జాతకరీత్యా ఏ జాతకం వారు ఏ రత్నం ధరించాలో తెలుసా ?

భారతీయ సాహిత్యంలో, ఆధ్యాత్మికతలో తొమ్మిది సంఖ్యకు అగ్రస్థానముంది. నవబ్రహ్మలు, నవరసాలు, నవగ్రహాలు, నవధాన్యాలు, నవనిధులు, నవఖండాలు, నవ ఆత్మ గుణాలు, నవ గ్రహదేశాలు, నవ చక్రాలు, నవదుర్గలు, నవ రత్నాలు మొదలైనవి దీనికి తార్కాణం.

Navratnasప్రాచీన కాలం నుండి భారతదేశం “రత్నగర్భ” అని పేర్కొనబడుతూ ఉంది. రోమన్ చరిత్ర కారుడు “ప్లీవీ” ప్రపంచ దేశాలన్నింటిలో హిందూదేశమే ఎక్కువ రత్నాలను ఉత్పత్తి చేస్తుంది అని ప్రాచీన కాలంలోనే రాసాడు. మన ప్రాచీన గ్రంథాలలో రత్నాల పేర్లు తెలుపడమే గాని, వాటి గుణగణాలు, ఉపయోగాలు, మంచి చెడ్డ జాతులను విడదీసి వివరాలు ప్రథమంగా బుద్ధభట్ట “రత్నపరీక్ష” అనే గ్రంథంలో రాసాడు. తరువాత వరాహమిహిరుడు “బృహత్సంహిత” లోనూ చాలా విషయాలు రాసారు.

Navratnasమహారత్నాలయిన వజ్రం, నీలం, కెంపు, పుష్యరాగం, పచ్చ వీటిని పంచరత్నాలంటారు. వైడూర్యం, గోమేధికం, పగడం, ముత్యం వీటిని ఉపరత్నాలంటారు. రత్నాలలో ఎక్కువ విలువైనది వజ్రం. దీనిని రత్నరాజమంటారు. వజ్రాలు, పచ్చలు. కెంపులు, నీలాలు ఇవి నిజరత్నాలు. వీటిని ఉత్తమ జాతివిగా భావిస్తారు. కాబట్టి ఎక్కువ విలువగలవి, మధ్యమజాతి రత్నాలు, ఆకారపు వయ్యారాలు, స్వచ్ఛత కూడా కలిగి ఉంటే విలువైనవిగా, మిగిలినవి అధమజాతులు చాలా ఉన్నాయి. ఈ నవ రత్నాలనే నవగ్రహ దోషాలకు పరిహారంగా మనం ధరిస్తాం.

Navratnasమన శరీరం ఏడురంగుల సమ్మేళనం. ఈ రంగులలో ఏ ప్రాథమిక రంగు మనలో లోపించినా, ఆ లోపం కారణంగా మనం అనారోగ్యం కొని తెచ్చుకోవడం జరుగుతుంది. రంగు కిరణాల లోపం కారణంగా మనలో వ్యాధులు వచ్చే అవకాశముంది. ఒక వ్యక్తిని సూర్య చంద్రుల ప్రభావం పడకుండా ఒకచోట ఉంచినప్పుడు ఆ వ్యక్తిలో కొన్ని చర్మవ్యాధులు, మరికిన్ని అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి.

Navratnasఈ కాస్మిక్ రేస్ లో కొన్ని మనిషి మీద చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. మనిషి పుట్టిన సమయాన్ని బట్టి జన్మ, నామ నక్షత్రాలను అనుసరించి కొన్ని గ్రహాల ప్రభావం అతడి మీద ఉంటుంది. ఆయాగ్రహాల ప్రభావం వల్ల అతడికి అందే కాస్మిక్ రేస్ కారణంగా అతడికి అనారోగ్యం వస్తుంది. ఐతే, ఆయా గ్రహాలకు సంబంధించిన ప్రత్యేక రత్నాలు ధరించడం వల్ల గ్రహాల నుండి అందే కిరణాల వడపోత జరిగి, ఉపయోగకర కిరణాలు మాత్రమే శరీరంలోకి ప్రవేశిస్తాయి. గ్రహాల నుండి అందే కిరణాల ప్రభావం ఎక్కువ కావచ్చు, లేదా అసలు ప్రభావితం చూపకపోవచ్చు. కాని రత్నం ఆ కిరణాలను న్యూట్రలైజ్ చేసి సరిపడేంత మోతాదులో శరీరానికి గ్రహాల కిరణాల ప్రభావం అందిస్తుంది. కాబట్టి రత్నాలలో దోషాలు, వాటి లక్షణాలను తెలుసుకుంటే రత్నాల వల్ల ప్రయోజనం ఉంటుంది.

Navratnasరత్నధారణం వల్ల కలిగే కష్టాలు తొలిగి, అదృష్టం వరిస్తుందని ఇప్పటికీ విశ్వశిస్తున్నారు. కాని ఎవరు ఏ రత్నము ధరించాలో జాతక రీత్యా గాని,వారి వారి పేర్లను బట్టి గాని నిర్ణయించాల్సి ఉంటుంది. కొందరు జ్యోతిష్కులు(బంగారపు కొట్లవారు కూడ) నవరత్నాల ఉంగరాలు ధరిస్తే ,”సర్వ రోగ నివరిణి ” లా అన్ని గ్రహదోషాలు తొలగిపోతాయని ప్రచారం చేస్తుంటారు. అది సరికాదు. సూర్యాది నవగ్రహాలకు ప్రీతికరమైన రత్నాలు శాస్త్రంలో చెప్పబడింది.

Navratnasనవ గ్రహాల ప్రీతి కోసం, ఆ గ్రహాలకు చెప్పబడిన మంత్ర జపాలు, హోమాలు చేయించి, సంతర్పణం చేసి, నవరత్నాలను దానం చేయాలని శాస్త్రంలో ఉంది. అంతే గాని ఆ రత్నాలను అలాగే ధరించాలని ఎక్కడా లేదు. నవరత్నాలు పొదిగిన ఉంగరాలు గాని,వారి జాతకరీత్య ఒక్క రత్నం గాని బంగారంతో ధరించాలి. రత్నాల ఉంగరాలలోకి ఆ గ్రహదేవతలను ఆవాహనం చేసి పూజ, జపం, దానాలు చేసి ఉంగరాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. అలా చేయకుండా ఉంగరాలు పెట్టుకున్నా ఎటువంటి ప్రయోజనాలు ఉండవు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR