నాన్ వెజ్ తిని గుళ్ళోకి వెళ్ళకపోవడం సైన్స్ కి సంబంధించిన కారణం ఉందా ?

మనిషిలో కొన్ని చెడుగుణాలు మనసుని రెచ్చగొడుతుంటాయి. అవి మనం తీసుకునే ఆహర పదార్ధాలవల్ల కావచ్చూ. మనం ఉన్న ప్రదేశం తాలుకూ ప్రభావం కావచ్చూ. అందుకే పెద్దలుగాని గురువులు గాని మనలో చెడును ప్రేరేపించే వాటిని దూరం చేసుకోమన్నారు. ఇలా చెడుకు దూరంగా ఉండటం వల్ల ఆలోచనల్లో మార్పు వస్తుందనేది వారి భావన. అలా వచ్చిందే మాంసం తిని ఆలయానికి వెళ్ళకూడదు అనేమాట. ఇక ఎందుకు వెళ్లకూడదో తెలుసుకుందాం..

Templeమనం ఎప్పుడైనా మనశాంతి కోసం దేవాలయం వెళ్తూ ఉంటాము. చాలా మంది ఉదయానే స్నానం చేసి చాలా వరకు ఎలాంటి పదర్థాలు తినకుండానే దేవాలయాలకు వెలుతుంటారు. దానితో దేవాలయంలో మంచి ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా గుడికి వెళ్ళేటప్పుడు మాంసం, గుడ్డు లాంటివి అసలు తినరు. దీని వెనుక ఆధ్యాత్మిక కారణమే కాదు సైన్స్ కి సంబంధించిన కారణం కూడా ఉంది.

Non Vegగుడ్డు, మాంసం రజో గుణ, తమో గుణ సంబంధమైన పదార్థాలు. ఇవి మనిషి తినడం వలన తన ఆలోచన శక్తిని కోల్పోయి కామ వికార కోరికలు ఎక్కువగా కలుగుతాయట. మాంసాహారాన్ని స్వీకరిస్తే.. సత్వగుణం తగ్గిపోతుందని రజోగుణం ఆవహిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. దాని వలన మనిషి మంచి ఆలోచనల బదులు చెడు ఆలోచనలు రావడం జరుగుతుంది. గుడ్డు, మాంసం తిని గుడికి వెళ్లడం వలన మన మనసు ప్రశాంతగా ఉండక దేవుడి పై భక్తి అనేది మనస్ఫూర్తిగా ఉండదు. దానితో కోరికలు అనేవి తీరవు అంటారు.

Templeఈ ప్రపంచంలో మన మనసు ప్రశాంతగా ఉన్నప్పుడు ఏదైనా కోరికలు కోరుకుంటే దానికి పకృతి కూడా తోడై మన కోరికలు తీరుస్తుంది అంటారు. మనకు మంచి మనశాంతి దేవాలయంలో దొరుకుతుంది కాబట్టి అక్కడికి గుడ్డు, మాంసం లాంటివి తిని వెళ్ళకూడదు అంటారు. మాంసాహారం తిని దైవ పూజ చస్తే ఆ పూజ ఫలించక పోగా, కీడు జరుగుతుందని శాస్త్రాల్లో ఉన్నట్లు పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే మాంసాహారం తిన్న రోజున ఎవరూ పూజ చెయ్యరు. మాంసాహారానికి బదులు సాత్విక ఆహారం పాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం ఉత్తమం.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR