మహాభారత యుద్ధం సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి కలిగిన సంసయాలను తీర్చడానికి బోధించినదే ఈ భగవద్గీత. శ్రీకృష్ణుడు బోధించిన దానిని వ్యాస మహర్షి మనకు 18 అధ్యాయాల రూపంలో వివరించారు. హిందువుల యొక్క పరమ పవిత్ర గ్రంథం భగవద్గీత. మరి భగవద్గీత కులవ్యవస్థను ప్రోత్సహిస్తుందా? అసలు కుల వ్యవస్థ ఎలా వచ్చిందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కులమంటే నివాసమని అర్ధం. పూర్వకాలంలో కొన్ని వృత్తులు కొన్ని నివాసాలకే పరిమితమైనాయి. అయితే కాలక్రమంలో వృత్తులే కులాల క్రింద పరిగణించబడ్డాయి. అలా వచ్చిందే ఈ కులం అనే పదం. అది క్రమంగా వివక్షకు దారి తీసి కులతత్వం గా నిలద్రొక్కుకొని రాజకీయరంగంలోకి ప్రవేశించింది.
భగవద్గీత ప్రబోధించేది సనాతన వర్ణాశ్రమ వ్యవస్థ. ఇది దేవతలలో కూడా ఉన్నదీ. వర్ణాశ్రమ ధర్మాలు ఆచరిస్తేనే సమాజానికి పురోగతి. లేకపోతే అధోగతే. అయితే వర్ణాలు నాలుగు అవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. అలానే ఆశ్రమాలు నాలుగు అవి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం.
అయితే మనం కులాలుగా అనుకుంటున్న వర్ణాలు అన్ని కూడా వివిధ వృత్తులే. అందులో పురోహితులు దేశాన్ని రక్షించగా, క్షత్రియులు పాలించేవారుగా, వాణిజ్య, కృషి, గో సేవలు చేసేవారిగా వైశ్యులు, ఇక ఈ మూడు వృత్తుల వారికీ సహాయం చేసే వారే శూద్రులుగా నాలుగు వర్ణాలు వివరించబడ్డాయి. ఏ వృత్తి వారికి ఆ ధర్మాలున్నాయి, ఎవరి వృత్తి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తూ, అన్యోన్యంగా పరస్పరం ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ అన్ని వృత్తుల వారు ఒకరికి ఒకరు తోడుపడుతూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలి.
గీత నాలుగోవ అధ్యాయం ప్రకారం, ఈ ప్రపంచమంతా నాలుగు వర్ణాలుగా ఉంది. వాటిని దైవ, మనుష్య, తిర్యక్ స్థావరాలని కొంతమంది, ఇంకా బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, సామజిక వర్గాలని మరి కొందరు అంటారు. ఆయా జీవుల పూర్వ జన్మ సంస్కారాలను బట్టి అనగా గుణకర్మలని బట్టి వారికీ అనుగుణమైన సామజిక వృత్తి విభాగాలలో వారిని ప్రవేశపెడతాను వీటికి కర్మలు, గుణాలే కారణం కానీ నేను కాదు అని భగవంతుడు చెప్పాడు.
ఏ జీవి అయినా తన గుణాలను, నిపుణతల్ని బట్టి ఏ వృత్తిలోకి అయినా మారిపోవచ్చని చెప్పాడు. ప్రస్తుతం ప్రపంచం అంత ఉన్న వృత్తులు నాలుగు. అవి వ్యవసాయం, పరిశ్రమలు, రాజ్యాంగం, రాజకీయం. ఇందులో వ్యవసాయంతో ప్రారంభించి అన్ని వృత్తులోకి వెళ్లే అవకాశం ఉంది.
అయితే ఈ నాలుగు వర్ణాలు ఒకదానిపై ఒకటి ప్రభావం చూపుకుంటూ నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటూ ఉంటాయి. దీనితో అరాచకం ప్రబలుతుంటుంది. ఈ నాలుగు స్థంబాలు పటిష్టంగా నిలబడి, ప్రపంచం పురోగమించాలంటే, శాంతి నెలకొనాలంటే ఆధ్యాత్మికత, విశ్వజనీన విలువలు, కళలు అంతః సూత్రాలే చిత్తశుద్ధితో ఆచరింపబడాలి. అందుకే రామానుజ దర్శనంలో కులమత ప్రస్తవన లేదు.
ఏ వర్ణంలోని వారైనా అందరితో సమానంగా పరువు, ప్రతిష్టలతో సహజీవనం సాగించి, సాయుజ్య మోక్షాన్ని భగవంతుడి అనుగ్రహంతో పొందుతారు. సాధనమార్గంలో ఉన్నవాడికీ లౌకిక సమస్యల్లో ఉన్నవాడికీ ఇద్దరికీ వర్తించేది భగవద్గీత. అందుకే సర్వమానవాళి కోసం పుట్టిందే భగవద్గీత.