జంట అరటిపళ్ళు తాంబూలంలో ఎందుకు పెట్టకూడదు?

0
1310

చాలాసార్లు మనం కొన్న అరటిపళ్ళలో మనకి తెలియకుండానే కవల అరటిపళ్ళు వచ్చేస్తూ వుంటాయి. కవల అరటిపళ్ళు పిల్లలు తినకూడదు పెద్దలు తింటే కవల పిల్లలు పుడతారు కవల అరటి పళ్ళను దేవుడికి పెట్టకూడదు ఇలాంటి నమ్మకాలు మనకి వుంటాయి. అందుకే కవల అరటిపళ్ళను తీసుకోవడానికి ఇష్టపడం.

Thambulamవాటిని పిల్లలకి పెట్టకుండా, దేవుడికి పెట్టకుండా పెద్దవాళ్ళే తింటూ వుంటారు. ఇంతకీ, కవల అరటిపళ్ళను పిల్లలకు పెట్టడం సంగతి అలా వుంచితే, కవల అరటిపళ్ళను దేవతలకు పెట్టకూడదా? ఈ ప్రశ్నకు పండితులు ఏమని సమాధానం ఇస్తున్నారో తెలుసుకుందాం.

Vishnu Murthy‘‘అరటి చెట్టు అంటే మరెవరో కాదు.. సాక్షాత్తూ దేవనర్తకి రంభ అవతారమే. శ్రీమహావిష్ణువు దగ్గర రంభ అందగత్తెనని అహంకార పూరితంగా వ్యవహరించడం వల్ల ఆమెను భూలోకంలో అరటిచెట్టుగా జన్మించమని మహావిష్ణువు శపించాడు. అయితే ఆమె తన తప్పు తెలుసుకుని ప్రాధేయపడటంతో దేవుడికి నైవేద్యంగా వుండే అర్హతను ఆయన ఇచ్చారు. అంత పవిత్రమైన పండులో మనం దోషాలను ఎంచాల్సిన అవసరం లేదు.

Thambulamకవల అరటిపళ్ళను నిరభ్యంతరంగా దేవతలకు అర్పించవచ్చు. అయితే తాంబూలంలో మాత్రం జంట అరటి పళ్ళను పెట్టకూడదు. ఎందుకంటే కవల అరటిపండులో రెండు పళ్ళు ఉన్నప్పటికీ అది ఒక్క పండుకిందే లెక్కలోకి వస్తుంది. మరి తాంబూలంలో ఒక్కపండు పెట్టకూడదు కదా.. అలాగని రెండు కవల అరటిపళ్లు తాంబూలంలో పెట్టామంటే చాలా ఎబ్బెట్టుగా వుంటుంది. అందువల్ల తాంబూలంలో మాత్రం కవల అరటిపళ్ళను పెట్టడానికి వీలుండదని పండితులు చెబుతున్నారు.