డయాబెటిక్ పేషెంట్స్ కి తేనే మంచిదేనా? వారు తేనె తీసుకోవచ్చా?

డయాబెటిస్.. చిన్నా పెద్దా వయసు తేడా లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య. దీన్నే మధుమేహం, షుగర్, చక్కెర వ్యాధి అని పిలుస్తారు. డాక్టర్లు సూచించిన మందులతో పాటు సరైన ఆహార పద్దుతులను పాటిస్తే మధుమేహాన్ని నియంత్రించవచ్చు. రక్తంలోని చక్కర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు అధిక రక్త పీడనం వంటి సమస్యలను అదుపులో పెట్టుకోవచ్చు.

honey good for diabetic patientsదానికోసం డయాబెటిక్ పేషెంట్స్ వారి ఆహరం, జీవన శైలి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని పెంచే షుగరీ ఫుడ్స్, జంక్ ఫుడ్ కి డయాబెటిక్ పేషెంట్స్ దూరంగా ఉండాలని నిపుణులు చెబుతారు. అయితే, సేఫ్ క్యాటగిరీలో ఉన్న ఫుడ్స్ ఏమిటి అన్న దాని మీద చాలా గందరగోళం ఉంది. ఉదాహరణకి డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. అందులో న్యూట్రియెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ డయాబెటిక్ పేషెంట్స్ కి మాత్రం అవి పనికిరావు.

honey good for diabetic patientsఎందుకంటే, ఫ్రెష్ ఫ్రూట్స్ యొక్క కాన్సంట్రేటెడ్ రూపమే డ్రై ఫ్రూట్స్. అంటే, వాటిలో షుగర్ కంటెంట్ ఎక్కువుంటుంది. పైగా వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువ. ఇలాంటి కన్‌ఫ్యూజనే తేనె విషయం లో కూడా ఉంది. పంచదార బదులు తేనె వాడమని న్యూట్రిషనిస్టులు చెబుతూ ఉంటారు. కానీ, అది డయాబెటిక్ పేషెంట్స్ కి మంచిదేనా? వారు తేనె తీసుకోవచ్చా? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.

fruitsనిపుణుల అభిప్రాయం ప్రకారం పంచదార బదులు తేనె వాడడం వల్ల వచ్చే లాభం పెద్దగా ఏం లేదు. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని రెండూ ఎఫెక్ట్ చేస్తాయి. అయితే, పంచదార కంటే తేనె ఎక్కువ తియ్యగా ఉంటుంది కాబట్టి కొద్దిగా తేనె కలిపితే సరిపోతుంది కాబట్టి లోపలికి వెళ్ళే షుగర్ కంటెంట్ కొద్దిగా తగ్గుతుంది.

honey good for diabetic patientsఅలాగే, తేనె కి పంచదార అంత రిఫైండ్ ప్రాసెస్ ఉండదు కాబట్టి అది పంచదార కంటే కొంచెం మంచిదే. అయినా కూడా, డయాబెటిక్ పేషెంట్స్ కి మాత్రం ఇది రికమెండ్ చేయలేరు. తేనె కీ పంచదార కీ న్యూట్రిటివ్ ప్రొఫైల్ ఒక్కటే. అయితే, తేనెలో కొంచెం మినరల్స్ ఎక్కువ గా ఉంటాయి. కాబట్టి ఫిట్నెస్ మీద దృష్టి పెట్టేవాళ్ళకి బావుంటుంది కానీ, డయాబెటిక్స్ మాత్రం తేనె నుండి కూడా దూరంగా ఉండాల్సిందే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR