తరుచూ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నారా? అయితే ఇవి తప్పక తెలుసుకోండి!

ఇటీవల యువత ఎక్కువగా తింటున్నవాటిలో ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టే యూత్ దీనికి అట్ట్రాక్ట్ అవుతున్నారు. ఇవి ఎంత రుచిగా ఉంటాయంటే… ఒకటి, రెండు తిని ఆపలేం. అయితే వీటిని అధికంగా తింటే ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడమే కాదు మృత్యువును కోరి తెచ్చుకోవడమే అవుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఫ్రెంచ్ ఫ్రైస్వారానికి రెండుసార్లు కంటే ఎక్కువ సార్లు ఈ చిప్స్, ఫ్రెంచి ఫ్రైల వంటివి తినే వారిలో చనిపోయే ప్రమాదం డబుల్ ఉంటోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆ దుంపలను వేపేందుకు వాడే నూనెల వల్లే ప్రాణాలకు ప్రమాదమని తేల్చి చెబుతున్నారు.

Is French fries a health hazardపిండి పదార్థాలు, ప్రోటీన్లలతో పోలిస్తే కొవ్వులు శరీరంలో నెమ్మదిగా జీర్ణం అవుతాయి. కొవ్వుతో ఉండే ఆలూ చిప్స్ త్వరగా జీర్ణం కావు. కాబట్టి అలా వేయించిన ఆహారాన్ని తింటే కడుపు నొప్పి వస్తుందట.

Is French fries a health hazardమన బాడీలో చాలా ముఖ్యమైనది గుండె. ఈ చిప్స్‌లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్… చెడు కొవ్వును పెంచుతుంది. తద్వారా గుండెకు రక్త సరఫరా సరిగా సాగదు. ఏదో ఒక రోజు గుండె నొప్పి వచ్చేస్తుంది.

Is French fries a health hazardమరో అధ్యయనం ప్రకారం రక్తంలో ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్ ఉన్నవారికి అల్జీమర్స్ లేదా మతిమరపు లాంటి వ్యాధులు వచ్చే అవకాశం 75 శాతం ఎక్కువ అని తేలింది.

ఈ ఫ్రైలు, చిప్సూ వంటివి తరచూ తింటే పెరిగిన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. బాడీలో కొవ్వు చెడు బ్యాక్టీరియాను పెంచుతుంది. అది మంచి బ్యాక్టీరియాని చంపేస్తుంది. ఫలితంగా మనకు రకరకాల రోగాలు రావడం మొదలవుతుంది.

Is French fries a health hazardవేయించిన ఆహారాన్ని తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. కొవ్వు బాడీలో పేరుకుపోతే బరువు పెరుగుతారు. ఓ స్థాయి దాటితే… ఏం చేసినా బరువు తగ్గడం కష్టమవుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,450,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR