కార్తీక మాసం సత్యనారాయణ వ్రతానికి ఎంతో విశేషమైనది!

హిందూ సాంప్రదాయంలో ఆధ్యాత్మికతకు పెద్ద పీట వేశారు. హిందూ క్యాలెండర్ లో ప్రతి మాసానికీ ఒక విశిష్టత ఉంటుంది. కొన్ని మాసాలకు మరింత ప్రత్యేకత ఉంటుంది. పండుగల పేరుతో దైవారాధనకు కేటాయించే ప్రత్యెక సమయాలు ఒక ఎత్తైయితే, ఈ ప్రత్యెక మాసాలకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. భక్తిపూర్వకంగా ఈ మాసాల్లో మేలుగుతుంటారు భక్తజనం. ఇటువంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న వాటిలో అతి ముఖ్యమైనది కార్తీక మాసం. కార్తీక మాసం అనగానే సాధారణంగా పరమ శివునికి ప్రీతి పాత్రమైనదిగా భావిస్తారు. కానీ ఇది విష్ణుమూర్తి ఆరాధనకూ అత్యంత ప్రధానమైన మాసం. ఈ నెలలో ఇటు శైవ క్షేత్రాలు.. అటు వైష్ణవ క్షేత్రాలు అన్నిటిలోనూ ప్రత్యేక పూజాదికాలు నిర్వహిస్తారు.

కార్తీక మాసం ఆరంభం నుండే ‘ఆకాశదీపం ప్రారంభమవుతుంది. ఉదయం, సాయంత్రం ఆలయాలు, పూజామందిరాలు, తులసి కోట వద్ద దీపారాధన చేస్తే ఇహ, పర సౌఖ్యాలు కలుగచేస్తుంది. ఈ మాసంలో ప్రతి సోమవారంతో పాటు ….ఉత్థానైకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి, కార్తీక పౌర్ణమి వంటి దినాలు ప్రశస్తమైనవి. ఈ మాసానికి కౌముది మాసం అని మరో పేరు కూడా ఉంది.

ఈ మాసంలో దీపాలను రెండు రకాలుగా పిలుస్తారు. ఒకటి కార్తీక దీపం, రెండోది ఆకాశ దీపం. సాయంకాల సమయంలో ఇంటి వాకిట్లో వెలిగించేది ఆకాశ దీపం. కార్తీక దీపంలో రెండు వత్తులు కలిపి రెండు రెండుగా వేయడం లేదా మూడు వత్తులు కలిపి వేయడం విశేషం. ఎన్ని వత్తులు వేయాలనేది వారి గురువుల సలహా మేరకు భక్తులు ఆచరిస్తూ ఉంటారు.

deepam lampఇందుకు పత్తి, తామర నార, అరటి నార వంటి వాటిని ఉపయోగిస్తారు. కార్తీకంలో దీప దానానికి ఒక విశిష్టత ఉంది. ఈ మాసంలో ఒకసారి దీప దానం చేసిన వారికి సంవత్సరమంతా చేసిన ఫలితం దక్కుతుంది.
అందుకే కార్తీకమాసంలో నెలంతా దీపదానాలు చేస్తుంటారు.

deepamఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్‌ ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలు పారాయణ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇక అన్ని దేవతలకి ప్రతీయకయైన గోవుని దూడతో కలిపి పూజిస్తారు. గోవును పూజించలేనివారు శక్తికొలది గోవుకు గ్రాసాన్ని ఇస్తారు. ఆవులను సేవించడం వల్ల వంశవృద్ది జరుగుతుంది. ఈ నెలలో తులసికి పూజచేయడం, తులసి కళ్యాణం విశేషంగా చేస్తారు. మాఘేవా, మాధవేమాసిం కార్తీకేవా శుభేదినే అని సత్యనారయణ స్వామి వ్రతకథలో ఉంటుంది.

మాఘమాసంలో గానీ, చైత్ర మాసంలో గాని, కార్తీక మాసంలో గాని ఒక శుభదినాన సత్యనారాయణ వ్రతము ఆచరించాలి. ఈ మాసంలో సత్యనారాణస్వామిని ప్రధానంగా ఆచరించడానికి కారణం కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు. ఈ మాసంలో పౌర్ణమినాడు సత్యనారాయణ వ్రతం ఆచరిండం విశేషం.

ఈ మాసంలో ఉసిరికాయలను దీపసహితంగా దానం చేయడం, ఉసిరికాయ మీద వత్తి వెలిగించి దానమివ్వడం చేస్తారు. అన్ని మాసాల్లోకి విశేషమైన కార్తీక మాసాన్ని దైవస్వరూపంగా భావించి ప్రత్యేక పూజలు దానధర్మాలు చేస్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR