ప్రపంచవ్యాప్తంగా టీ ప్రియులు ఉన్నారు. వీరంతా వివిధ రకాల టీలను ఇష్టపడతారు. టీలో కూడా రకరకాల వెరైటీలు ఉంటాయి. ఎవరైనా అల్లం టీ, ఇక పాలు, బ్లాక్ టీ, యాలకుల టీ తాగుతారు. కాని ఇప్పుడు ఓ వింత టీ వైరల్ అవుతోంది. దీని గురించి విన్నవాళ్లంతా అసలు ఇలాంటి టీ ఉంటుందా అని అంటున్నారు. ఈ టీని ఎప్పుడూ వినలేదు చూడలేదు తాగలేదు అంటున్నారు. మరి ఆ టీ ఏమిటి దాని స్పెషల్ ఏమిటి చూద్దాం.
ఆగ్రాలోని బాబా స్టాల్లో ఓ వ్యక్తి టీ తయారు చేశాడు. అక్కడ టీ మరుగుతోంది అందులో ఆ వ్యక్తి బటర్ వేశాడు. ఇదేమిటి బటర్ వేయడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా… అవును నిజమే… ఆ వ్యక్తి టీలో బటర్ వేసి అందరిని ఆలోచింప చేశాడు.. టీ లో బటర్ అంతా కరిగిపోయిన తర్వాత ఆ టీపొడి వడగట్టి బయటపడేశాడు.
ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. వీడియో చూసిన చాలా మంది ఇదేమిటి అని ఆశర్యపోతున్నారు. కొంతమంది నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. అసలు టీలో వెన్నె వేయడం ఏంటని కొందరు చిరాకు పడ్డారు. వీడియో పోస్ట్ చేసిన కాసేపటికే వైరల్గా మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే వైద్యులు చెబుతున్నది ఒకటే.. ఇది అందరికి సెట్ కాదు.. కొందరికి దీని వల్ల వికారం వాంతులు వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు.
View this post on Instagram