కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిని ఎదురించగల శక్తి ఉన్నదీ ఎవరికీ?

0
3957

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో అతి భయంకరుడు భగదత్తుడు. పాండవుల సైన్యాన్ని వణికించడమే కాకుండా శ్రీ కృష్ణుడే లేకుంటే అర్జునుడిని సైతం మట్టుబెట్టగల శక్తిమంతుడు భగదత్తుడు. అయితే భగదత్తుడు శ్రీ కృష్ణుడి పైన ప్రతీకారం తీర్చుకోవడం కోసమే కౌరవుల పక్షాన చేరుతాడు. మరి భగదత్తుడు ఎవరి కుమారుడు? అతడి దగ్గర ఉన్న దివ్యాస్రం ఏంటి? శ్రీ కృష్ణుడి పైన అతడికి పగ ఎందుకు? కురుక్షేత్ర యుద్ధం లో అతడిని ఏవిధముగా మట్టుబెట్టారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Krishna Arjunaభగదత్తుడు నరకాసురుడి కుమారుడు మరియు భూదేవి మనువడు. ఇక పూర్వం, హిరణ్యాక్షుడు భూమిని సముద్ర గర్భంలో దాచిపెట్టినప్పుడు, జలప్రళయంలో మునిగిపోయిన భూమిని ఉధ్ధరించటానికి శ్రీ మహావిష్ణవు వరాహరూపాన్నిదాల్చి హిరణ్యాక్షుడు ని సంహరించి భూమిని పైకి తీసుకువస్తాడు. అప్పుడు భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వలన ఒక కుమారుడు జన్మిస్తాడు. అతడే నరకాసురుడు. అయితే భూదేవి తన కొడుకు రక్షణ కోసం, దేవతల చేతిలో గానీ దానవుల చేతిలో గానీ చనిపోకుండా ఉండడం కోసం వైష్ణవాస్త్రాన్ని అర్థించింది. అప్పుడు తన తల్లి చేతిలోనే మరణిస్తాడు అంటూ వైష్ణవాస్త్రాన్నిభూదేవికి ప్రసాదిస్తాడు. అప్పుడు భూదేవి ఆ వైష్ణవాస్త్రాన్ని తన కుమారుడైన నరకాసురునికి ఇస్తుంది. ఈ అస్రాన్ని నరకాసూరుడు తన కుమారుడైన భగదత్తుడుకి ఇస్తాడు. ఈ అస్రం అన్ని అస్రాల్లో కంటే ఎంతో వేగవంతమైన అస్రం. వైష్ణవాస్త్రానికి ఎదురుండదు. ఇంద్రుడూ రుద్రుడూ కూడా దానికి లొంగాల్సిందే. అంతేకాకుండా నరకాసురిడి దగ్గర సుప్రతికమనే పొగరు మోతు ఏనుగుంది. అది ఇంద్రుడి ఏనుగైన ఐరావత వంశానికి చెందిన ప్రసిద్ధమైన ఏనుగు అని చెబుతారు. ఇది అత్యంత శక్తివంతమైన ఏనుగు.

Krishna Arjunaఇక నరకాసురుడి దగ్గర నుండి అతడి మరణాంతరం వైష్ణవాస్త్రాన్ని, ఆ ఏనుగును పొందుతాడు భగదత్తుడు. భగదత్తుడూ సుప్రతీకమూ కలిసి యుద్ధం చేస్తే ఎదుటి వారు హడలి పోయేవారు. అయితే శ్రీకృష్ణుడు తన తండ్రిని చంపాడని కృష్ణుడి పైన ప్రతీకారం తీర్చుకోవడం కోసం కౌరవుల పక్షాన చేరుతాడు. ఇలా యుద్ధం లో అడుగుపెట్టిన భగదత్తుడూ 12 వ రోజున యుద్ధ రంగంలో విరుచుకుపడ్డాడు. పాండవుల సైన్యాన్ని మట్టుబెడుతుంటే అటుగా భీముడు వెళ్లి భయంకర యుద్ధం చేస్తుండగా, శ్రీ కృష్ణుడు ముందు భగదత్తుడూ వైపుకు వెళ్లి అతడిని ఎలా అయినా రాజు అంతం చేయాలంటూ రథాన్ని భగదత్తుడూ వైపుకు పంపాడు.

Krishna Arjunaఅర్జునుడు బాణవర్షం కురిపిస్తూ వస్తుండగా, భగదత్తుడు తన ఏనుగుతో ధనంజయుడి మీదకు దూసుకొని వచ్చాడు. ఇద్దరూ తుములమైన యుద్ధం చేయడం ప్రారంభించారు. సుప్రతీకం అక్కడి ఏనుగుల్నీ రథాల్నీ రథికుల్నీ గుర్రాల్నీ ఆశ్వికుల్నీ యమలోకానికి పంపించే పని అవిచ్ఛి న్నంగా సాగిస్తూనే ఉంది. భగదత్తుడి పద్నాలుగు ఇనప గదల్ని ముక్కలు చేసేశాడు అర్జునుడు. ఏనుగు కవచాన్ని ఛేదించి, ఆ మీద బాణవర్షంతో దాన్ని ముంచెత్తాడు అర్జునుడు. అది వర్ష ధారలతో చిత్తడిసిన పర్వతంలా తయారయింది. భగదత్తుడి రాజఛత్రాన్నీ ధ్వజాన్నీ ముక్కలు చేసి, వాడి అయిన బాణాలతో అతన్ని దెబ్బతీశాడు. కోపంతో భగదత్తుడు తన చేతిలో ఉన్న అంకుశాన్నే వైష్ణవాస్త్ర మంత్రంతో అభిమంత్రించి అర్జునుడి మీదకు విసిరాడు. వైష్ణవాస్త్రం అన్నిటినీ సర్వనాశనం చేస్తుందని తెలిసిన కృష్ణుడు అర్జునుడికి అడ్డుగా వచ్చి ఆ అస్త్రాన్ని తన వక్షస్సు మీద గ్రహించాడు. అది కృష్ణుడి మెడలో వైజయంతీమాలగా మారిపోయింది.

Krishna Arjunaఅప్పుడు కృష్ణుడు వైష్ణవాస్త్రం తాలూకు అమోఘత్వాన్ని వివరించి చెప్పాడు: ‘దాన్ని నేను తప్ప ఎవరూ నాశనం చెయ్య లేరు. ఇప్పుడది పోయింది గనక ఆలస్యం చేయకుండా, వాడి నాన్నను లోకహితం కోసం నేను చంపినట్టు, నువ్వు ధర్మం కోసం భగదత్తుణ్ని అంతం చెయ్యి అని చెప్పాడు.

Krishna Arjunaఅయితే ఇక్కడ శ్రీకృష్ణుడికి ఒక రహస్యం తెలుసు, అదేంటంటే, భగదత్తుడి కనిపించనంతగా రెప్పలు వాలిపోయి మూసుకు పోయాయి. కళ్లను తెరిచి ఉంచడానికి రెప్పల్ని పైకి పట్టి ఉంచేలాగ ఒక దళసరి పట్టీతో నొసటి మీద కట్టుకొని ఉంటాడు. ఈ పట్టీ రహస్యం శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పి ముందస్తుగా అతని రెప్పలక్కట్టిన పట్టీని కొట్టి వాడి కళ్లు మూసుకొనిపోయేలాగ చెయ్యి అంటూ ఉపాయాన్ని ఉపదేశించాడు. కృష్ణుడి ఉపదేశాన్ని అర్జునుడు అమలు చేశాడు. భగదత్తుణ్ని బాణాలతో ముంచెత్తి, అతని ఏనుగు కుంభస్థలాన్ని బాణంతో వేటు వేశాడు. ఏనుగు తటాలున కూలిపోయింది. అతని రెప్పల్ని కట్టిన పట్టీని అర్జునుడు భగదత్తుడికి లోకమంతా చీకటిమయమై పోయింది. అప్పుడు ఒక అర్ధచంద్ర బాణంతో భగదత్తుడి గుండెను చీల్చగానే అతను నేలకూలిపోయాడు.

ఈవిధంగా నరకాసురుడి కుమారుడైన భగదత్తుడు కురుక్షేత్ర యుద్ధం లో అర్జునుడి చేతిలో మరణిస్తాడు.

SHARE