేస్తుంది. ఇప్పుడు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బట్టతల సమస్యను ఎదుర్కొంటున్నారు. అంటే.. వాతావరణంలో ఏర్పడిన మార్పులతో పాటు.. తీసుకునే ఆహారంలో వచ్చిన మార్పుల కారణంగా వెంట్రుకలు రాలిపోతున్నాయి. జుట్టు రాలడం యువకుల్లో ఎక్కువగా కనిపించే లక్షణం, రోజుకు 40 నుండి 50 వెంట్రుకలు రాలుతాయి… కానీ , కొంత మందిలో వెంట్రుకలు రాలే ప్రక్రియ అధికంగా ఉంటుంది. ఫలితంగా చిన్నవయసులోనే బట్టతల వచ్చేస్తుంది. ముఖ్యంగా, ఇది పురుషులలో సహజమని చెప్పవచ్చు.

baldnessరకాల మందుల వాడకం వలన తాత్కాలికంగా వెంట్రుకలు రాలిపోతాయి. ఆర్థరైటిస్ (కీళ్ళ నొప్పులు), గుండె సమస్యలు, అధిక రక్త పీడనం వంటి వ్యాధులకు మందులు వాడే వారు మాత్రమె కాకుండా, ఎక్కువగా డిప్రెషన్’కు గురయ్యే వారు మరియు రక్తం పలుచగా ఉండే వారిలో జుట్టు త్వరగా రాలిపోతుంది. అంతేకాకుండా, అధిక మోతాదులో విటమిన్ ‘A’ సేకరణ వలన కూడా వెంట్రుకలు తెగిపోతుంటాయి.

సాధారణంగా, వెంట్రుకలు రాలిపోవడం ప్రారంభం కావడంతో చాలా మంది షాంపూలు, హెయిర్‌ మాస్కులు వాడటం చేస్తుంటారు. సీరమ్స్‌, ఇతర మందులు తీసుకుంటూ ఉంటారు. అయితే వీటితోపాటు చేయాల్సిన ముఖ్యమైన పని ఇంకోటుంది. అదే ఆహారంలో ఐరన్‌ తీసుకోవడం. రోజూ తగినంత ఐరన్‌ అందకుంటే జుట్టు రాలిపోతుందని వైద్యులు చెబుతున్నారు. జన్యుపరమైన అంశాలు, చర్మ సమస్యలు, మానసిక ఇబ్బందులు, కాలుష్యంతోపాటు ఐరన్‌ లోపం కూడా వెంట్రుకలు రాలేందుకు ప్రధాన కారణమవుతోందని తాజా అధ్యయనంలో తేలింది.

అందుకే ఆహారంలో రోజూ తప్పని సరిగా ఐరన్‌ శాతం ఎక్కువ ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. సాధారణంగా మాంసాహారంలో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. శాకాహారంలో తక్కువగా ఉంటుంది. కాబట్టి శాకాహారులు ఐరన్‌ అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. స్త్రీలు ఐరన్ లోపం ఎక్కువగా ఎదురు కుంటూ ఉంటారు. ఐరన్ శరీర భాగాలన్నిటికి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. అలసటను అలసటను తగ్గిస్తుంది. ఐరన్ లోపం వలన బలహీనత, మైకం,శ్వాస సమస్యలు, తలనొప్పి, ఆకలి లేకపోవడం వంటి ఎన్నో సమస్యలకు కారణమవుతోంది. కాబట్టి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఐరన్ సమృద్ధిగా లభించే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు .

మహిళలు రోజూ 18 మిల్లీ గ్రాములు, పురుషులు 8 మిల్లీ గ్రాముల ఐరన్‌ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చిక్కుళ్లు, పొద్దు తిరుగుడు గింజలు, పాలు, పాల పదార్థాలు, డ్రై ఫ్రూట్స్‌లలో ఐరన్‌ అధికంగా ఉంటుందని, వీటిని తీసుకోవడం ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. పోషక పదార్థాలు సమృద్ధిగా ఉండే ఆకు కూరలు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు తరిమికొట్టొచ్చు. అయితే ఆకు కూరల్లో ఐరన్ కూడా ఉంటుంది అని గ్రహించండి.

పాలకూర మొదలైన ఆకు కూరల్లో ఫోలేట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎనిమియా సమస్య రాకుండా చూసుకుంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆకు కూరలను కూడా మీ డైట్ లో చేర్చండి. ఆకుకూరలతో పాటు ఐరన్ లోపం ఉన్నవారు విటమిన్ సి కూడా తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇలా విటమిన్-సి ని తీసుకోవడం వల్ల ఐరన్ లోపం కలగదు అని చెబుతున్నారు. కాబట్టి విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను కూడా మీరు డైట్‌లో తీసుకోండి.

ఈ పొడి పండ్ల కలయికలో ఐరన్, మెగ్నీషియం, రాగి, విటమిన్–ఎ, విటమిన్–సి వంటివి పుష్కలంగా లభిస్తాయి. రోజూ 2 నుంచి 3 ఖర్జూరాలు, ఒక టేబుల్ స్పూన్ ఎండుద్రాక్షలను ఉదయాన్నే అల్పాహారంగా లేదా సాయంత్రం పూట స్నాక్స్ లాగా తిన్నారంటే తక్షణ శక్తిని పొందడమేకాక, శరీరంలో ఐరన్ స్థాయిలను కూడా పెంచుకోవచ్చు.

Exit mobile version