వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేస్తే మంచిదో తెలుసా ?

0
1094

వాస్తవానికి తలస్నానం అనేది అందరికి రోజు చేసే వీలు,వసతి కలుగదు. వీలైన వారు వారంలో అన్ని రోజులు తలస్నానం చేస్తారు. మిగతా వాళ్లు వారంలో ఒకటి లేదా రెండు సార్లు చేస్తారు. అయితే అసలు వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేస్తే మంచిది అనే విషయం చాలా మందికి తెలియదు. మన శరీరంపై ఉన్న దుమ్ముదూళి స్నానం చేస్తే పోతుంది. అలాగే తలపై కూడా దుమ్ముదూళి చెమట ఉంటుంది, అది తలస్నానం చేస్తేనే పోతుంది. అందువల్ల మీకు కుదిరితే రోజు తలస్నానం చేయవచ్చు. లేదంటే రెండు రోజులకి ఓసారి కచ్చితంగా తల స్నానం చేయండి.

Head Bathingఅయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటుంది. రెగ్యులర్‌గా తలస్నానం చేస్తే తలలో ఉత్పత్తి అయ్యే నేచురల్ ఆయిల్ కోల్పోతే, తిరిగి పొందడం కష్టం అవుతుంది. ప్రతి రోజూ తలస్నానం చేయడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయలేం. కాబట్టి రోజు మార్చి రోజు హెయిర్ బాత్ చేయవచ్చు.

Head Bathingఇంట్లో ఉన్నా కూడా బ్యాక్టీరియా ఎటాక్ ఉంటుంది, అందుకే తలపై చుండ్రు చెమట పోవాలి అంటే ఇలా రోజు తలస్నానం మంచిది. కానీ షాంపులు కాకుండా కుంకుడు కాయలు లేదా సాధారణంగా తలపై నీరు పోసుకోండి. దాని వల్ల తలలో ఉండే నేచురల్ ఆయిల్స్ పోకుండా ఉంటాయి.

Head Bathingచలికాలంలో తల స్నానానికి గోరు వెచ్చని నీరు వాడడం మంచిది. మరీ వేడి నీటి స్నానం వల్ల స్కిన్ డ్రై గా అయిపోతుంది. అయినా తలపై చెమట చుండ్రు తగ్గకపోతే నేరుగా వైద్యుడ్ని సంప్రదించాలి.

SHARE