యుగాంతాన్ని ముందుగానే తెలిపే కేదారేశ్వర ఆలయ రహస్యాలు!

యుగాంతం గురించి మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం. ఎన్నో కథలు, సినిమాలు, నవలల్లో కూడా యుగాంతానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. ఇక పరిశోధనల గురించి అయితే చెప్పనవసరం లేదు, అవి లెక్కకు మించి. లయ కారకుడైన ఈశ్వరుడి ఆదేశం మేరకే ఈ యుగం అంతం అవుతుందని, కలియుగాంతం తరువాత ఈ భూమండలం మీద ఒక్క జీవి కూడా ఉండదని మన పురాణాలు చెబుతున్నాయి. భారత పురాణాలను బట్టి ఈ ప్రపంచాన్ని నాలుగు యుగాలుగా విభజించారు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ప్రస్తుతం మనం ఉంటున్నది కలియుగంలో. ప్రతీ యుగం తరువాత భయంకరమైన ప్రళయం సంభవించి యుగం అంతమవుతుందని పురాణాలు చెబుతున్నాయి.

kedareshwar temple in harishchandragadఈ యుగాంతం విషయమై ధార్మిక, వేదభూమిగా పిలవబడే మన భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా కొన్ని కథలు ఉన్నాయి. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. యుగాంతాన్ని సూచించే కొన్ని సంఘటనలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇక మన దేశంలో అయితే కొన్ని ఆలయాల్లో కలియుగాంతం ని తెలిపే కొన్ని సంకేతాలు ఉన్నాయి. అందులో ఒకటే కేదారేశ్వర గుహాలయం.

kedareshwar temple in harishchandragadఇది మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో ఉన్న హరిశ్చంద్ర కోటకు కుడి వైపున ఉంది. ఇది ఒక అద్భుతమైన కట్టడం. నాలుగు స్తంభాల మీద పెద్ద బండరాయి, దాని కింద 12 అడుగుల శివలింగం రూపంలో కేదారేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ గుహ లోపలి భాగంలో 4- 6 మంది భక్తులు కూర్చుని పూజ, ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఒక గది కూడా ఉంది. ఈ శివ లింగాన్ని భూమి నుంచి 6 అడుగుల ఎత్తులో ఉండేటట్టు నిర్మించారు.

kedareshwar temple in harishchandragadఈ ఆలయంలో నాలుగు స్తంభాలు నాలుగు యుగాలకి ప్రతీకలని భక్తులు భావిస్తారు. ఒక్కో యుగాంతానికి 24గంటల ఒక్కొక్క స్తంభం విరుగుతూ, కలియుగానికి ఒకటే స్తంభం మిగిలిందని. ఎప్పుడైతే ఈ స్తంభం విరిగిపోతుందో, అదే కలియుగానికి ఆఖరు రోజనీ నమ్ముతారు. లింగం చుట్టూ ఉండాల్సిన నాలుగు స్తంభాలు లో 3 స్తంభాలు విరిగిపోయి ఒకటి మాత్రమే మిగిలింది. విశేషం ఏమిటంటే, అయితే విరిగిపోకుండా ఉన్న ఒక్క స్తంభం అంత పెద్ద రాతి బండను ఎలా మోస్తోందన్న విషయం అంతు చిక్క‌డం లేదు.

kedareshwar temple in harishchandragadదీనిపై పరిశోధనలు చేసినా అది సమాధానం లేని ప్రశ్న గానే మిగిలిపోయింది. అలాగే ఇక్కడ మ‌రో విశేషం కూడా ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన 4 గోడల నుండి ప్రతిరోజు నీరు గుహలోకి వస్తుంది. శివలింగం చుట్టూ వేసవి, శీతాకాలాలలో 5 అడుగుల ఎత్తులో చాలా చల్లని నీరు ఉంటుంది.

kedareshwar temple in harishchandragadకాని, వర్షాకాలంలో చుక్క నీరు కూడా గుహలోకిరాదు, నిలవదు. ఈ విషయంపై కూడా పరిశోధనలు జరిగిన జవాబులేని ప్రశ్నగానే మిగిలిపోయింది. అదెలాగన్న ప్రశ్నకూ ఇంతవరకు సమాధానం కనిపెట్టలేకపోయారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR