Home Health ప్రతి రోజు వేడి నీటి స్నానం చేయడం వల్ల గుండెకు ప్రమాదమా ?

ప్రతి రోజు వేడి నీటి స్నానం చేయడం వల్ల గుండెకు ప్రమాదమా ?

0

రోజంతా అలసిపోయి వచ్చి కాస్త గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే హాయిగా నిద్ర పడుతుంది అని చెబుతున్నాయి. చిన్నపిల్లలకి కూడా రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయిస్తే చక్కగా నిద్ర పోతారు. కానీ చాలామంది చన్నీళ్ళ స్నానం చేస్తేనే శరీరానికి మంచిదని చెబుతుంటారు. ప్రతి రోజు వేడి నీటి స్నానం చేయడం వల్ల గుండెకి సంబందించిన రోగాలు వచ్చే అవకాశం ఉందని, శరీరం కూడా ధృడంగా ఉండదని అంటుంటారు.

hot water bath dangerous to Heartకానీ కొన్ని అధ్యయనాలు గోరు వెచ్చని నీరు గుండె ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయని చెబుతున్నాయి. రెండుపూటలా గోరు వెచ్చటి నీరు శరీరం మీద పడితే శారీరక అలసటతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందట. కాబట్టి రోజూ చల్లటి నీటితో కాకుండా గోరు వెచ్చటి నీటిలో స్నానం చేయాలని చెబుతున్నారు నిపుణులు. పైగా దీనివల్ల గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుందట.

రాత్రి సమయంలో మన శరీర ఉష్ణోగ్రతలు సహజంగా పడిపోతాయి. ఇది మెలటోనిన్ లేదా స్లీపింగ్ హార్మోన్ ఉత్పత్తిని సూచిస్తుంది. గోరువెచ్చని నీటిలో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. తద్వారా మెలటోనిన్ ఉత్పత్తిని ప్రేరేపించి మంచి గాఢ నిద్ర కోసం శరీరాన్ని సిద్ధం చేస్తుంది.

గోరువెచ్చటి స్నానం గొంతు, కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఈ స్నానంలో ఎప్సమ్ లవణాలు కండరాల వ్యాధుల వల్ల కీళ్ళలో కలిగే మంటను తగ్గించడంలో సహాయపడతాయని నిరూపించబడింది. టైప్ 2 డయాబెటిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు ఇలాంటి గోరువెచ్చటి నీటిలో స్నానం మంచి ఫలితాలనిస్తుందని నిపుణులు చెపుతున్నారు.

ఇది రక్తపోటు తగ్గడం, గుండెపోటు లేదా స్ట్రోక్ వంటి మరింత తీవ్రమైన గుండె పరిస్థితులను నివారించడంలో సహాయపడుతుంది. అయితే స్నానం చేసేటపుడు నీటి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతను మించకూడదు. నీళ్లు ఎక్కువ వేడిగా ఉంటే కొన్ని రకాల ఇబ్బందులు తప్పవు. వేడినీళ్లతో స్నానం చేయడం వలన చర్మం కూడా సహజ కోమలత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

 

Exit mobile version