It’s not Journalists they are Killing.. it’s Journalism

0
2886

మొన్నామధ్య ఓ కేసు విషయంలో డిల్లీ కోర్ట్ “మీడియా పర్సన్ కి ఒక కామన్ మేన్ కి మించిన ప్రత్యేక హక్కులేం లేవు” అంటూ తీర్పునిచ్చింది. అంటే.. ఒక జర్నలిస్ట్ కి రిపోర్ట్ చేయడం కోసం లేదా ఇన్విస్టిగేట్ చేయడం కోసం ప్రత్యేకమైన అధికారాలు లేవని నొక్కి వక్కాణించిందన్నమాట. ఈ విషయమై జర్నలిస్టులేవ్వరూ ప్రత్యేకమైన దృష్టి సారించలేదు. ఈమధ్య కాలంలో న్యూస్ ఛానల్స్, వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువయిపోవడం.. కనీసం డిగ్రీ అర్హత కూడా లేనివారు మీడియాలోకి “రిపోర్టర్స్, స్ట్రింగర్స్” అంటూ ఎంట్రీ ఇస్తుండడంతో “జర్నలిస్ట్” అనే పదానికి మాత్రమే కాదు అలా చెప్పుకొనేవారికి కూడా వేల్యూ లేకుండాపోయింది.

ఎక్కడో ఒకరిద్దరు మాత్రమే “జర్నలిస్ట్ విలువలను” కాపాడుతూ జర్నలిజంకు ప్రతీకలుగా నిలుస్తున్నారు. కానీ.. ఆ కొద్ది మందిని కూడా తుదముట్టించి “జర్నలిస్ట్” అనేవాడు కుక్కినపేనులా ఉండాలే కానీ నోరెత్తకూడదు అంటూ డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ మెసేజస్ ఇస్తున్నారు. నిన్న రాత్రి జరిగిన ప్రముఖ జర్నలిస్ట్ మరియు సోషల్ యాక్టివిస్ట్ గౌరీ లంకేష్ దారుణ హత్యా ఉదంతం అందుకు ఉదాహరణ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కాదు.. కేవలం కొందరు బ్యూరోకార్ట్స్ కు ఎదురుగా నిలిచిందన్న ఏకైక కారణంతో ఆమెను కాల్చి చంపడం జర్నలిస్ట్ హక్కులపై మాత్రమే కాదు వారి భద్రత విషయం కూడా చర్చనీయాంశం అయ్యింది. అయితే.. సోషల్ మీడియా పుణ్యమా అని గౌరీ లంకేష్ హత్యా ఉదంతం అంతటా వ్యాపించింది కానీ.. ఈ జర్నలిస్ట్ మారనకాండకు తెరలేచింది 2002లో.

మొట్టమొదటిసారిగా 2002లో “డేరా సచ్చా సౌదా” చీఫ్ రామ్ రహీంకు వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాసి నిజస్వభావాన్ని ప్రపంచానికి పరిచయం చేద్దామనుకొన్న రామచంద్ర ఛత్రపతిని ఆయన కార్యాలయంలోకి చొరబడి మరీ తుపాకీటో కాల్చి చంపారు.
03 Ram Chandra Chatrapatiii
2011లో “మిడ్ డే” పత్రికకు చెందిన క్రైమ్ రిపోర్టర్ జ్యోతిర్మయిని అండర్ వరల్డ్ మాఫియా అంతమొందించింది. అండర్ వరల్డ్ కు పోలీసులకు ఉన్న సత్సంబంధాలను గూర్చి ఆవిడ చేసిన ప్రత్యేక కథనాలే ఆమె హత్యకు కారణం.04 Jyotirmaaiiii
2013లో నరేంద్ర దబోల్కర్ అనే జర్నలిస్ట్ ను గుడి వెనక్కి లాక్కెళ్ళి మరీ కొంతమంది ఆగంతకులు హత్య చేశారు. లోకల్ ఎమ్మెల్యే హస్తం కూడా ఈ మృత్యుకాండ వెనుక ఉందని కథనాలు వచ్చినప్పటికీ.. కొన్నాళ్ళ తర్వాత ఆ విషయాన్ని పోలీసులతోపాటు జనాలు కూడా మర్చిపోయారు.05 Nrendar Doblkar
అదే ఏడాదిలో “హిందీ దైనిక్ దీనబంధు” అనే పత్రికకు చెందిన సాయిరెడ్డి అనే విలేఖరిని నక్సలైట్లు హత్య చేశారు. అయితే.. నక్సలైట్ల రూపంలో లోకల్ గూండాలే ఆ హత్య చేశారనేది వినికిడి.06 Sai Redddy
2013లో “నెట్వర్క్ 18” చానల్ రిపోస్టర్ రాజేష్ ను కూడా తుపాకీటో కాల్చి చంపారు. ఒక పొలిటీషియన్ కొడుకు ఈ హత్యలో ఇన్వాల్వ్ అయ్యాడని టాక్.07 Rajesh

2014లో ఒరిస్సాలోని ఓ లోకల్ స్ట్రింగర్ తరుణ్ కుమార్ ను దారుణంగా రోడ్డుపై హత్య చేసి.. శవాన్ని నరికేసి రోడ్డుపై పడేశారు. ఒక ఎమ్మెల్యేకి చెందిన అక్రమ సంబంధాలను సదరు రిపోర్టర్ బయటపెట్టాలనుకోవడమే అందుకు కారణమననేది అక్కడి పబ్లిక్ టాక్08 Tarun Kumar2014లో ఎంవీయస్ శంకర్ అనే ఆంధ్రా జర్నలిస్ట్ ను కూడా ఆయిల్ మాఫియా మరియు పోలిటికల్ మాఫియా కలిసి హతమార్చాయి.09 Mvn Shankar2015లో అత్యంత దారుణంగా సాజహాపూర్ కు చెందిన రిపోర్టర్ జోగేంద్రను సజీవ దహనం చేశారు. ఉత్తరప్రదేశ్ మంత్రి రామమూర్తికి వ్యతిరేకంగా ఒక ఫేస్ బుక్ పోస్ట్ పెట్టడంతో.. అతడి ఫాలోవర్స్ ఈ ఘాతానికి పాల్పడ్డారని వినికిడి.10 Jogendraaa
అదే తరహాలో అదే సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోనూ సందీప్ కొఠారీ అనే విలేఖరిని దహనం చేసి.. దగ్గరి పోలాల్లో మృతదేహం పడేశారు. కారణం ఎంటనేది ఎవరికీ తెలీదు.12
ఆజ్ తక్ ప్రతినిధి అక్షయ్ సింగ్ ను కూడా “వ్యాపం కుంభకోణం”లో హత్య చేశారు. ఇక రీసెంట్ గా మే 13, 2016లో “హిందీ దైనిక్ హిందూస్టాన్” రిపోర్టర్ ను మరీ దారుణంగా మూడు అడుగుల దూరం నుంచి తుపాకీతో కాల్చి చంపడం సంచలనానికి దారితీసింది. ఆ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. కానీ.. అందుకు ముఖ్యకారణం మాత్రం బీజేపీ ప్రభుత్వం అనే విషయం ఓపెన్ సీక్రెట్.13 Hindu Stan Reporter
ఇవాళ బెంగుళూరులో గౌరీ లంకేష్ హత్యా ఉదంతం.14 Gori Lankesh
ఇలా ఇప్పటివరకూ మరణించిన, చంపబడ్డ జర్నలిస్టులు అందరూ ప్రభుత్వానికో లేక ఏదైనా పవర్ ఫుల్ ఆర్గనైజేషన్ కు వ్యతిరేకంగా గళాన్ని విప్పినవారే.
ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే.. కొన్నాళ్ళకి “జర్నలిస్టులు ఉండేవారు” అని భవిష్యత్ తరాలు చెప్పుకొనే స్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.